EPAPER

Tai Chi Benefits : ‘తాయ్-చి’తో డిమెన్షియా దూరం?

Tai Chi Benefits : ‘తాయ్-చి’తో డిమెన్షియా దూరం?
Tai Chi for Memory

Tai Chi Benefits : కీస్ ఎక్కడ పెట్టామో వెంటనే స్ఫురించదు. ఒక్కోసారి పరిచయం ఉన్నవారు తారసపడితే పేరు గుర్తుకు రాక బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. వయసు మీరుతున్న కొద్దీ ఇలాంటి లక్షణాలు పెరుగుతుంటాయి. జ్ఞాపకశక్తిని పెంచుకొనే టెక్నిక్‌లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలెన్నో ఉండొచ్చు.


అయితే చైనాలో అతి పురాతనమైన మార్షల్ ఆర్ట్ ‘తాయ్-చి’ ఇందుకు ఓ దివ్యాస్త్రమని తాజా పరిశోధన చెబుతోంది. దీని వల్ల డిమెన్షియా ముప్పును తగ్గించొచ్చని ఒరెగాన్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మెమరీ క్షీణిస్తున్న 65 ఏళ్ల వయస్కులు 330 మందిని వారు అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా వారికి మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్‌మెంట్ అనే పది నిమిషాల పరీక్ష నిర్వహించారు. 26-30 పాయింట్లను సాధారణ స్కోర్‌గా నిర్ణయించారు. 18-25 మధ్య స్కోర్ సాధించిన వారిని స్వల్ప అశక్తు‌లుగా తేల్చారు. అంటే వారికి డిమెన్షియా లేదు కానీ.. చురుకుదనం అంతగా లేదని అర్థం. దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో అలాంటి వారు చాలా కష్టపడాల్సి వస్తుంది.


స్వల్ప కదలికలతో తాయ్-చి మార్షల్ ఆర్ట్‌ను వారానికి రెండు సార్లు చొప్పున ఆరునెలలు అభ్యసించిన వారు కాస్త మెరుగే. కాగ్నిటివ్ అసెస్‌మెంట్‌లో వారు 1.5 పాయింట్లు అదనంగా తెచ్చుకోగలిగారు. పెరిగిన పాయింట్లు ఓస్.. ఇంతేనా అని అనుకోవద్దు. ఆ కొద్ది పెరుగుదలే.. ఊహించనంత మార్పును తెస్తుందని అధ్యయన సారథి డాక్టర్ ఎలిజబెత్ ఎక్‌స్ట్రాం తెలిపారు.

ఆ కొద్ది పాటి మార్పే డిమెన్షియా రాకను మూడేళ్లు ఆలస్యం చేస్తుందని ఆమె వివరించారు. ఏడాదికి సగటున అర పాయింట్ చొప్పున కోల్పోతూ.. 18 పాయింట్లకు స్కోర్ పడిపోయిన పక్షంలో జ్ఞాపకశక్తి క్షీణత తప్పదని వివరించారు. అయితే వారానికి 2 లేదా మూడు రోజుల పాటు తాయ్-చి ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే డిమెన్షియాలోకి జారుకునే ప్రక్రియను మరిన్ని సంవత్సరాల పాటు దూరం చేయొచ్చని ఎలిజబెత్ స్పష్టం చేశారు.

తాయ్-చి టెక్నిక్‌ను మరింత విస్తృతం చేస్తే డిమెన్షియాను ఆరేళ్ల పాటు వాయిదా వేసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాయ్-చి‌ ప్రాక్టీస్ కొరియోగ్రఫీ తరహాలో ఉంటుంది. లయబద్ధంగా కాళ్లు, చేతులను ఆడిస్తున్న సమయంలోనే.. పదాల స్పెల్లింగ్ చెప్పిస్తారు. ఒక్కో సారి ఆ స్పెల్లింగ్‌ క్రమాన్ని తిరగేసి చెప్పాలి. అంటే శారీరక శ్రమతో పాటు మెదడుకు పని చెప్పే ప్రక్రియ ఏకకాలంలో జరుగుతాయన్నమాట. తాయ్-చి ప్రాక్టీస్ వల్ల బాడీ ఫ్లెక్సిబులిటీ, బ్యాలెన్స్ పెరగడమే కాదు.. మనసు ఏకాగ్రత కూడా సాధ్యమవుతుంది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×