EPAPER

Al Pacino : 83 ఏళ్ల సూపర్ స్టార్‌తో 29 ఏళ్ల సుందరి సహజీవనం.. బిడ్డ పుట్టాక హీరోకి పెద్ద షాక్!

Al Pacino : పాపులర్ హాలీవుడ్ నటుడు ఆల్ పచీనోకి తన యంగ్ గర్ల్‌ఫ్రెండ్ గట్టి షాకిచ్చింది. 23 నెలల పాటు సహజీవనం చేశాక వారిద్దరికీ ఓ పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టిన మూడు నెలలకే ఆమె అతడి నుంచి విడిపోయి కోర్టుకెక్కింది. పుట్టిన పిల్లాడు తన వద్ద మాత్రమే ఉండేలా తీర్పునివ్వాలని న్యాయస్థానంలో కోరింది పైగా తన లాయర్ ఫీజు, పిల్లాడిని పోషించడానికి అయ్యే ఖర్చు మొత్తం తండ్రి అయిన ఆల్ పచీనో భరించాలని చెప్పింది. ఇదంతా సరే కానీ ఇంతకీ ఆమె అతడి నుంచి విడిపోవడానికి అసలు కారణం వింటే ఆశ్చర్యపోతారు.

Al Pacino : 83 ఏళ్ల సూపర్ స్టార్‌తో 29 ఏళ్ల సుందరి సహజీవనం.. బిడ్డ పుట్టాక హీరోకి పెద్ద షాక్!

Al Pacino : పాపులర్ హాలీవుడ్ నటుడు ఆల్ పచీనోకి తన యంగ్ గర్ల్‌ఫ్రెండ్ గట్టి షాకిచ్చింది. 23 నెలల పాటు సహజీవనం చేశాక వారిద్దరికీ ఓ పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టిన మూడు నెలలకే ఆమె అతడి నుంచి విడిపోయి కోర్టుకెక్కింది. పుట్టిన పిల్లాడు తన వద్ద మాత్రమే ఉండేలా తీర్పునివ్వాలని న్యాయస్థానంలో కోరింది పైగా తన లాయర్ ఫీజు, పిల్లాడిని పోషించడానికి అయ్యే ఖర్చు మొత్తం తండ్రి అయిన ఆల్ పచీనో భరించాలని చెప్పింది. ఇదంతా సరే కానీ ఇంతకీ ఆమె అతడి నుంచి విడిపోవడానికి అసలు కారణం వింటే ఆశ్చర్యపోతారు.


ఆల్ పచీనో ఒక అమెరికన్ దిగ్గజ నటుడు. భారతదేశంలో ఆయన సినిమాలని ఎన్నోసార్లు కాపీ కొట్టారు. ముఖ్యంగా ఆయన నటించిన గాడ్‌ఫాదర్ చాలా ఫేమస్. ఈ సినిమాని ఇప్పటికే చాలాసార్లు చాలామంది కాపీ కొట్టి విజయం సాధించారు. గాడ్ ఫాదర్ సినిమాని హిందీలో రెండుసార్లు రిమేక్ చేశారు. ఒకటి 60,70వ దశకంలో ఇండియన్ కౌబాయ్‌గా ప్రసిద్ధిగాంచిన ఫిరోజ్ ఖాన్ ‘ధర్మాత్మ’ కాగా, మరొకటి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘సర్కార్’. తెలుగులో కూడా రామ్ గోపాల్ వర్మ గాడ్ ఫాదర్ సినిమాని కాపీ కొట్టారు. అదే ఫసక్ ఫేమస్ మోహనబాబు, ఆయన తనయుడు మంచు విష్ణు నటించిన ‘రౌడీ’. ఆ కళా ఖండాన్ని తెలుగు ప్రేక్షకులు మరిచిపోగలరా?

ఇక విషయం ఏమిటంటే.. అమెరికన్ నటుడు ఆల్ పచీనో ముందు నుంచీ స్త్రీ లోలుడు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే ఎంతోమందితో రొమాంటిక్ అఫైర్లు నడిపాడు. ఆ అలవాటు 80 ఏళ్లు దాటినా మానుకోలేదు. ఆల్ పచీనో తన జీవితంలో ఎప్పుడూ వివాహం చేసుకోలేదు. ఆయనకు ఇప్పటివరకు 9 మంది గర్లఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ఆయనకు యాక్టింగ్ పాఠాలు నేర్పిన జాన్ టర్రాంట్‌ మొదటి ప్రియురాలు. ఆమెతో ఆయనకు మొదటిసారి ఒక కూతురు జూలీ మేరీ(34) పుట్టింది. ఆ తరువాత ప్రముఖ నటి బెవర్లీ డి ఆంజెలోతో కూడా ఆయన ప్రేమాయాణం నడిపాడు. వారిద్దరికీ కవలలు పుట్టారు. వారే యాంటెన్ జేమ్స్(22), ఒలివియా రోస్(22).


ఇక ఆ తరువాత ఎంతోమంది అందగత్తెలు ఆయన జీవితంలో వచ్చారు వెళ్లారు. కానీ లేట్ వయసు అంటే మన హీరో గారికి 82 ఏళ్ల వయసులో ఒక కుర్ర లేడీ ప్రొడ్యూసర్‌పై ప్రేమ పుట్టింది. ఆమె పేరు నూర్ అల్‌ఫల్లా (29). ఆమె ‘బిల్లీ నైట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. ఆ సినిమాలో ఆల్ పచినో కూడా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ కలుసుకున్నారు. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి మద్య 54 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. మూడేళ్లపాటు ఇద్దరు సహజీవనం చేశారు. ఫలితంగా వారికిప్పుడు మూడు నెలల బాబు పుట్టాడు. కానీ ఇప్పుడు నూర్ అల్ ఫల్లా ఆల్ పచీనో నుంచి విడిపోయింది. కోర్టులో కూడా అతనిపై కేసు వేసింది. ఈ విడిపోవడానికి కారణం వారిద్దరూ ఒక విషయంలో గొడవపడ్డారు.

సహజీవనం ఫలితంగా నూర్ అల్‌ఫల్లా గర్భవతి అయినప్పుడు ఆల్ పచినో ఒక సమస్య వచ్చింది. ఆయనకు ఒక రకమైన ఆరోగ్య సమస్య ఉందని.. దాని వల్ల ఇప్పుడు 80 ఏళ్లు దాటాక పిల్లలు పుట్టడం కష్టమని వైద్యులు ఆయనకు ముందుగానే చెప్పారు. దీంతో మన హీరోగారికి తన గర్ల్ ఫ్రెండ్ కడుపులో పెరుగుతున్న బిడ్డ తనదో? కాదో? అని డౌట్ వచ్చింది. ఈ సమస్య పరిష్కరించడానికి ఆమెను బిడ్డ డీఎన్‌ఏ టెస్ట్ చేయించమని అడిగాడు. అందుకు ఆమె ముందుగా ఒప్పుకోకపోయినా.. ఆ తరువాత డీఎన్‌ఏ పరీక్ష చేయించుకొంది. అందులో బిడ్డకు తండ్రి ఆల్ పచినో అని తేలింది.

కట్ చేస్తే ఇప్పుడు నూర్ ఫల్లా కోర్టు కెక్కింది. తన బిడ్డ కస్టడీ తనకు దక్కాలని, బిడ్డ పోషణ భారానికి అయ్యే ఖర్చుతో పాటు కోర్టు, తన లాయర్ ఫీజు కూడా ఆల్ పచీనో భరించాలని కోర్టులో దావా వేసింది. ఈ కేసు ఇంకా కోర్టు విచారణ దశలో ఉంది. అయితే ఆల్ పచినో ఇప్పటికీ ఆమె నుంచి విడిపోవడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు ఆల్ పచినో 83 ఏళ్ల వయసులో ఓ పిల్లాడి తండ్రిగా రికార్డ్ సృష్టించారు. ఇంత లేటు వయసులో ఇంతవరకు ఏ నటుడూ తండ్రి కాలేదు మరి!

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×