EPAPER

Chandra Mohan : లక్కీస్టార్.. చంద్రమోహన్ తో నటించిన హీరోయిన్లకు ఆ సెంటిమెంట్ ఎందుకు ?

Chandra Mohan : లక్కీస్టార్.. చంద్రమోహన్ తో నటించిన హీరోయిన్లకు ఆ సెంటిమెంట్ ఎందుకు ?
Chandra Mohan

Chandra Mohan : సినీ ఇండస్ట్రీలో చాలా వరకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వినడానికి మనకు విచిత్రంగా ఉన్న ఒక్కసారి సినీ ఇండస్ట్రీలో బలంగా ఒక సెంటిమెంట్ సెట్ అయిందంటే ఇక దానికి తిరుగు ఉండదు. ఇదే రకంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల ఒక సెంటిమెంట్ బలంగా పాతుకు పోయింది. ఆ ఒక్క హీరోతో నటిస్తే ఎటువంటి హీరోయిన్ కైనా దశ తిరగాల్సిందే అనేది ఆ సెంటిమెంట్. ఆయనెవరో కాదు.. నటుడు చంద్రమోహన్. ఆయన ఎంతమంది హీరోయిన్ల కెరియర్ గ్రాఫ్ పెంచాడో ఓ లుక్ వేద్దాం పదండి..


మల్లంపల్లి చంద్రశేఖర రావు.. అదేనండి చంద్రమోహన్.. ముద్దుగా బొద్దుగా ఏ క్యారెక్టర్ కన్నా ఇట్టే సెట్ అయిపోయే చంద్రమోహన్ ఎందరో హీరోయిన్లకు లక్కీ స్టార్. వరుస ప్లాపులతో బాధపడే హీరోయిన్ అయినా సరే ఒక్కసారి చంద్రమోహన్ తో మూవీ చేస్తే ఇక ఆమె కెరియర్ గ్రాఫ్ సెట్ అయిపోయినట్లేనని కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఇది.

వాణిశ్రీ దగ్గర నుంచి శ్రీదేవి వరకు.. జయసుధ దగ్గర నుంచి జయప్రద వరకు.. చాలామంది చంద్రమోహన్ తో సినిమా చేశాక విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మంచి ఆఫర్స్ వాళ్లకోసం క్యూ కట్టడమే కాకుండా, స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్లు అయ్యారు. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల పాటు చంద్రమోహన్ తో మూవీ చేస్తే ఆ హీరోయిన్ లైఫ్ సెట్ అయినట్టే అన్న ఇంప్రెషన్ బలంగా ఉండేది.


చంద్రమోహన్ తో కలిసి నటించిన ఎందరో హీరోయిన్లు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ లోనే కాకుండా మిగిలిన సినీ ఇండస్ట్రీలలో కూడా అగ్ర తారలుగా వెలిగారు. 1967 లో చంద్రమోహన్ హీరోగా పరిచయమైన చిత్రం రంగులరాట్నం. ఈ మూవీలో ఆయనతోపాటు కలిసిన నటించిన వాణిశ్రీ ఆ తరువాత ఎంత పెద్ద నటిగా మారిందో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి ముందు వాణిశ్రీ సపోర్టింగ్ రూల్స్ లో నటించేవారు.. ఆ తర్వాత ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీ ను కొన్ని సంవత్సరాల పాటు అగ్రతారగా ఏలింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు.

1976 కళాతపస్వి కే .విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన అద్భుతమైన చిత్రం సిరిసిరిమువ్వ. ఈ మూవీలో చంద్రమోహన్ తో పాటు హీరోయిన్ గా జయప్రద నటించారు. అప్పటికే జయసుధ భూమి కోసం,సీతా కల్యాణం,శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్,మాంగల్యానికి మరో ముడి,అంతులేని కథ లాంటి పలు చిత్రాలలో నటించింది. అయితే చంద్రమోహన్ తో ఈ మూవీ చేసిన తర్వాత జయప్రద కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఒకరకంగా ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా జాక్పాట్స్ తగిలాయి. 

టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవికి కూడా లైఫ్ ఇచ్చింది చంద్రమోహన్ తో నటించిన పదహారేళ్ళ వయసు చిత్రమే. 1978లో రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీదేవి ,చంద్రమోహన్ తో కలిసి నటించింది. అప్పట్లో ఎన్టీ రామారావు గారి కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించినప్పుడు శ్రీదేవి నటన నచ్చి ఆయన వెంటనే వేటగాడు చిత్రానికి ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక అక్కడ నుంచి కొనసాగిన శ్రీదేవి విజయ్ పరంపర ఎలాంటిదో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు.

సహజ నటి జయసుధ 1978లో ప్రాణం ఖరీదు అనే చిత్రంలో చంద్రమోహన్ తో కలిసి నటించారు. ఆ తర్వాత కూడా చాలా చిత్రాలలో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. మెల్లిగా జయసుధకు అగ్ర హీరోల సరసన ఆఫర్స్ రావడమే కాకుండా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. 1983లో విజయశాంతి చంద్రమోహన్ తో కలిసి పెళ్లిచూపులు అనే మూవీలో నటించింది. ఇక ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతిఘటన చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం హీరోయిన్గా విజయశాంతిని వేరే లెవెల్ కి తీసుకువెళ్ళింది. మంచి గుర్తింపు రావడంతో పాటు స్టార్ హీరోలతో ఆఫర్స్ వరుసగా క్యూ కట్టాయి. ఇలా చంద్రమోహన్ తో కలిసి నటించిన ఎందరో హీరోయిన్లు ఆ తరువాత మంచి సక్సెస్ అందుకున్నారు.. అందుకే కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్ అని అప్పట్లో ఇండస్ట్రీలో ఫుల్ టాక్ ఉండేది.

Related News

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Big Stories

×