EPAPER

 New Zealand Team : న్యూజిలాండ్ బలహీనతలు ఇవే .. ఆ నలుగురే కీలకం..

 New Zealand Team : న్యూజిలాండ్ బలహీనతలు ఇవే .. ఆ నలుగురే కీలకం..
 New Zealand Team

New Zealand Team : వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీస్ పోరుకి సర్వం సన్నద్ధమైంది. ఇక్కడ నుంచి మరో రెండు మెట్లు ఎక్కితే వరల్డ్ కప్ ను సగర్వంగా తీసుకువచ్చే అవకాశమైతే ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యర్థి న్యూజిలాండ్ బలాలే కాదు బలహీనతలను అందరూ అంచనా వేస్తున్నారు. అవెలా ఉన్నాయో మీరూ చూడండి..


న్యూజిలాండ్ మ్యాచ్ లో ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంతవరకు 359 పరుగులు చేశాడు. సెమీఫైనల్ లో దుమ్ముదులిపితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇక కొత్త కుర్రాడు రచిన్ రవీంద్ర  (565) అద్భుతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా వీరిద్దరినీ తప్పనిసరిగా నిలువరించాల్సి ఉంది.

ఫస్ట్ డౌన్ లో వస్తున్న కెప్టెన్ విలియమ్సన్ (187) గాయంతో చివర్లో టీమ్ తో కలిశాడు. బాగానే ఆడుతున్నాడు. సెకండ్ డౌన్ వచ్చే డారీ మిచెల్ (418) పరుగులతో ఆకట్టుకుంటున్నాడు. ఇండియాపై జరిగిన మ్యాచ్ లో సెంచరీ కూడా చేశాడు. ఇలా వీళ్ల నలుగురిని ఆపగలిగితే మ్యాచ్ లో సగం విజయం సాధించినట్టే అంటున్నారు. ఇక కివీస్ మిడిలార్డర్ లో వచ్చే టామ్ లాథమ్ (155), మార్క్ చాప్ మన్ (82)  అంత గొప్పగా ఆడటం లేదు. గ్లెన్ ఫిలిప్స్ (244) విధ్వంసం సృష్టించగలడు. కానీ ఓవర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్నింగ్స్ నిర్మించడం అతని వల్ల కావడం లేదు.


ఇక బౌలింగ్ విషయాని వస్తే, కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 16 వికెట్లు తీశాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ అతనికి సహకారం అందించే మరో నాణ్యమైన స్పిన్నర్ టీంలో లేడు. రచిన్ రవీంద్ర (5), గ్లెన్ ఫిలిప్స్ (6), ఐష్ సోధీ (0) మాత్రమే ఆ టీంకు ఉన్న ఆప్షన్స్. వీరిలో సోధీ ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.

ఇక ఫాస్ట్ బౌలింగ్ కి వస్తే ట్రెంట్ బౌల్ట్ (13), మాట్ హెన్రీ (11), ఫెర్గ్యూసన్ (10) వికెట్లు తీసి పర్వాలేదనిపిస్తున్నారు. కానీ ప్రభావంతంగా మాత్రం చేయలేకపోతున్నారు. అందుకనే కివీస్ స్టార్టింగ్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లు నెగ్గి, తర్వాత వరుసగా ఓడిపోయింది. ఎట్టకేలకు చివరి మ్యాచ్ శ్రీలంకపై గెలిచి బతుకుజీవుడా అంటూ సెమీస్ బెర్త్ కన్మర్మ్ చేసుకుంది.

అందువల్ల కివీస్ బౌలింగ్ లో స్పిన్నర్ శాంటర్న్ తప్ప అంతా బలహీనంగా ఉంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నలుగురిని ఆపగలిగితే విజయం ఇండియాదే అంటున్నారు. ఇప్పటి వరకు 13 వరల్డ్ కప్‌లలో కివీస్ ఇలా సెమీస్ చేరడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం. రెండుసార్లు ఫైనల్ కి వెళ్లి ఓటమి పాలైంది.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×