EPAPER

Australia vs Afghanistan : మాక్స్ వెల్ డబుల్.. ఆఫ్గాన్ ట్రబుల్..

Australia vs Afghanistan :  మాక్స్ వెల్ డబుల్.. ఆఫ్గాన్ ట్రబుల్..

Australia vs Afghanistan : 91 పరుగులకి 7 వికెట్లతో ఓటమి ముంగిట బిక్కుబిక్కుమంటూ ఆస్ట్రేలియా నిలిచి ఉన్న వేళ. ప్రపంచ క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ.. ఆఫ్గానిస్తాన్ మరో సంచలనం సృష్టించనుందా? అని అనుకుంటున్న వేళ.. ఇక ఆస్ట్రేలియా పని అయిపోయింది అనుకున్న వేళ.. అనూహ్యంగా ఆస్ట్రేలియా పైకి లేచింది.


అదెవరూ ఊహించలేదు.  ఒంటికాలితో కుంటుతూనే ఆడి డబుల్ సెంచరీ (201 నాటౌట్) చేసి ఆస్ట్రేలియాని ఒంటిచేత్తో గెలిపించాడు. ఇక  మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అన్నట్టు ఎడాపెడా బాదిపాడేశారు. ఇలా కొడితే అలా సిక్స్, ఇలా టచ్ చేస్తే అలా ఫోర్.. 140 బంతుల్లో 10 సిక్స్ లు, 21 ఫోర్లు కొట్టి ఆఫ్గన్ బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. అధికారికంగా ఆస్ట్రేలియాను సెమీస్ కి తీసుకెళ్లాడు.

2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ముంబయి వాంఖేడి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఊహించని విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలోనే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 7 వికెట్ కి 179 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి సెమీస్ లో అడుగు పెట్టింది.


మొదట టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. అలా ఓపెనర్లు గుర్బజ్, ఇబ్రహిం జద్రాన్ వచ్చారు. ఇద్దరూ జాగ్రత్తగానే ఆడారు. అయితే 21 పరుగులు చేసిన గుర్బజ్ అవుట్ అయిపోయాడు. అప్పటికి బంగ్లాదేశ్ 7.5 ఓవర్లలో 38 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్ వచ్చిన రహ్మత్ షా (30) కాసేపు నిలబడ్డాడు. మరో ఎండ్ లో ఓపెనర్ జద్రాన్ కి సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ షాహిది (26), ఒమర్ జాయ్ (22), మహ్మద్ నబి (12), రషీద్ ఖాన్ (35 నాటౌట్) వీరి సహకారంతో జద్రాన్ (129) సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. అలా 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 291 పరుగుల చేసి ఆసిస్ కి ఒక మోస్తరు సవాల్ నే విసిరింది. ఆస్ట్రేలియా బౌలింగ్ లో స్టార్క్ 1, హేజిల్ వుడ్ 2, మాక్స్ వెల్ 1, జంపా 1 వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వికెట్లు ఎవరూ ఊహించిన విధంగా ఫట్ ఫట్ మని పడిపోయాయి. ఆఫ్గానిస్తాన్ మరో సంచలనం నమోదు చేస్తుందని అంతా అనుకున్నారు. ఒక దశలో 19 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసి ఆస్ట్రేలియా గిలగిల్లాడుతోంది.

ఓపెనర్ హెడ్ డకౌట్ అయ్యాడు. దీంతో డేవిడ్ వార్నర్ కొంచెం జాగ్రత్తగా ఆడటం మొదలుపెట్టాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన మిచెల్ మార్ష్ (24)తో కలిసి ముందుకు తీసుకువెళ్లాడు. ఈ సమయంలో మార్ష్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే వార్నర్ ను ఒక మంచి బంతితో ఒమర్జాయి బౌల్డ్ చేశాడు. ఎప్పుడూ తగ్గేదేలే అని చెప్పే వార్నర్, ఈసారి మాత్రం బాగా తగ్గాల్సి వచ్చింది.

ఆ తర్వాత బంతికే జోష్ ఇంగ్లస్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో లబూషేన్ (14) రన్ అవుట్ అయిపోయాడు. దీంతో మాక్స్ వెల్ ఒంటరిపోరాటం మొదలైంది. అతనికి సపోర్ట్ గా వచ్చిన వారందరూ టపటపా అయిపోయారు. స్టొయినిష్ (6), మిచెల్ స్టార్క్ (3) ని కీపర్ అద్భుత క్యాచ్ తో పెవెలియన్ దారిపట్టాడు.

ఈ సమయంలో వచ్చిన మ్యాక్స్ వెల్ కి సపోర్ట్ గా కెప్టెన్  పాట్ కమిన్స్ నిలుచున్నాడు. అప్పటికే ఓవర్స్ చాలా ఉన్నాయి. అందువల్ల తను మరో వికెట్ పడకుండా డిఫెన్స్ గా ఆడటం మొదలుపెట్టాడు. ఎక్కువ స్ట్రయికింగ్ మాక్స్ వెల్ కి వచ్చేలా చూశాడు. దీంతో మాక్స్ వెల్ రెచ్చిపోయాడు. అహ్మద్ బౌలింగ్ లో మాక్స్ కి ఒక లైఫ్ వచ్చింది. ఒక సులువైన క్యాచ్ ని షార్ట్ లెగ్ లో ఉన్న ముజీబ్ జారవిడిచాడు. అదే ఆఫ్గాన్ పాలిట శాపంగా మారింది.

ఇక అక్కడ నుంచి మాక్స్ వెల్ ఎడాపెడా కొడుతూ డబుల్ సెంచరీ (201) చేయడమే కాదు నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ కమిన్స్ 68 బాల్స్ ఆడి కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడంటే, ఎంత వ్యూహాత్మకంగా మ్యాచ్ ని నడిపించాడో చూస్తేనే అర్థమవుతుంది. సింగిల్ తీయడం లేదంటే డిఫెన్స్ ఆడటం, మొత్తం స్ట్రయికింగ్ మాక్స్ వెల్ కి వెళ్లేలా చూశాడు. దీంతో ఇంకా 19 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని మాక్స్ వెల్ చేధించాడు.

చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని ఆస్ట్రేలియాకి అందించాడు. ఆఫ్గాన్ బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 2, ఒమర్ జాయి 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. బౌలర్లు కష్టపడినా ఫలితం దక్కలేదు. ఒకవేళ గెలిచి ఉంటే వరల్డ్ కప్ లోనే ఆఫ్గాన్ చరిత్ర స్రష్టించేది. అయితే ఓడినా అందరి ప్రశంసలు ఆఫ్గాన్ జట్టు అందుకుంది.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×