EPAPER
Kirrak Couples Episode 1

Kaleshwaram : ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా కాళేశ్వరం.. మౌనం వీడని కేసీఆర్.. ఏం జరుగుతోంది ?

Kaleshwaram : ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా కాళేశ్వరం.. మౌనం వీడని కేసీఆర్.. ఏం జరుగుతోంది ?

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఎన్నికల ముంగిట కీలక ప్రచార అస్త్రంగా మారిపోయింది. సీఎం కేసీఆర్ మాట మాట్లాడితే కాళేశ్వరం అద్భుతం అని, తమ హయాంలో నిర్మించామని ప్రతి సందర్భంలో గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడది కుంగిపోవడం, ఇంకా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన రిపోర్ట్ ఇవ్వడంతో ఎన్నికల్లో ఓటరు నాడి మారుతోంది. అటు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా వైఎస్ఆర్ టీపీ, టీజేఎస్ కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ప్రచార అస్త్రంగా మారుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం బ్యారేజ్ దగ్గర సమస్యలు ఏర్పడడంతో ఈ ప్రాజెక్టు అంతా మేడిపండు చందమే అన్న అభిప్రాయం ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోంది. వీటికి తోడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కాళేశ్వరం పూర్తి నిర్లక్ష్యంతో నిర్మించడం, ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యంతోనే ఇదంతా జరిగిందంటూ సంచలన రిపోర్ట్ ఇచ్చింది.

ఎన్నికల ముందు NDSA రిపోర్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టు తమ ఘనతే అని చెప్పుకుంటున్న కేసీఆర్ .. ఇప్పుడు ప్రచారాల్లో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పైగా ఎక్స్ పాన్షన్ బ్రేకప్ ను చూపి అదే కారణమని చెప్పుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఏ ముహూర్తాన మొదలైందో గానీ.. రాష్ట్ర సర్కార్ ఖజానాపై వేల కోట్ల అప్పుల భారం పడింది. ఒక దశలో ఖజానా ఫ్రీజ్ చేసి మరీ కాళేశ్వరం చెల్లింపులే చేశారన్న ప్రచారం కూడా జరిగింది. హడావుడిగా తెరపైకి తెచ్చి గిన్నిస్ రికార్డుల పేరుతో డ్యామ్ కట్టడం ఇప్పుడు బీఆర్ఎస్ కొంప ముంచే పరిస్థితికి తీసుకొచ్చిందంటున్నారు. లక్ష కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయన్న ఆవేదన ప్రజల్లో పెరుగుతోంది. ఇసుక పునాదిలో బలంగా నిర్మించాల్సిన పిల్లర్లు ఇప్పుడు కుంగుతున్నాయి. ఎప్పుడో ఇసుక పునాదిపై కట్టిన ధవళేశ్వరం ఇప్పటికీ గట్టిగా ఉంది. కానీ నాలుగేళ్లకే కాళేశ్వరం ఖల్లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అప్పటికీ విపక్షాలు కమీషన్లు జోరుగా నడుస్తున్నాయని రోజూ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేసినా ప్రాజెక్టు పై కేసీఆర్ వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు ఓట్ల రూపంలో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు.


ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని కేంద్ర సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నిర్ధారించింది. కాళేశ్వరం వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి , ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని రిపోర్టులో చెప్పడంతో.. తెలంగాణ సమాజం షాక్ కు గురవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. పైగా ఇది ఎన్నికల సీజన్ కావడంతో బీఆర్ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై కేంద్ర సంస్థ సమాచారాన్ని కోరినా కానీ, కేసీఆర్ సర్కార్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్‌ 29లోపు పూర్తి డేటా ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్‌ పట్టించుకోలేదు. ఏమీ లేకపోతే కేసీఆర్ సర్కార్ ఎందుకు డేటా ఇవ్వట్లేదు అన్న ప్రశ్నలు కూడా తెలంగాణ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. దాల్ మే కుచ్ కాలా హై అన్న వాదనలకు బలం చేకూరుతోంది.

అటు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా సరికొత్త రాజకీయ సమీకరణాలు నడుస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల పార్టీ వైఎస్ఆర్ టీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఉద్దేశంతో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని షర్మిల ప్రకటించారు. తమ కార్యకర్తలంతా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాంతో రేవంత్, మాణిక్ రావ్ ఠాక్రే ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీజేఎస్ మద్దతు కోరారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ ఇస్తామని ప్రకటించేశారు. దీంతో ఓట్ల పోలరైజేషన్ అంతా మార్పు వస్తోంది. ఓవైపు కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. అదే సమయంలో వ్యతిరేక ఓటు అంతా ఒక్క చోటికే షిఫ్ట్ అయ్యేలా పరిణామాలు నడుస్తున్నాయి. ఇంకోవైపు ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం కొన్ని సీట్ల పేర్లు చెప్పినా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి మనసు మార్చుకుంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు కూడా హస్తం పార్టీవైపు షిఫ్ట్ అవుతుందన్న అంచనాలున్నాయి. ఇంకోవైపు బీజేపీతో పొత్తులకు సిద్ధపడుతున్న జనసేన పార్టీ కూడా తెలంగాణలో పోటీకి దూరంగా ఉండేందుకే ఆలోచిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అదే జరిగితే మరికొన్ని సమీకరణాలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

Big Stories

×