EPAPER
Kirrak Couples Episode 1

Kodangal : కొడంగల్‌లో ఆపరేషన్ అంబులెన్స్.. టార్గెట్ రేవంత్ రెడ్డి?

Kodangal : తెలంగాణ ఎన్నికల్లో ‘పుష్ప మార్క్’ కనిపిస్తోందా? సినిమా సన్నివేశాల్ని సీన్ టు సీన్ దించేస్తున్నారా? సాధారణంగా ఓటింగ్‌కు ముందు డబ్బు పంపకాలు జరిగేవి. ఇప్పుడు అధికార పార్టీ అడ్వాన్స్ అయిందా? చివర్లో తప్పటడుగులు పడతాయనే భయంతో ఆఖరి పోరాటాన్ని ఆల్రెడీ మొదలుపెట్టేసిందా?

Kodangal : కొడంగల్‌లో ఆపరేషన్ అంబులెన్స్.. టార్గెట్ రేవంత్ రెడ్డి?

Kodangal : తెలంగాణ ఎన్నికల్లో ‘పుష్ప మార్క్’ కనిపిస్తోందా? సినిమా సన్నివేశాల్ని సీన్ టు సీన్ దించేస్తున్నారా? సాధారణంగా ఓటింగ్‌కు ముందు డబ్బు పంపకాలు జరిగేవి. ఇప్పుడు అధికార పార్టీ అడ్వాన్స్ అయిందా? చివర్లో తప్పటడుగులు పడతాయనే భయంతో ఆఖరి పోరాటాన్ని ఆల్రెడీ మొదలుపెట్టేసిందా? 400 కిలో మీటర్ల మేర నడిరోడ్డుపై కనిపించిన సీన్.. కాంగ్రెస్ ఆరోపణలు.. అసలు సిసలు వేడి రాజేశాయి. ఇంతకీ ఏం జరిగింది? బిగ్‌టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ చదవండి.


అర్థరాత్రి.. కుయ్‌కుయ్ మంటూ సైరన్.. ఖాళీ రోడ్లపై 108 అంబులెన్స్ రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది.. ఒకటి కాదు.. రెండు అంబులెన్స్‌లు.. అదేంటి? ఒకేసారి రెండు అంబులెన్సులేంటి? మరీ, అంత సీరియెస్ విషయమా?
ఏదో డౌట్.

మొదట ఈ అంబులెన్స్ ములుగులో కనిపించింది. పాపం.. ఎవరికో ఎమర్జెన్సీ కావొచ్చు. అర్జెంటుగా వరంగల్ హాస్పిటల్‌కు తీసుకెళుతున్నారేమోనని అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ అంబులెన్సులు వరంగల్‌లో ఆగకుండా.. రాయగిరి టోల్‌గేట్ దాటేసాయ్.. హైదరాబాద్ తీసుకెళుతున్నారేమో అని భ్రమపడ్డారు. కానీ.. సిటీలోనూ ఆగలేదు. అలాగే తాండూరు మీదుగా దూసుకుపోయింది. కొడంగల్ వైపు టాప్ గేర్‌లో మాయమైపోయాయి.


ఇక్కడే అనేక డౌట్స్. రెండు అంబులెన్స్‌లు దాదాపు 400 కి.మీ. ఎందుకలా పరుగులు పెట్టాయి? అందులో ఎవరున్నారు? అసలు.. ఎవరైనా ఉన్నారా?

ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. 400 కిలోమీటర్ల పరిధిలో ఎన్నో చెక్‌పోస్టులు ఉన్నాయి. అయినా, రెండు అంబులెన్స్ లు ఇలా వెళ్తున్నా ఎవరూ ఆపలేదు ఎందుకు? పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికి పోయారు? అంబులెన్సులు అంత స్వేచ్ఛగా అర్థరాత్రి.. వందల కిలోమీటర్లు ఎలా చక్కర్లు కొట్టగలిగాయి?

పైస్థాయిలో ఏదో జరిగిందా? ఆ అంబులెన్సులో ఇంకేదో ఉందా? నోట్ల కట్టలు తరలిస్తున్నారా? కోట్లకు కోట్లు ఎవరికైనా అందజేస్తున్నారా?. ముందు ములుగులో ఆ అంబులెన్సులు కంటబడ్డాయంటే.. సీతక్కను ఓడించేందుకు అధికార పార్టీకి దండిగా డబ్బులు డంప్ చేశారా? అనే అనుమానం.

ములుగు నుంచి కొడంగల్ వైపు వెళ్లిందంటే.. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని పంతం పట్టిన బీఆర్ఎస్.. అధికార పార్టీ కోసం అర్థరాత్రి రహస్యంగా రెండు అంబులెన్సులో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు తరలించారా?

ఆ రెండు అంబులెన్సుల నిండా కోట్లల్లో నోట్ల కట్టలు ఉన్నాయా? సీతక్క, రేవంత్‌రెడ్డిలను టార్గెట్ చేసేలా.. నోట్ల కట్టలతో వారిద్దరిని ఓడించేలా.. ప్రభుత్వ పెద్దలు కుట్ర చేశారా?

ఆ అంబులెన్సులను ఎవరూ ఆపకుండా.. పైస్థాయి నుంచి ఫోన్లు వచ్చాయా? చెక్ పోస్టులు, టోల్ గేట్లు.. అన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక గులాబీ స్కెచ్ దాగుందా?

ఆ అంబులెన్సుల వెనుక ఉన్నది ఎవరు? ఆ అంబులెన్సుల నిండా ఉన్నది నోట్ల కట్టలేనా? అవి అధికార పార్టీవేనా? సీతక్క, రేవంత్ రెడ్డిలను డబ్బులతో టార్గెట్ చేశారా?

ఇందులో ఏది నిజమో? అసలేం జరిగిందో ఈసీనే తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇలా అనేక సందేహాలు.. అంతకుమించి అనుమానాలు. అధికార పార్టీ ఏమంటుంది? అధికార యంత్రాంగం ఏం చెప్తుంది? ఎన్నికల సంఘమైనా నిజం నిగ్గు తేలుస్తుందా?

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×