EPAPER
Kirrak Couples Episode 1

Babar Azam : పాక్ కెప్టెన్ బాబర్ సంచలనాత్మక నిర్ణయం

Babar Azam : పాక్ కెప్టెన్ బాబర్ సంచలనాత్మక నిర్ణయం
Babar Azam

Babar Azam : వన్డే వరల్డ్ కప్ 2023 సంచలనాలకు నిలయంగా మారింది. ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. శ్రీలంక బోర్డుని ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేస్తే, శ్రీలంక సభ్యత్వాన్నే ఐసీసీ రద్దు చేసి పారేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న జట్లకు సేవలందిస్తున్న విదేశీ కోచ్ లు పలువురు రాజీనామాలు చేశారు. ఆ సిరీస్ లోనే భాగంగా  పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు.


ఈ నిర్ణయంతో బాబర్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అంతేకాదు తన నిర్ణయంపై పాక్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నువ్వెళ్లిపోతే..కొత్తవాడు ఎవడున్నాడు? నీకన్నా గొప్పోడున్నాడా? అందరూ దొందూ దొందే కదా… కొత్త కెప్టెన్ వచ్చినంత మాత్రాన ఆట తీరు మారిపోతుందా? అని పోస్టులు పెడుతున్నారు.  

బాబర్ ఒక్కడే ఆడేటట్టు అయితే మిగిలిన 10మంది జట్టులో ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఏ కెప్టెన్ అయినా ఇచ్చిన టీమ్ తో ఆడతాడు తప్ప, తనొక్కడే అద్భుతాలు చేయలేడని అంటున్నారు. అందుకు కెప్టెన్ ని బలితీసుకోవడం కరెక్ట్ కాదు, అతనితో పాటు ఆట సరిగ్గా ఆడని వాళ్లని కూడా తీసిన పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.


ఆల్రడీ పాక్ టీమ్ కి కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అందరికీ ఉద్వాసన చెప్పాలని పాక్ బోర్డు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇకపోతే బాబర్ కూడా పరిస్థితులను గమనించినట్టున్నాడు. సీనియర్లు కూడా సలహా ఇచ్చినట్టున్నారు. పరిస్థితులు బాగా లేదు.. రాజీనామా చేసేయమని అని ఉంటారు. దాంతో అతను డిసైడ్ అయ్యాడు

అన్ని ఫార్మాట్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ” ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ తప్పదు. ఇది సరైన సమయమని భావిస్తున్నా. మూడు ఫార్మాట్లలో ఒక ప్లేయర్‌గా పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కు జట్టుకు సహాయ సహాకారాలు అందిస్తా ” అని బాబర్ పోస్ట్‌లో పేర్కొన్నాడు

 వరల్డ్ కప్ 2023కి ముందు వరల్డ్ నెం.1 ర్యాంకు ఆటగాడిగా బరిలోకి దిగాడు. కానీ.. వరుస వైఫల్యాలతో ఆ ర్యాంకు పొగొట్టుకున్నాడు. అంతేకాదు.. ఈ మెగాటోర్నికి ముందు మంచి ఫామ్ లో ఉన్న బాబర్ ఈ వరల్డ్ కప్ 2023లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు.  తొమ్మిది మ్యాచులాడి 320 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదండీ సంగతి. ఇప్పటికైనా మరి పాక్ లో మంటలు ఆరుతాయా? లేవా? అన్నది చూడాలి.

Related News

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Big Stories

×