Narayankhed : తెలంగాణ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆఖరి క్షణాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు మారుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం ముందుగా మాజీ ఎంపీ, సీనియర్ నేత సురేష్ షెట్కర్ కు టిక్కెట్ ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవడం సంచలనం రేపుతోంది.
తొలుత టికెట్ కోసం సంజీవరెడ్డి, సురేష్ షెట్కర్ తీవ్రంగా పోటీపడ్డారు. అయితే హైకమాండ్ ముందు సురేశ్ షెట్కర్ వైపే మొగ్గు చూపింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరిరోజు వరకు ప్రయత్నించారు. ఆయన ఆశలు ఫలించాయి. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్ తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు పలికారు. దీంతో సంజీవరెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం హాట్ గా టాపిక్ గా మారింది.
.
.