EPAPER

SpaceX World Record : కక్ష్యలోకి 1000 టన్నులు.. స్పేస్‌ఎక్స్ వరల్డ్ రికార్డు

SpaceX World Record : కక్ష్యలోకి 1000 టన్నులు.. స్పేస్‌ఎక్స్ వరల్డ్ రికార్డు

SpaceX World Record : స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్(SpaceX) మరో మైలురాయిని అధిగమించింది. భూకక్ష్యలోకి 1000 మెట్రిక్ టన్నుల ద్రవ్యరాశిని ప్రవేశపెట్టిన తొలి అస్ట్రోనాటిక్స్ కంపెనీగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కంది. ఈ నెల 11న ట్రాన్స్‌పోర్టర్-9 మిషన్‌ను చేపట్టడం ద్వారా స్పేస్ఎక్స్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.


ఆ మిషన్‌లో భాగంగా వివిధ క్లయింట్లకు చెందిన 90 పే‌లోడ్లను ఏకకాలంలో రోదసిలోకి పంపింది. క్యూబ్‌శాట్లు, మైక్రోశాట్లు, ఆర్బిటాల్ ట్రాన్స్‌ఫర్ వెహికల్స్ వంటివి 90 పేలోడ్లలో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది వెయ్యిటన్నులకు పైగా మాస్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంస్థగా రికార్డు సాధించిందంటూ స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఆనందాన్ని ఎక్స్-యూజర్లతో షేర్ చేసుకున్నారు.

మరే ఇతర దేశం కన్నా ఒక ఏడాదిలో అధిక రాకెట్లను ప్రయోగించిన సంస్థగా రికార్డు సాధించిందని మస్క్ పేర్కొన్నారు. స్పేస్ఎక్స్‌కు అతి సమీపంలో ఉన్న పోటీదారు రష్యా. ఆ దేశం 500 టన్నుల మాస్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. మిగిలిన దేశాలన్నీ కలిసి ఈ ఏడాదిలో కక్ష్యలోకి చేర్చిన మాస్ మొత్తం 250 టన్నులు మాత్రమే.


90 పేలోడ్లును కక్ష్యలోకి చేర్చడం గొప్ప విషయమే అయినా.. ఇదే అత్యధిక సంఖ్య కాదు. స్పేస్ ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్-1 మిషన్‌దే ఇప్పటివరకు రికార్డు. 2021 జనవరిలో ఆ మిషన్ ద్వారా 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఇక ఈ ఏడాది జనవరిలో నింగికెగసిన ట్రాన్స్‌పోర్టర్-6 ద్వారా 114 శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ట్రాన్స్‌పోర్టర్-9 ఈ ఏడాదిలో స్పేస్‌ఎక్స్‌కు 82వ ఆర్బిటాల్ మిషన్. ఒక ఏడాదిలో ఇన్ని మిషన్లను చేపట్టడమూ రికార్డే. ఈ ఏడాది ప్రయోగాలన్నీ స్టార్‌లింక్ విస్తరణకు సంబంధించినవే. ప్రస్తుతం 5 వేల వరకు స్టార్‌లింక్ శాటిలైట్లు పనిచేస్తున్నాయి.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×