EPAPER

Breastfeeding : బిడ్డకు పట్టించడానికి సరిపడ పాలు తల్లికి రానప్పడు.. ఈ చిట్కాలు పాటించండి

Breastfeeding | చంటిపిల్లలకు డబ్బాపాలు కన్నా తల్లిపాలే చాలా శ్రేయస్కరమైనవిగా వైద్యులు చెబుతున్నారు. డబ్బాపాలు తాగే పిల్లల కంటే తల్లిపాలు తాగే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.

Breastfeeding : బిడ్డకు పట్టించడానికి సరిపడ పాలు తల్లికి రానప్పడు.. ఈ చిట్కాలు పాటించండి

Breastfeeding | చంటిపిల్లలకు డబ్బాపాలు కన్నా తల్లిపాలే చాలా శ్రేయస్కరమైనవిగా వైద్యులు చెబుతున్నారు. డబ్బాపాలు తాగే పిల్లల కంటే తల్లిపాలు తాగే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే తల్లిపాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.


అయితే కొందరు మహిళలకు బిడ్డ పుట్టిన తరువాత సరిపడ మోతాదులో పాలు ఉత్పత్తి కావు. అలాంటివారికి పాలు ఉత్పత్తి కావడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇవి పాటిస్తే చాలావరకు సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.

తల్లిపాల ఉత్పత్తిని కొన్ని సహజమైన మార్గాల్లో పెంచుకోవచ్చు. పాలు సరిపడా రావట్లేదు కదా అని అసలు బిడ్డకు తల్లిపాలు పట్టించడం మానేయకూడదు.


తరుచుగా చంటిపిల్లలకు తల్లిపాలు ఇస్తూ ఉంటే పాల ఉత్పత్తి అదే క్రమంగా పెరుగుతుంది. ఇది చాలా సహజం.

పాలు ఇస్తున్నామ కదా అని.. అలాగే ఒడిలో పెట్టుకొని కూర్చొకూడదు. బిడ్డకు ఎంతసేపు పాలు పట్టించాలి. ఎప్పుడు ఆపేయాలి అనే విషయంపై కూడా శ్రద్ధ వహించాలి.

బిడ్డకు తల్లి పాలు ఇచ్చే సమయంలో కాస్త తన వక్షోజాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి.

పాలు పట్టించిన తరువాత ఇప్పుడు అందుబాటులో ఉన్న బ్రెస్టు పంపుతో కాసేపు పంపింగ్ చేయాలి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు బాగా నీరు తాగాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, డ్రైఫూట్స్, పప్పుదినుసులు, వేరుశెనగ పప్పు(పల్లీలు), చేప, మాంసం, వంటి ఆహారంలో ప్రొటీన్ శాతం బాగా ఉంటుంది.

వీటన్నింటి కంటే ముఖ్యం తల్లి మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి. అంటే ఒత్తిడి, ఆందోళన ఉండకూడదు. ప్రశాంతంగా బిడ్డకు పాలు పట్టించాలి. అలా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×