EPAPER

Maxwell Double Century Records : వేయండి.. మ్యాక్స్ వెల్ కి ఓ వీరతాడు

Maxwell Double Century Records :  వేయండి.. మ్యాక్స్ వెల్ కి ఓ వీరతాడు

Maxwell Double Century Records : మ్యాక్స్ వెల్ మాయను అందరూ మరిచిపోలేకపోతున్నారు. ఎలా జరిగింది? ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నారు. అంతా ఒక గొప్ప మ్యాచ్ ను చూశామన్న ఆనందలోకంలో విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్స్ వెల్ మెడలోకి ఒక బ్రహ్మాండమైన రికార్డ్ వచ్చి చేరింది. ఇంతకీ ఆ వీరతాడు ఏమిటంటే…వన్డేల్లో ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్ మెన్ గా రికార్డ్ ల్లోకి ఎక్కాడు.


140 బంతుల్లో 10 సిక్సులు, 21 ఫోర్లు ఉన్నాయి. ఈ ఫోర్లు, సిక్సులు లెక్కేస్తే ఇవే 144 పరుగులు అయ్యాయి. ఇక మిగిలిన 57 రన్స్ కేవలం సింగిల్స్, డబుల్స్ రూపంలో వచ్చినవే కావడం విశేషం. అంటే మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. వన్డేల్లో 11 డబుల్ సెంచరీలు నమోదు కాగా, ఛేజింగ్ లో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్స్ వెల్ ది కావడం విశేషం.

 గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ ఆండ్రూ స్ట్రాస్ (158) పేరున ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో భారత్ పై స్ట్రాస్ ఇది సాధించాడు. ఈరోజున మాక్స్ వెల్ దానిని బద్దలు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్ మెన్ కూడా మాక్స్ వెల్ అయ్యాడు.


గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో  దక్షిణాఫ్రికాపై తను  చేసిన 193 పరుగులే ఛేజింగ్ లో అత్యధిక స్కోరుగా ఇప్పటికి ఉంది. అదీరోజున చెరిగిపోయింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాన్ ఓపెనర్ బ్యాట్స్ మెన్  మ్యాక్స్ వెల్ మాత్రమే. సిక్సర్ తో డబుల్ సెంచరీ మార్క్ చేరుకున్న అతికొద్ది మందిలో ఒకడిగా  నిలిచాడు.

 ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే,  తన టీమ్ మేట్ షేన్ వాట్సన్ అంతకుముందు 185 పరుగులు ఛేజింగ్ లో చేశాడు. ఇప్పుడు తనవాడిని తనే అధిగమించాడు. వరల్డ్ కప్ పరంగా చూస్తే డేవిడ్ వార్నర్ 178 రన్స్ ను దాటేశాడు. వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసీస్ బ్యాట్స్ మెన్ గా కూడా మ్యాక్స్ వెల్ చరిత్ర సృష్టించాడు.

అంతేకాదు వన్డే ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా మ్యాక్స్ వెల్ నిలిచాడు. తనకన్నా ముందు 2015 వరల్డ్ కప్ లో జింబాబ్వేపై క్రిస్ గేల్ 215 రన్స్, న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ వెస్టిండీస్ పై 237 పరుగులు చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా (140 బంతుల్లో) డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా మ్యాక్స్ వెల్ నిలిచాడు.
2022లో  బంగ్లాదేశ్ పై ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే ద్విశతకం సాధించి ఇప్పటికి మొదటి ప్లేస్ లో ఉన్నాడు.

6 లేదా అంతకన్నా తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా మ్యాక్స్ వెల్ నిలిచాడు. గతంలో 1983 వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ జింబాబ్వేపై చేసిన 175 రన్స్ ఇప్పటివరకూ అత్యధికంగా ఉంది. చూశారు కదా…ఇంకెందుకాలస్యం వేసేయండి వీరతాడు అని ఆనాటి తెలుగు క్లాసికల్ మూవీ మాయాబజార్ సినిమాలో పాపులర్ డైలాగ్ ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×