EPAPER

Manjima Mohan: హీరోతో లవ్‌లో ఉన్న నాగ చైతన్య హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసింది

Manjima Mohan: హీరోతో లవ్‌లో ఉన్న నాగ చైతన్య హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసింది

‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే చిత్రంలో నాగ చైతన్య పక్కన జోడీ కట్టిన బొద్దు గుమ్మ..మలయాళీ ముద్దు గుమ్మ మంజిమ మోహన్‌ని అంత త్వరగా ఎవరూ మరపోలేరు. ఆ తర్వాత ఎందుకనో అమ్మడుకి తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ కుమార్తె పాత్రలో నటించింది. తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితం అయ్యింది. ఈ మధ్యన మంజిమ మోహన్ కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ప్రేమ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ మంజిమ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విషయాన్ని తెలియజేసింది.


‘‘మూడేళ్లు ముందు నా జీవితంలో నన్ను నేను మిస్ అయ్యాను. ఆ సమయంలో నువ్వు సంరక్షక దూతలా వచ్చావు. జీవితంపై నా ఆలోచనను మార్చావు, నాకు సాయం చేశావు. నేను గందరగోళంలో ఉన్న ప్రతీసారి నువ్వు నన్ను అందులో నుంచి బయట పడేశావు. నా తప్పులను అంగీకరించేలా చేసి నన్ను నాలా ఉండేలా నేర్పించావు. నువ్వు నన్ను ప్రేమించే తీరు చూసి నేను నీతో ప్రేమలో పడిపోయాను. నువ్వు నా జీవితంలో ఎప్పటికీ ఫేవరేట్’’ అంటూ మంజిమ మోహన్ తన మనసులోని ప్రేమలో తెలియజేసింది.

సీనియర్ నటుడు, సీతాకోక చిలుక ఫేమ్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ఇతనితో దేవరాట్టం అనే సినిమాలో మంజిమ మోహన్ నటించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. https://www.instagram.com/p/CkYLNznSHFy/?utm_source=ig_web_copy_link


Related News

Veekshanam Movie Review : వీక్షణం మూవీ రివ్యూ…

Most Handsome Hero: వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇతడే.. షారుఖ్ స్థానం ఎంతంటే..?

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Big TV Exclusive news about Pushpa: పుష్ప సినిమాలో డైలాగ్ మాదిరిగానే నాగవంశీ అసలు తగ్గట్లేదు

Salman Khan: పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు, ఐదు కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం

Diwali Films : అమరన్ అంతంత మాత్రమే, దివాలి విన్నర్ డిసైడ్ అయిపోయింది

Big Stories

×