EPAPER

India vs Bangladesh : నెక్ట్స్ మ్యాచ్ లో జట్టు కూర్పులో మార్పులుంటాయా?.. వాళ్లిద్దర్నీ తప్పిస్తారా?

India vs Bangladesh : నెక్ట్స్ మ్యాచ్ లో జట్టు కూర్పులో మార్పులుంటాయా?.. వాళ్లిద్దర్నీ తప్పిస్తారా?

India vs Bangladesh : 3 మార్పులు.. టీ20 వరల్డ్ కప్ లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్ పై విజయం సాధించిన రోహిత్ సేన మూడో మ్యాచ్ లో దక్షిణాఫ్రియా చేతిలో ఓటమి చవిచూసింది. నాలుగో మ్యాచ్ లో బుధవారం బంగ్లాదేశ్ తో టిమిండియా తలపడుతుంది. ఆడిలైడ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే సెమీస్‌ కు సులువుగా చేరువడానికి అవకాశం దక్కుతుంది. బంగ్లాదేశ్ తో తలపడే టీమిండియాలో మూడు మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు దూరమైన అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. వికెట్ కీపర్ దినేష్‌ కార్తీక్‌ గాయం బారిన పడటంతో పంత్‌ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఆడిలైడ్‌ పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది. పిచ్ కండీషన్ బట్టి అదనపు పేసర్‌తో భారత్‌ బరిలోకి దిగాలని భావిస్తోంది. అశ్విన్‌ స్థానంలో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్ బరిలోకి దిగి డకౌట్ అయిన దీపక్‌ హుడాకు మరో అవకాశం దక్కదని స్పష్టమవుతోంది.


రాహుల్ పై విశ్వాసం.. వరసగా 3 మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ పై జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పూర్తి విశ్వాసం ప్రకటించాడు. పాకిస్తాన్ పై (4 పరుగులు), నెదర్లాండ్స్‌ పై (9 పరుగులు), సౌతాఫ్రికాపై (9 పరుగులు)తో మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దీంతో రాహుల్‌ను తప్పించి అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనింగ్‌ పంపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే రాహుల్ అద్భుతమైన ఆటగాడని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నాడని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఈ బ్యాటర్ కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ లాంటి బౌలర్లను ఎదుర్కొని రాహుల్‌ హాఫ్ సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. తదుపరి మ్యాచ్‌లలో అతడు రాణిస్తాడనే భావిస్తున్నామన్నాడు. ఆసీస్‌ పిచ్‌ లపై చక్కగా ఆడగలడని రాహుల్ ఆట తీరుపై సంతృప్తిగానే ఉన్నామన్నాడు. తనదైన రోజు అతడు చెలరేగగలడని ద్రవిడ్‌ ధీమా వ్యక్తం చేశాడు.


వరుణుడి ముప్పు.. మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా ఈ మ్యాచ్‌ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్ కుమార్

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×