EPAPER
Kirrak Couples Episode 1

Rohit Sharma : రోహిత్ దూకుడు సాటెవ్వరు?

Rohit Sharma : రోహిత్ దూకుడు సాటెవ్వరు?
Rohit Sharma

Rohit Sharma : ఎక్కడా తడబాటు లేదు..
ఒక్క పొరపాటు లేదు..
ఎక్కడా బెదురన్నదే లేదు
ఇక తిరుగన్నదే లేదు..
అది ఎవరో కాదు..
దూకుడుకి బ్రాండ్ అంబాసిడార్  గా నిలుస్తున్న
హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్..రోహిత్ శర్మ..
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పదికి పది విజయాలతో టీమ్ ఇండియా జైత్రయాత్రను కొనసాగిస్తున్న కెప్టెన్ గెలుపు చివరి మెట్టు మీద ఉన్నాడు..
ఎన్నో సెంటిమెంట్లను తిరగరాశాడు. సెమీస్ లో కివీస్ అన్నారు. అదెక్కడికో పోయింది. ఇంకొకటి ఇంకొకటి అన్నారు. అన్నీ తుఫాను గాలికి కొట్టుకుపోయినట్టు పోతున్నాయి.


టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో ఈ ప్రస్థానం వెనుక రోహిత్ శర్మ ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. అప్పుడు రోహిత్ వయసు 24 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టేశాడు. 2011 వరల్డ్ కప్ టీమ్ లో అందరి పేర్లూ ఉన్నాయి. కానీ రోహిత్ శర్మది లేదు. దీంతో చాలా బాధపడ్డాడు. ఈ విషయం స్వయంగా రోహిత్ చెప్పడం విశేషం.

అప్పుడు వరల్డ్ కప్ చూడకూడదని అనుకున్నా. కానీ మనవాళ్లు ఒకొక్క స్టెప్ దాటి వెళుతుంటే టీవీ ముందు కూర్చుని ఎంజాయ్ చేశా. కానీ నేనూ ఆడితే ఎంత బాగుండేది అని ప్రతిక్షణం ఫీలయ్యా నని అన్నాడు. కానీ తనకన్నా వెనుక కెరీర్ ప్రారంభించిన కొహ్లీకి అవకాశమిచ్చి, రోహిత్ ని పక్కన పెట్టారు.


అయితే రోహిత్ ను వద్దని నాటి కెప్టెన్ ధోనీ అన్నాడని, అతని ప్లేస్ లో పీయూష్ చావ్లాని తీసుకోమని చెప్పాడని మాజీ సెలక్టర్ రాజా వెంకట్ సంచలన విషయం తెలిపాడు. ఇప్పటికే బ్యాటర్లు దండీగా ఉన్నారు. ఆ ప్లేస్ లో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లాని తీసుకుంటే బౌలింగ్ లో పనిచేస్తాడని అన్నాడని తెలిపాడు.

అప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టన్ కూడా రోహిత్ కే ఓటు వేశాడు. ఎవరెంత చెప్పినా ధోనీ వినలేదని అన్నాడు. చివరికి కెప్టెన్ మాటని కాదనలేక రోహిత్ ని పక్కన పెట్టామని చెప్పుకొచ్చాడు.

ఈ విషయంపై రోహిత్ మాట్లాడుతూ తర్వాత 2015, 2019 వరల్డ్ కప్ లో ఆడాను. సెమీస్ వరకు వెళ్లాం. కానీ ముందుకు తీసుకువెళ్లలేకపోయామని అన్నాడు. కానీ ఇప్పుడు ఫైనల్ మెట్టుపై ఉన్నాం. ప్రపంచ కప్ తీసుకురావడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని తెలిపాడు.

2011లో తనని సెలక్ట్ చేయలేనందుకే వరల్డ్ కప్ లో తనేమిటో నిరూపించుకోవాలని రోహిత్ కసిగా ఆడుతున్నాడని అనేవాళ్లు కూడా ఉన్నారు.

నిజానికి నాడు వరల్డ్ కప్ కొట్టిన టీమ్ లో రోహిత్ లేడు. కానీ ఇప్పుడు కెప్టెన్ గా ఉండి జట్టుని విజయపథంలో నడిపిస్తున్నాడు. నిజంగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం కూడా ఒక గొప్ప విజయమని చెప్పక తప్పదు.

వరల్డ్ కప్ లో ఓపెనర్ గానే కాదు, కెప్టెన్ గా కూడా అద్భుత వ్యూహాలతో జట్టు విజయంలో రోహిత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. గ్రౌండ్ బయట ఉండి, ఎన్ని సలహాలైనా చెప్పవచ్చు. కానీ గ్రౌండ్ లోపల ఉన్నప్పుడు ఒత్తిడిలో అప్పటికప్పుడు వ్యూహాలు మార్చాలి.  ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలకు తగినట్టుగా ఫీల్డర్లను సెట్ చేయాలి. బౌలర్లను ప్రయోగించాలి. ఇవన్నీ సమర్థవంతంగా చేస్తున్నాడు.

ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్ లో కివీస్ తో ఆడేటప్పుడు ఒక టెన్షన్ నడిచింది. కెప్టెన్ విలియమ్సన్, మిచెల్ ఇద్దరూ కలిసి గెలిపించేలాగే కనిపించారు. అప్పుడు టీమ్ అందరితో కలిసి, జట్టుగా చేయిచేయి పట్టుకుని, అందరిలో స్ఫూర్తి రగిలించాడు. అందరం కలిసికట్టుగా పోరాడదామని ఒక సమైక్య భావాన్ని చాటాడు. ఆ మంత్రం పనిచేసింది.

డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటూ బ్యాటర్లకు సందేశాలు పంపడం, వారిని గైడ్ చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. వీటన్నింటికి మించి రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి పవర్ ప్లేలో ఆడుతున్న తీరు, అందిస్తున్న శుభారంభాలు జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

తను అవుట్ అవగానే ఆ బాధ్యతను గిల్ తీసుకుంటున్నాడు. వీరిందించే పికప్ ని కొహ్లీ జాగ్రత్తగా నిలబెడుతున్నాడు. తర్వాత వస్తున్న శ్రేయాస్, రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది.

ఇంతవరకు రోహిత్ శర్మ 550 పరుగులు చేశాడు. అయితే మెగా టోర్నీ మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఫస్ట్ మ్యాచ్ లోనే రోహిత్ డకౌట్ అయి వెనుతిరిగాడు. తర్వాత మళ్లీ వెనుతిరిగి చూడలేదు. పాకిస్తాన్ పై 86, న్యూజిలాండ్ పై 46, శ్రీలంకపై 4, నెదర్లాండ్ పై 61, ఆఫ్గనిస్తాన్ పై 131, బంగ్లాదేశ్ పై 48, ఇంగ్లండ్ పై 87, సౌతాఫ్రికాపై 40 ఇలా చేశాడు.

ఇక్కడ చూస్తే 3 ఆఫ్ సెంచరీలు, 2 సెంచరీల దగ్గర అవుట్ అయిపోయాడు. తను మనసు పెడితే వాటిని మార్చవచ్చు.
 కానీ కెప్టెన్ గా వ్యక్తిగత ప్రయోజనాలకన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించి, అప్పుడు కూడా స్కోర్ పెంచడమే లక్ష్యంగా రిస్కీ షాట్లు ఆడి అవుట్ అయిపోయాడు. ఇది కదా కెప్టెన్సీ అంటే అని అందరూ కొనియాడుతున్నారు.

ఇక టీమ్ ఇండియా పదికి పది విజయాలతో అప్రతిహితంగా సాగిపోతోంది. ఇక ఆ ఒక్క మ్యాచ్ గెలిపించేస్తే రోహిత్ కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోతాడు.

Related News

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Big Stories

×