EPAPER

Team India : న్యూజిలాండ్ తో సెమీస్ పోరు.. టీమిండియా బలహీనతలు ఇవేనా..?

Team India : న్యూజిలాండ్ తో సెమీస్ పోరు.. టీమిండియా బలహీనతలు ఇవేనా..?
Team India

Team India : టీమ్ ఇండియా సెమీస్ పోరునకు సర్వసన్నద్ధమైంది. చూడటానికి అంతా బాగానే ఉంది. కానీ చివరి నిమిషంలో ఒత్తిడిని జయించగలిగితే సగం విజయం సాధించినట్టే అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరగనున్న సెమీఫైనల్ కు ఇండియా బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.


ఇదే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై ధర్మశాలలో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ ఫీల్డర్లు మూడు క్యాచ్ లు వదిలేశారు. డారెల్ మిచెల్ క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర బుమ్రా వదిలేశాడు. అప్పటికి 69 పరుగులతో ఉన్న మిచెల్ తర్వాత 130 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ బౌలింగ్ లో రవీంద్ర జడేజా లాంటి అద్భుత ఫీల్డర్ సింపుల్ క్యాచ్ వదిలేశాడు. కేఎల్ రాహుల్ కూడా ఒక క్యాచ్ మిస్ చేశాడు. సెమీస్ లో ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని అభిమానులు కోరుతున్నారు.

భారత ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉంది. వరుసగా గెలవడం వల్ల ఇవి హైలైట్ కావడం లేదు. ముఖ్యంగా సిరాజ్ క్యాచ్ లు వదిలేస్తున్నాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు క్యాచ్ లు వదిలేశాడు. అంతకు ముందొకటి వదిలేశాడు. కివీస్ తో అలా జరిగిందంటే జట్టుకి శాపంగా మారుతుంది. పాక్ జట్టు అలాగే ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ క్యాచ్ వదిలి తగిన మూల్యం చెల్లించుకుంది. అలాగే ఆఫ్గాన్ .. మాక్స్ వెల్ క్యాచ్ వదిలి ఇంకా భారీ మూల్యం చెల్లించుకుంది.  


ఇప్పుడు సిరాజ్ నాకౌట్ లో ఇలాగే చేస్తే కొంపలంటుకుపోతాయి. బహుశా మనవాళ్ల ఫీల్డింగ్ విన్యాసాలు తెలిసే బీసీసీఐ బెస్ట్ ఫీల్డర్ అవార్డు ప్రవేశపెట్టిందని కూడా అంటున్నారు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ లో ఫోర్లు వదిలేస్తున్నాడు. వళ్లు వంచలేకపోతున్నాడు. కోహ్లీ కూడా డైవ్స్ చేయడం లేదు. కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ విషయంలో ఇంకా మెరుగ్గా ఉండాలి.

ఇక ఇండియా బలాలు తెలుసుకోవాలంటే.. ముఖ్యంగా ఇంతవరకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అదిరిపోయే శుభారంభాలు ఇస్తున్నారు. పవర్ ప్లేను చక్కగా ఉపయోగించుకుని బ్రహ్మండంగా ఆడుతున్నారు. వీరిలో రోహిత్ లేదా గిల్ ఎవరు నిలబడినా ఇండియా సగం మ్యాచ్ గెలిచినట్టే. ఎందుకంటే తర్వాత వచ్చేవారికి పని సులువు అవుతుంది. భారం తగ్గుతుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వీరోచిత ప్రదర్శన ఆకట్టుకుంటోంది. తొందరపడటం లేదు. తాపీగా ఆడుతున్నాడు. స్ట్రయిక్ రేట్ ని రొటేట్ చేస్తూ జట్టుకి వెన్నుముకలా ఉన్నాడు. సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల్లో తన అనుభవం ఎంతో అవసరం.

శ్రేయాస్ మొదట్లో ఆందోళన పెట్టినా ట్రాక్ ఎక్కేశాడు. తన సహజ సిద్ధమైన ఆటతీరుతో కళాత్మకమైన షాట్స్ ఆడుతున్నాడు. అవసరమైనప్పుడు గేర్ మార్చి, రన్ రేట్ తగ్గకుండా చూస్తున్నాడు. కేఎల్ రాహుల్ క్లాసికల్ బ్యాటింగ్ కి పెట్టింది పేరు. తను కీలక సమయాల్లో అనవసరంగా అవుట్ కాకుండా బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ కి ఇంకా నిరూపించుకునే సరైన అవకాశాలు ఎక్కువ రాలేదు. ఇంగ్లాండ్ మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. తను అలా ఆడటం వల్లే జట్టు స్కోరు 200 దాటింది. బౌలర్లు ఇంగ్లాండ్ ను నిలువరించగలిగారు. లేదంటే ఫలితం మరో ఉండేదేమో. బౌలింగ్ లో పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీ అద్భుతంగా ఆడుతున్నారు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో షమీకి వికెట్లు పడలేదు. ఇది ఆందోళన కలిగించే విషయం.

ఇదండీ సంగతి…ఇండియా బలాలు, బలహీనతలు.. మరి వీటన్నింటిని అధిగమించి ఎలా విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

.

.

.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×