EPAPER

AFG vs AUS : ఆ క్యాచ్.. కొంప ముంచింది: ఆఫ్గాన్ కెప్టెన్

AFG vs AUS : ఆ క్యాచ్.. కొంప ముంచింది: ఆఫ్గాన్ కెప్టెన్

AFG vs AUS : ఆఫ్గానిస్తాన్ ఒక సంచలనం సృష్టించింది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా జరిగిన మ్యాచ్ లు, గెలిచిన విధానం, ఆడిన తీరు అంతా స్ఫూర్తిమంతంగా సాగింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గెలుపుకి మూడు వికెట్ల దూరంలో ఆగిపోయిన విధానంపై ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిద్ మాట్లాడాడు.


ఈ పరాజయం తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నాడు.  మ్యాక్స్ వెల్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడని తెలిపాడు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలవడం బాధగా ఉంది, చాలా నిరాశను కలిగించిందని అన్నాడు. బౌలర్లు అద్భుతంగా ప్రారంభించారు. కానీ మాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేశాం. ఇది మా కొంప ముంచింది. ఈరోజు అదృష్టం మ్యాక్ వైపు నిలిచింది. దురదృష్టం మా వైపు నిలిచిందని అన్నాడు. వచ్చిన అవకాశాలతో మ్యాక్స్ చెలరేగిపోయాడని అన్నాడు. ఇంక అతన్ని ఆపడం మావల్ల కాలేదని అన్నాడు. 33 పరుగుల వద్ద మాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ని ఆఫ్గాన్ ప్లేయర్  ముజీబ్ జారవిడిచాడు. అంతే ఆ దెబ్బతో మళ్లీ ఆఫ్గాన్ కోలుకోలేదు.

ఈ క్యాచ్ విషయంలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో క్యాచ్ లు జారవిడవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అలా జగరకూడదని అనుకోడానికి లేదు. తను క్యాచ్ డ్రాప్ చేసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 112 మీదే ఉంది. ఇంకా 180 పరుగుల వరకు చేయాలి కదా…మాక్స్ వెల్ వికెట్ తీయడానికి బౌలర్లకి ఎంతో సమయం ఉంది. బలమైన టార్గెట్ ఉంది. ఆసిస్ ని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం కూడా ఉందని అన్నాడు. మొదట్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆఫ్గాన్లు అదే మాక్స్ వెల్ దగ్గరికి వచ్చేసరికి తేలిపోయారు. మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉండాల్సింది. ఒక్క క్యాచ్ వదిలేసిన ముజాబ్ ని నిందించడం కరెక్ట్ కాదని అన్నాడు.


ఒక సమయంలో మాక్స్ వెల్ గట్టిగా కొడుతున్నాడని, స్లిప్పుల్లో అందరినీ తీసి లాంగ్ ఆన్ లో  ఆఫ్గాన్ కెప్టెన్ మోహరించాడు. సరిగ్గా అదే సమయంలో మాక్స్ వెల్ ఒక బాల్ స్లిప్పులోకి ఆడాడు. అక్కడే ఫీల్డర్స్ ఉండుంటే తను కచ్చితంగా అవుట్ అయ్యేవాడే. ఇలా ఎన్నో కలిసివచ్చి మ్యాక్స్ వెల్ ఆడాడని అంటున్నారు. మ్యాక్స్ వెల్ ఆటను మెచ్చుకోదగ్గదే, కానీ ఆఫ్గనిస్తాన్ పోరాటపటిమ అంతకన్నా గొప్పదని మాత్రం చెప్పక తప్పదని నెటిజన్లు అంటున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×