EPAPER
Kirrak Couples Episode 1

New Zealand vs Srilanka : శ్రీలంక, కివీస్ మ్యాచ్ లో… నయా రికార్డ్స్!

New Zealand vs Srilanka :  శ్రీలంక, కివీస్ మ్యాచ్ లో… నయా రికార్డ్స్!

New Zealand vs Srilanka : బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కివీస్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆ జట్టులో ఒకరు, ఈ జట్టులో ఒకరు వరల్డ్ కప్ లో కొత్త రికార్డులు సృష్టించారు. అయితే కివీస్, శ్రీలంక రెండు జట్లకు…ఈ మ్యాచ్ జీవన్మరణ పోరుగా మారింది.


 కివీస్ గెలిస్తేనే సెమీస్ కు చేరుతుంది. అటు నుంచి శ్రీలంక గెలిస్తేనే పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరి ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అవుతుంది. ఇలా రెండు జట్లు డిసైడింగ్ గేమ్ ఆడుదామనే బరిలోకి దిగాయి. కానీ దురదృష్టవశాత్తు శ్రీలంక ఓడిపోయింది. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది కూడా డౌట్ గా మారింది.

ఎందుకంటే పట్టికలో తనపైన ఇంగ్లండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. వారింకా చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆ జట్లు ఓటమి పాలైనా సరే, మెరుగైన రన్ రేట్ తో ఉన్నాయి. కాబట్టి శ్రీలంక దారులు దాదాపు మూసుకుపోయినట్టే అని చెప్పాలి.


ఇదిలా ఉండగా వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అయితే ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులతో హోరెత్తించారు.

కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 600 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. 34 ఏళ్ల బౌల్ట్ 2012 లో ఫస్ట్ వన్ డే ఆడాడు. ఇప్పటికి 11 సంవత్సరాలుగా ఆడుతున్నాడు.

ఒక ఫాస్ట్ బౌలర్ కి ఇది సుదీర్ఘ సమయమే. బహుశా వచ్చే వరల్డ్ కప్ కి తను ఆడే అవకాశమైతే లేదు. 2023 చివరి వరల్డ్ కప్ లో రెండు రికార్డులు సాధించి ఘనంగా ముగింపు పలికాడనే చెప్పాలి. ఇకపోతే ఐపీఎల్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బౌల్ట్ ఆడుతున్నాడు.

శ్రీలంక నుంచి చూస్తే.. ఈ మ్యాచ్‌లో 22 బాల్స్‌లోనే 51 పరుగులు చేసిన కుశాల్ పెరీరా.. 2023 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. తను కూడా ఎటాకింగ్ లో ఎదురెళ్లాడు. ఆస్ట్రేలియా మాక్స్ వెల్, పాక్  ఫకర్ జమాన్ లా ఆడుతున్నాడేమో అనిపించింది. కానీ తొందరగానే అవుట్ అయిపోయాడు.

Related News

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Big Stories

×