EPAPER

Bald Head Treatment : బట్టతల ఉందా.. అయితే చలో ఇస్తాంబుల్..!

Bald Head Treatment : బట్టతల ఉందా.. అయితే చలో ఇస్తాంబుల్..!
Hair Transplantation

Bald Head Treatment : టర్కీ రాజధాని ఇస్తాంబుల్ పేరు మనలో చాలామంది వినే ఉంటారు. మన తెలుగు సినిమాల్లో అనేక పాటలు కూడా అక్కడే చిత్రీకరించారు. అయితే, ఇస్తాంబుల్ మరో విషయంలో ప్రపంచంలోనే పేరున్న నగరంగా పేరొందుతోంది. బట్టతల బాధితుల తలపై తిరిగి జుట్టు మొలిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బట్టతల బాధితులను హెల్త్ టూరిజం పేరుతో ఆహ్వానిస్తోంది.


తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సేవలతో ఏటా 15 – 20 లక్షల బట్టతల బాధితులైన క్లయింట్లకు సేవలందించి, భారీగా విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అయితే.. ఇక్కడి చికిత్స చాలా ధనిక దేశాల కన్నా చాలా చౌక. అమెరికాలో 20వేల డాలర్ల వరకూ ఖర్చయ్యే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇస్తాంబుల్‌లో కేవలం 2 వేల డాలర్ల ఖర్చుతో పూర్తవుతుంది. అంటే.. భలే చౌక బేరమే అన్నమాట.

టర్కీకి చికిత్స కోసం వచ్చేవారిలో 67% మంది ప్రైవేట్ హాస్పిటల్స్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చినవారేనంటే అక్కడ ఆ రంగం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.


ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందిన నగరాలుండగా.. ఇస్తాంబుల్ మాత్రమే ఈ వ్యాపారంలో నంబర్ వన్‌గా నిలవటానికి పలు కారణాలున్నాయి. మొదటిది – అక్కడ తగినంతమంది డాక్టర్లు, ఇతర సిబ్బంది ఉండడం, రెండోది – అక్కడి ప్రభుత్వం ‘హెల్త్ టూరిజం’ ని బాగా ప్రమోట్ చేయడం, మూడోది..టర్కీ ఇంకా ‘అభివృద్ధి చెందుతున్న’ దేశం గనుక బడ్జెట్ ధరలో చికిత్సను అందించగలగటం. నాల్గవది.. యూరోప్, ఆసియా, ఆఫ్రికా దేశాలకు సమీపంగా ఉండటం.

హెల్త్ టూరిజం పేరుతో.. టర్కీ ప్రభుత్వం అక్కడ ఈ రంగానికి సంబంధించిన వైద్యలను, ఇతర సహాయ సిబ్బందిని ప్రోత్సహించేలా పలు సబ్సిడీలను అందిస్తోంది. ఇదంతా ప్యాకేజీ నమూనాలోనే ఉంటుంది. మీ అ
విగ్గు వాడటం ఇష్టంలేని వారు ఇక్కడి నిపుణులను సంప్రదిస్తే చాలు..

ఇది డాక్టర్ల చేత చేయబడుతుంది. ఒక్కసారి తలపై జుట్టు మొలిపించే ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి వచ్చేయవచ్చు. కాకపోతే.. కొన్ని వారాలపాటు మొలకల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ఇక ఆ కొత్త జుట్టు ఊడిపోదు. అంతేకాదు.. స్వదేశానికి వచ్చాక కూడా ఓ సహాయకుడు మూడు నెలల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సప్‌లో మీరు పంపిన ఫోటోలు, వీడియోలను పరిశీలించి సలహాలూ సూచనలు ఇస్తాడు. దీనికి అదనపు రుసుమేమీ ఉండదు. ఇదంతా ప్యాకేజీలో భాగమే.

ఇక.. వైద్యం కోసం అక్కడి కొచ్చే వారి బసకు స్టార్ హోటల్లో రూమ్, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, అందుబాటులో ఉండే అనువాదకులు.. ఇవన్నీ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఒక్క టిక్కెట్టు ఖర్చులు మాత్రమే అదనం. దీనివల్ల చికిత్స ఖర్చు మీద వెళ్లేవారికి ముందుగానే స్పష్టమైన అవగాహన వస్తుంది.

జుట్టు సమస్యలతో వచ్చే వారికి, వారి సహాయకులకు అనుబంధంగా దంత వైద్యం, శరీర బరువు తగ్గింపు లాంటి సేవలన్నీ సరసమైన ధరలకే అక్కడి ఆసుపత్రులు అందిస్తున్నాయి. ఇక.. టూరిజం సంగతి చెప్పేదేముంది. దీంతో యువత, నడివయసు పురుషులు ఇస్తాంబుల్ బాట పడుతున్నారు. ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతూ పోవటం విశేషం.

అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు వెచ్చించకుండానే.. తాను ఎంచుకున్న రంగంలో పరిమితమైన పెట్టుబడితో.. వేలాది మందికి ఉపాధి, లక్షలాది మందికి చికిత్సలు అందిస్తూ.. బోలెడంత విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఈ బుల్లి దేశాన్ని చూసి.. ‘అభివృద్ధి నమూనా గురించి మాట్లాడే నేతలంతా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపించకమానదు.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×