డయాబెటీస్ ను పెంచే ఐదు ఆహారాలు ఇవే.. జాగ్రత్త

చిన్న వయసులోనే టైప్-2  డయాబెటీస్ బారిన పడుతున్న యువత

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తో డయాబెటీస్ వచ్చే ప్రమాదం

మైదాపిండి - షుగర్ తో తయారు చేసిన ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ అధికం. బ్రెడ్స్, మఫిన్స్, కేక్స్, క్రాకర్స్, పాస్తాలలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ తక్కువ.

సోడా, స్వీట్ టీ, ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ వెయిట్ పెరగడానికి కారణమవుతాయి. క్రమంగా టైప్ 2 డయాబెటీస్ కు దారితీస్తాయి.

బటర్, నిల్వఉంచిన పాలు, క్రీమ్, చీజ్, రెడ్ మీట్, ఫ్రై చేసిన ఆహారాలు, నిల్వచేసిన బేకరీ పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.

గ్రిల్డ్ బన్, డెలీ మీట్స్ లో సోడియం, నైట్రేట్స్ అధికం. ఇవి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి

చాక్లెట్లు, కేక్స్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, సాస్, సలాడ్ లో ఉపయోగించే క్రీమ్ లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా డయాబెటీస్ ను ప్రేరేపిస్తాయి.