EPAPER

pollution winter : వింటర్ డేంజర్.. చెక్ పెట్టేద్దాం!

pollution winter : వింటర్ డేంజర్.. చెక్ పెట్టేద్దాం!

pollution winter : వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిచేస్తోంది. కాస్త ఎక్కువో.. తక్కువో.. మొత్తం మీద అన్ని దేశాలను పీడిస్తున్న సమస్య ఇది. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో స్కూళ్లను కూడా మూసేశారు. ముంబైలోనూ కాలుష్యం బెడద పెరిగింది. వచ్చే వారం దీపావళి పండుగ రానుంది. బాణసంచా కాల్చడంతో కాలుష్యం మరింత పెరగనుంది.


పైపెచ్చు ఇది శీతాకాలం. వింటర్‌లో వాయు కాలుష్యం ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్‌లోనే అన్ని నగరాలు, పట్టణాల్లో పొల్యూషన్ స్థాయులు పెరుగుతాయి. ఏడాది పొడవునా కాలుష్యం పీడించినా.. వింటర్‌కొచ్చే సరికి ఆ మోతాదు మరింత పెరుగుతుంది.

ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరగడంతో.. అందరూ హీటింగ్ సిస్టమ్స్‌ను వినియోగిస్తారు. ఆయిల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఈ పరికరాలు పనిచేస్తాయి. ఒక్కసారిగా హీటర్ల వాడకంతో ఫ్యూయల్స్ వినియోగం పెరుగుతుంది. ఈ ఇంధనాలను మండించడం వల్ల నైట్రోజెన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్యకారకాలు వాతావరణంలోకి అధిక మోతాదులో చేరతాయి. ఫలితంగా గాలిలో నాణ్యత పడిపోతుంది.


పరిశ్రమలు, వాహనాల వల్ల కూడా ఈ కాలుష్యకారకాలు అధిక మొత్తాల్లో విడుదల అవుతాయి. చలి తీవ్రత పరోక్షంగా కాలుష్యాన్ని పెంచుతుంది. దీనికి శాస్త్రీయ కారణాలున్నాయి. వాతావరణంలోని దిగువ పొర వేసవికాలంలో వేడిగానూ, తేలికగానూ ఉంటుంది. వేడెక్కిన ఆ పొర తేలికగా ఉండటంతో గాలిలో ఊర్థ్వముఖంగా అతి త్వరగా కదులుతుంటుంది. దాంతో పాటే కాలుష్య కారకాలు భూమి నుంచి వేగంగా ఎగువకు వెళ్లిపోతుంటాయి.

శీతాకాలంలో భూమికి సమీపంగా ఉన్న గాలి బరువుగా, చల్లగా ఉంటుంది. వేడి, కాలుష్యకారకాలు అందులో చిక్కుకుపోయి.. ఓ మూతలాగా ఏర్పడుతుంది. అంటే ఆ గాలిపొరకు దిగువనే వేడి, కాలుష్యం పేరుకుపోతుండటంతో గాలిలో నాణ్యత క్షీణిస్తుంటుంది. దీనినే శాస్త్రీయ పరిభాషలో ఇన్‌వర్షన్ అని అంటారు. ఆ వాయు కాలుష్యం అంతా తిరిగి భూమికే చేరుతుంది.

ఇన్‌వర్షన్ ప్రక్రియ ప్రభావం రాత్రివేళల్లో అధికంగా ఉంటుంది. అందుకే రాత్రి సమయాల్లో గాలి నాణ్యత బాగా క్షీణిస్తుంది. ఈ వాయుకాలుష్యం మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. ప్రధానంగా శ్వాసకోశవ్యవస్థ ఎక్కువగా ప్రభావితమవుతుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

ఎప్పటికప్పుడు గాలి నాణ్యత గురించి తెలుసుకుంటూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గాలి నాణ్యత వివరాలను రియల్‌టైమ్‌‌లో అందించే యాప్‌లు, వెబ్‌సైట్లకు కొదవ లేదు. వాటి ద్వారా వాతావరణం, వాయుకాలుష్యం గురించి అప్‌డేట్లను ఫాలో అవుతుండాలి. వాటికి అనుగుణంగా బయటి పనులను ప్లాన్ చేసుకోవాలి. కాలుష్యం బెడద ఎక్కువగా ఉండే ఇలాంటి సమయాల్లో ఇది మరీ ముఖ్యం.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×