ఇంట్లోనే దగ్గు, జలుబును తగ్గించుకోండిలా..

వాయుకాలుష్యం వల్ల కూడా జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువ

వాటిని తగ్గించుకునేందుకు తరచూ మెడిసిన్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు

మందులకు బదులుగా.. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం ఉత్తమం. ఇది  డీ హైడ్రేషన్ ను కూడా తగ్గిస్తుంది.

దగ్గు, జలుబు ఉన్నప్పుడు శరీరానికి పూర్తిస్థాయిలో రెస్ట్ ఉండాలి. కంటినిండా నిద్రఉంటే.. శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నిపుణుల పరిశోధనలో తేనె దగ్గును త్వరగా తగ్గిస్తుందని తేలింది. వేడినీటిలో తేనెను కలుపుకుని తాగడం వల్ల దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు.

ఆస్తమా వల్ల వచ్చే దగ్గును తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం లేదా తినే ఆహారాల్లో అల్లంను వాడటం వల్ల దగ్గు తగ్గుతుంది.

హెర్బల్ టీ, కెఫైన్ లేని బ్లాక్ టీ, వేడి నీరు తాగడం ద్వారా గొంతు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

పొడిదగ్గుకు స్టీమ్ ఇన్ హాలేషన్ ను మించిన ట్రీట్మెంట్ లేదు.

స్నానం చేసేటపుడు బాత్రూమ్ మొత్తం ఆవిరి వచ్చేలా వేడినీటిని స్నానం చేయడం ద్వారా కూడా స్టీమ్ చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో వేడినీరు తీసుకుని అందులో జండూబామ్ లేదా దానికి సంబంధించిన ఆయిల్ ను వేసి ఆవిరి పట్టడం ద్వారా జలుబు, పొడిదగ్గు తగ్గుతాయి.