EPAPER
Kirrak Couples Episode 1

Rahul Dravid : చక్ దే రాహుల్.. ‘రాహుల్ గెలవాలి’ అంటూ అభిమానుల పోస్టింగులు

Rahul Dravid : చక్ దే రాహుల్.. ‘రాహుల్ గెలవాలి’ అంటూ అభిమానుల పోస్టింగులు
Rahul Dravid latest news

Rahul Dravid latest news(World cup today news):

2007 సంవత్సరం భారత్ లో క్రికెటర్ల ఇళ్లపై దాడులు జరిగాయి. అభిమానుల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఆఖరికి సచిన్ టెండూల్కర్ ని వదల్లేదు. మహేంద్ర సింగ్ ధోనీని వదల్లేదు. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇంటిని వదల్లేదు. ఆ రోజుల్లో అంటే 16 ఏళ్ల క్రితం.. క్రికెటర్ల ఇళ్ల దగ్గర ప్రొటెక్షన్ ఇవ్వడానికి.. ఇప్పటిలా సరైన పోలీసు బలగాలు లేవు.


క్రికెటర్లు ఇళ్లల్లో ఆడవాళ్లు, పిల్లలు, తల్లిదండ్రులు అందరిలో ఎంతో ఆందోళన.. హడలిపోయారు. ఒకొక్క చోట అయితే క్రికెటర్ల ఇళ్లకి నిప్పు కూడా పెట్టడానికి రెడీ అయ్యారు. భారతదేశంలో పలుచోట్ల క్రికెటర్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. శవయాత్రలు చేశారు. నిజానికి అప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ దెబ్బకి అందరికీ అనుమానాలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ దెబ్బకి రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. జట్టులో ఆటగాడిలా ఉంటానని తెలిపాడు.
ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే.. ఇప్పటిలాగే అప్పుడు కూడా 2007లో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఈసారిలా కాకుండా అప్పుడు నాలుగు గ్రూపులు పెట్టారు. ఒకొక్క గ్రూప్ లో నాలుగు జట్లు ఉంటాయి. అందులో టాప్ టూ లో ఉన్నవాళ్లు సెకండ్ ఫేజ్ కి వెళతారు.

అలా నాలుగు గ్రూప్స్ నుంచి 8 జట్లు తలపడతాయి. అలా సెమీస్, తర్వాత ఫైనల్స్ ఇదీ సీక్వెన్స్ అన్నమాట. టీమ్ ఇండియా గ్రూప్ దశ నుంచే బయటకి వచ్చింది. దాంతో భారతదేశంలో ప్రజల కోపం నషాళానికి అంటింది. వ్యవహారం అంత దూరం వెళ్లింది. ఇది రాహుల్ ద్రవిడ్ జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవం. కట్ చేస్తే.. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు వెళ్లిన విన్నింగ్ టీమ్.. టీమ్ ఇండియాకు కోచ్ ఎవరంటే.. ఆనాడు అవమానాలు పడిన రాహుల్ ద్రవిడ్. వరుసగా విజయాలు సాధిస్తున్న టీమ్ ఇండియా లో సీనియర్లకి రెస్ట్ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. సెమీస్, ఫైనల్ కి రెడీ చేయాలని అంటే.. రాహుల్ ఒప్పుకోలేదు. చచ్చినట్టు ఆడాల్సిందేనని చెప్పాడు. దీంతో ముఖ్యంగా సీనియర్లు ఆడక తప్పలేదు. గెలుస్తున్నాం కదా అని.. ప్రాక్టీసుని ఎక్కడా ఆపలేదు. అందరికన్నా ముందే లేచి.. బాయ్స్ అని పిలిస్తే చాలు.. దట్టమైన మంచులో కూడా ఆటగాళ్లందరూ పరుగెత్తాల్సిందే.


శ్రేయాస్ అయ్యార్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ కి అవుట్ అయిపోతుంటే.. రెండురోజులు తన బ్యాటింగ్ మీదే ఫోకస్ పెట్టి, దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేశాడు. శ్రేయాస్ ఎలా దంచి కొడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు అలా ద్రవిడ్ వెనుక ఉండి జట్టునంతా సన్నద్ధం చేయడం ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది.

అంతేకాదు ఫీల్డ్ లో ఆడుతున్న ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు వాటర్ బాటిల్స్ పేరుతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ పంపించి నడిపించిన తీరు అమోఘం. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కొహ్లీ చాలా నెమ్మదిగా ఆడి విమర్శల పాలయ్యాడు. కేవలం సెంచరీ కోసం బాల్స్ వేస్ట్ చేశాడని ఒక వర్గం ట్రోల్ చేసింది. అందుకు కొహ్లీ బదులిస్తూ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన సూచన మేరకే స్లోగా ఆడాను. 45 ఓవర్ల వరకు వికెట్ వదలొద్దని చెప్పారని అన్నాడు. ఈ సూచన పంపించింది ఎవరని అనుకుంటున్నారు..రాహుల్ ద్రవిడే కదా…

కెప్టెన్ రోహిత్ శర్మ పవర్ ప్లే లో ఎటాకింగ్ ప్లే ఆడాలని సూచన చేసింది కూడా రాహుల్ ద్రవిడ్ అనే చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో అతని ప్లేస్ లో ఫాస్ట్ బౌలర్ కావాలని ప్రసిద్ధ్ క్రష్ణని తీసుకొచ్చారు. అందుకు ద్రవిడ్ సమాధానం ఏమిటంటే స్పిన్నర్లకు బ్యాకప్ అశ్విన్ ఉన్నాడు. కానీ బ్యాట్స్ మన్లకి బ్యాకప్ ఉన్నారు. ఆల్ రౌండర్ షార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో ఎవరైనా గాయపడితే మరొకరు లేరని ప్రసిద్ధ క్రష్ణని తెచ్చినట్టు తెలిపాడు. ఇది రాహుల్ స్ట్రాటజీ.

ఇలా జట్టుతో అనుక్షణం ఉంటూ.. ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తూ, సూచనలిస్తూ జట్టుని వెనుక నుంచి శ్రీక్రష్ణుడిలా నడుపుతున్న రాహుల్ ద్రవిడ్ కే క్రెడిట్ అంతా దక్కాలని అప్పుడే కొందరంటున్నారు. ఒకవేళ ఫైనల్ లో ఇండియా నెగ్గితే రాహుల్ ద్రవిడ్ కన్నా ఆనందించేవారు మరొకరుండరు. లెజండరీ క్రికెటర్ గా పేరుపొందిన ద్రావిడ్, తన క్రీడా జీవితంలో ఉన్న ఒక మచ్చను తొలగించుకునే ఒక సువర్ణావకాశం ఎంతో దూరంలో లేదు. అదే జరిగితే టీమ్ ఇండియా ద్రవిడ్ కి ఇచ్చే నిజమైన బహుమతిగా చెప్పాలి.

భారతదేశ కీర్తి పతాకం ఎగురవేయడానికి ద్రవిడ్ కి ఉన్న చివరి అవకాశం…ఈసారేం ప్లాన్ చేస్తాడో చూడాల్సిందే. అన్నట్టు వరల్డ్ కప్ తోటే ద్రవిడ్ అగ్రిమెంట్ కూడా అయిపోతోంది. అన్నీ అలా కలిసి వస్తున్నాయి. చక్ దే అని షారూఖ్ ఖాన్ సినిమా ఒకటి వచ్చింది. రాహుల్ ద్రవిడ్ స్టోరీ చదివిన వారు.. ఆ సినిమా ఒకసారి చూడండి. ఇంచుమించు ఒకటే కథ. అందులో హాకీ లో షారూఖ్ కీలక ఆటగాడిగా ఉంటాడు. ఫైనల్ మ్యాచ్ లో విఫలం కావడంతో ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటాడు. కట్ చేస్తే మహిళా హాకీ జట్టుకి కోచ్ గా వెళతాడు. మళ్లీ భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు. తనని ఛీ కొట్టిన ప్రజలతో మళ్లీ సత్కారాలు పొందుతాడు. రేపు ద్రావిడ్ ని కూడా అలాగే చూద్దాం.. ఆల్ ది బెస్ట్ చెబుదాం.

ఫైనల్ మ్యాచ్ ముందు కోచ్ ద్రవిడ్ ఏమన్నాడంటే, నేనిప్పుడు ఆటగాడిని కాదు. ఆ దశ దాటిపోయింది. అదంతా మరిచిపోయాను. ఇప్పుడు నేను కోచ్ ని…ఇది వాస్తవం. మనుషులెప్పుడు వాస్తవంలో ఉండాలి. గతాన్ని తవ్వకుంటూ కూర్చోకూడదు. భవిష్యత్తుని తలచుకుంటూ కలలు కంటూ కూర్చోకూడదు. వర్తమానంలో మనం ఏమిటి? అనేదే ఆలోచించాలని చెప్పాడు.

Related News

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Big Stories

×