EPAPER
Kirrak Couples Episode 1

Janatha Garage Special Story : అంపశయ్యపై చేనేత.. ఆదుకునేదెవరు?

Janatha Garage Special Story : అంపశయ్యపై చేనేత.. ఆదుకునేదెవరు?

Janatha Garage Special Story : తరాలనాటి నుంచి వస్తున్న సాంప్రదాయ కళని ముందుకు తీసుకుపోతున్న లోగిళ్లవి. నిత్యం మగ్గం చప్పుడుతోనే అక్కడ తెల్లవారుతుంది. ఏ గడపతొక్కినా ఇంటిళ్లపాది దారాలతో సావాసం చేస్తూనే కనిపిస్తారు. చిక్కుల దారాల లెక్కలు సరిచేస్తూ పట్టుపోగుల కండెలను చుడుతూ రాట్నపు చక్రాలనాడిస్తూ వార్పులు పోసుకుంటు పనిలో నిమగ్నమైపోతారు . బతుకు చక్రాన్ని ముందుకు తీసుకెల్లాలంటే  అక్కడ వారి రెక్కలు అక్కడ వారి రెక్కలు నిత్యం ఆడాల్సిందే. అలా వారిరోజుల తరబడి కష్టమే ఈ అందమైన నూలు వస్త్రాలు. స్వర్ణకాంతులు విరజిమ్మె పట్టు బట్టలు. ఇంత కళాత్మకమైనవృత్తిలో ఉన్న వీరిజీవితాల్లో కళ ఉందా. నమకున్న కులవృత్తి తిండిపెడుతుందా. తెలుసుకునే ప్రయత్నం చేసింది జనతాగ్యారేజ్.


ఎంతో ఏకాగ్రత మరెంతో ఒపిక కలగలిస్తే నేతన్న తీరోక్క రంగులను పొందికగా పేరుస్తూ సంక్లిష్టమైన డిజైన్లను సైతం పొందికగా తీర్చి ఎంతో కఠోర శ్రమతో పంచవర్న శోభితమైన పట్టు వస్త్రాలుగా మలచండంలో అందెవేసిన చేయ్యి నేతన్నది. నేతలో వైవిధ్యం చూపిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ దానికి తగ్గట్టుగా గ్రాపింగ్ చేసుకుంటూ రాట్నంలా పనే లోకంగా తిరుగుతూనే ఉండే నేతన్న తన బతుకు బండిని సజావుగా నడిపించడంలో మాత్రం తడబడుతున్నాడు. కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందడంలో రోజురోజుకు ఇంకా వెనక్కివెల్లిపోతున్నాడు. పోచంపల్లి ..నారాయణ్ పేట ..గద్వాల  ..కొత్తకోట  … పుట్టపాక …కోటకొండ  ..సిద్దిపేట..సిరిసిల్ల  ప్రాంతాలేవైనా నేతన్నల డిజైన్ లలో వైవిధ్యం ఉన్నా కార్మికుల కష్టాలు మాత్రం ఒకటే . ఆ మగ్గాలమాటున దాగి ఉన్న జీవిత కథలు కూడా ఒకటే. అందుకే ఏ చేనేత ప్రాంతపు లోగిల్లకి వెల్లినా నేతన్నల  కల్లల్లో ఏదో చెప్పలేని వెలితి. వారి గుండెల్లో అంతులేని దిగులు. ఆ పెంకుటిళ్ల లోపలికి తొంగిచూస్తే అడుగడుగునా పేదరికం ఆనవాల్లు . తమ బతుకు గురించి భవిష్యత్ గురించి ఉన్న వేదనంతా సన్నటి నూలు పోగులమాటున దాచేసి ..మౌనమునుల్లా  పొద్దస్తమానం పనిచేస్తునే ఉంటారు.

రామకృష్ణ అనే వ్యక్తి ఊహ తెలిసినప్పటి నుండి మగ్గం తప్పా మరో పని తెలియదు. భార్య,తల్లి, ఇద్దరు కుమారులతో జీవితం సాగిస్తున్నాడు. సొంతంగా మగ్గంనేసే స్థోమతలేక మాస్టర్ వీవర్ల దగ్గర సరుకుతెచ్చుకొని కూలికి మగ్గం నేస్తాడు. ఒక్కచీర నేయడానికి 3600 రూపాయలు సేటు ఇస్తుండడంతో ఇంటిల్లపాది సహకారంతో మగ్గంపై నెలకు 3 చీరలదాకా నేస్తే వచ్చేవి 10 వేలకు అటుఇటు. ఆ డబ్బు జీవిత అవసరాలకు సరిపోతుండడంతో ఈ పనిని నమ్మి  ఇప్పటిదాకా  వెనకేసిందేమిలేదు…ప్రభుత్వం నుండి త్రిష్ట్ ఫండ్ తప్పా మరేది తమకు అందంలేదని బ్యంకులకు వెల్లి లోన్ అడిగినా తమను పట్టించుకోవడంలేదని దీంతో అవసరానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.


తాతతండ్రుల నుండి వచ్చిన కులవృత్తిని నమ్ముకొని దారపు పోగులతో పెనవేసుకున్న బంధం నేటికి సాగిస్తున్న బాలప్ప అనే వ్యక్తి కథ ఇలా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు నేతపనినేచి నమ్ముకొని బతుకు నెట్టుకొస్తున్నారు. జరుగుబాటుకు సరిపోయి మిగులుబాటు లేని సంసారం కావడంతో వానలకు ఇల్లు పొటుకుపెడుతున్నా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక అదే ఇంట్లోకాలం నెట్టుకొస్తున్నారు. ఇల్లు కప్పువేసుకుందామని లోన్ కోసం బ్యాంకుకు వెలితే ఎవరు తమను నమ్మిలోన్ ఇవ్వడం లేదని ..ఓ పక్క వృద్ధాప్యం మరో పక్క ఆర్ధిక లేమి వెరసి కడుపేదరికంలో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కూర్చున్న చోటనే నేస్తారుకదా ఏముందిలే అనుకోవడానికి లేదు చేనేత అంటేనే సునిషితమైన కళ. ముడి సరుకుతెచ్చి…దాన్ని వస్త్రంగా మార్చేవరకు ఎన్నోదశల్లో ఎంతోపని ..ఆడమగ వృద్ధులు అనితేడా లేకుండా ఇంటిళ్లపాది తన్లాడి ఒక్కొరు ఒక్కో పనిచేస్తేనే వార్పు మగ్గ మెక్కుతుంది. అంతేకాదు ఒక్కోచీరకు ఒక్కోవిధమైన గ్రాఫింగ్ ఉంటుంది. దానికి అనుగుణంగా అట్టాలని తొక్కాలి .. ఏ దశలో కొంచెం పొరపాటు జరిగినా శ్రమఅంతా వృథా అవుతుంది. కాబట్టి ప్రతిదశలో జాగ్రత్తగా చేయాలి. అప్పుడే నాలుగుడబ్బులు వారిచేతికొస్తాయి.

నేతకార్మికుల జీవితాల్లోనేకాదు వారి ఇళ్లలో కూడా నాటికళలేదు. చాలామందికి నేటికి పక్కా ఇల్లులేలేవు. దీంతో ఉన్న ఆ ఇంట్లోనే మగ్గం,రాట్నంతో సహ అన్ని పెట్టుకొని పనిచేయాలి. ఎండాకాలం ఏదోలా పనినడిచినా వానాకాలం మాత్రం తీవ్ర ఇక్కట్టు పడుతున్నారు . వానాకాలం నూలుపోగులు పట్టుపోగులు వలిపిరి పడతాయని అంటే పదునుగా మారి ఒకదానిరంగు మరో పోగులకు అంటే అవకాశం ఉంటుందని ఇళ్లు కూడా పాత కాలం పెంకుటిల్లులు కావడంలో కురుస్తున్నాయని కాస్తా ఏమరపాటుగా ఉన్నా వేలాది రూపాయల విలువగల చీరలకు మరకలు పడి ఆ డబ్బు మీద పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు నేతకార్మికులు.

వీరేకాదు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులందరిది ఇంచుమించు ఇదేపరిస్థితి. ఎందరో నేతన్నలు తమ వృత్తిలో కానరాని భవిష్య త్ ను తలుచుకొని బెంగతో బతుకుతున్నారు. ఇన్నాళ్లు ఈ కళను నమ్ముకున్నా సంపాదించింది పొట్టకు బట్టకే సరిపోని పరిస్థితి దీంతో పాతకాలంనాటి పెంకుటిల్లులు దూలాల మిద్దెలు . ఆ మిద్దెల్లో తమ బతుకులను నడిపించే మగ్గం తప్పా వారు దాచున్నదిఏదిలేదు.ముల్లమీద నడకలా తమ జీవితాలు ఉన్నాయని ప్రభుత్వం నుండి వస్తున్న చేయూత పెద్దగా ఏమిలేదని నేతన్నకు బీమా,చేనేతకు చేయుత పథకాలు తప్పా మరేవి తమ దాకా రాలేదంటున్నారు.నేతకార్మికులు నేతన్నకు చేయూత పథకాన్నేత్రిప్ట్ ఫండ్ అంటారు. దీని కింద జియోట్యాగ్ ఉన్న చేనేతకార్మికులు నెలవారీ కొంత మెుత్తం బ్యాంకుల్లో పొదుపు కట్టాలి. వారుచేసే పొదుపు మెత్తానికి రెండు రెట్లు ప్రభుత్వం కలుపుతుంది. మూడు సంవత్సరాల తర్వాత ఆ మెుత్తం లబ్దిదారులకు ఇస్తుంది. అయితే అది కూడా తాము చెల్లించలేని పరిస్థితుల్లో తమ కుటుంబాలు ఉన్నాయని వాపోతున్నారు నేతకార్మికులు. ఓపక్క ఈ పనిలో బతుకులేక మరోపని తెలియక నిత్యం భరించలేని బాధలు అనుభవిస్తున్నామంటున్నారు కార్మికులు.

ఊరిడిచిపోలేక మరో వృత్తి తెలియక చాలామంది ఈ వృత్తిలొనే కొనసాగుతూ పోతున్నారు. ముడిసరుకు వస్త్రంగా మారేవరకు ఎన్నో దశల్లో ఎంతోమంది కార్మికులు పనిచేస్తుంటారు. యార్న్ లేదా నూలు తెచ్చుకుని దాన్ని ఉడకబెట్టి రంగులతో డయ్యింగ్ చేసి గ్రాపింగ్ చేసుకోవడం ఆసుపోసుకోవడం వార్పులు చేసుకోవడం ఇలా ప్రతిదశలో అనేకమంది పనిచేస్తేనే అందమైన బట్ట బైటికి వస్తుంది. అలా వివిధ కార్యక్రమాలలో నిమగ్నమయ్యే కార్మికులను కదిలిస్తేనే సాధకబాధకాలేంటో తెలుస్తాయి.

వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేతరంగంలో కార్మికుల ఈ దైన్య పరిపస్థితికి కారణాలేంటి? సొంతంగా మగ్గం నేయకుండా మాప్టర్ వీవర్లపైన ఆధారపడి జీతాలకు ఎందుకు పని చేస్తున్నాయనే అంశాన్ని పరిశీలించినప్పుడు అనేక విషయాలు విస్తుపరిచాయి. సొంతగా సరుకు తెచ్చుకొని మగ్గం నేయడానికి వారికి పెట్టుబడిలేని పరిస్థితి బ్యాంకులకు వెళితే నిరాశ దీంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు డబ్బుతెచ్చి ముడిసరుకుకొని నేసినా ఒక్కచీర రెండుచీరెలు మార్కెటింగ్ చేసుకోవడం చాలాకష్టమైన పరిస్థితి. ఓ పక్క సహకార సొసైటీలు విచ్చిన్నం కావడం నేతన్న బట్ట నేస్తే కొనాల్సిన టెస్కో పట్టించుకోకపోవడంతో మాస్టర్ వీవర్ల కిందనే నేస్తు కాలం వెల్లదీస్తున్నారు నేతన్నలు.

గోరుచుట్టపై రోకలిపోటులా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న చేనేతకార్మికులకు జీయస్టీ అనేది గుదిబండగా మారిపోయింది. ఓ పక్క మార్కెట్ లో చేనేత ముసుగేసుకున్న నకిలీల బెడద మరో పక్క ముడి సరుకు నుండి తయారైన వస్త్రం అమ్మేవరకు జీయస్టీ ..పేరుకు చేనేత పై 5 శాతం జీయస్టీ అని చెప్తున్న అది కేవలం 1000 రూపాయలలోపు చేనేత వస్త్రాలకే వర్తిస్తుంది. చాలావరకు చేనేత వస్తాలు. 1000 రూపాయలకు పైమాటే దీంతో వాటికి  12 శాతం జియస్టీ కట్టాల్సిన పరిస్థితి . అంతేకాక జీయస్టీ ముఖ్య ఉద్దేశ్యం మల్టిపుల్ టాక్స్ లు లేకుండా చూడడం కాని  వీరు జీఎస్టీలో ప్రధానమైన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పరిధిలోకి రారు. వీరు ముడి సరుకులు అంటే నూలు రంగులు, రసాయనాలు తదితరాలకు పన్ను కడతారు. వీరి దగ్గర నేసిన వస్త్రాలు తీసుకునే మాస్టర్ వీవర్ కూడా ఈ పరిధిలోకి రారు సాలీనా 20 లక్షల వ్యాపారం చేసే వాళ్ళు జీఎస్టీలో నమోదు చేసుకోవాలి.చేనేత కుటుంబాలు, చేనేత వృత్తిలో అనేక రకాల ఇతర పనులు చేసే వాళ్ళు జీఎస్టీ లోకి రారు కానీ పన్ను వసూళ్ల పరిధిలోకి వస్తారు. దీంతో ముడిసరుకులపై నేతన్న కడుతున్న టాక్స్ లు వారికి రీఫండ్ అయ్యే పరిస్థితే ఉండడంలేదు.

చేనేత రంగం పర్యావరణ దోహదకారి దేశవ్యాప్తంగా కోటిన్నరమందికి పైగా ఉపాధి కల్పించిన ఈ రంగంలో ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల దేవంలో ప్రస్తుతం కేవలం 43 లక్షలమందే ఉన్నారు .వారి సంక్షేమాన్నయినా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  పట్టించుకుంటున్నాయా అంటే అదీలేదు. దానికి నిదర్శనమే చేనేతపై జీయస్టీ ఎత్తివేయాలని జీయస్టీ కౌన్సిల్ సమావేశంలో అన్నిరాష్ట్రాలు ముకుమ్మడిగా ఒక్కతాటిపై ఉండి డిమాండ్ చేయకపోవడం. అది అలుసుగా తీసుకొని కేంద్రప్రభుత్వం కూడా 2000 నుండి నేటి వరకు ఏ ఏటికాయేడు చేనేతకు కేటాయించే నిధుల తగ్గించివేస్తుంది. దీనికి నిదర్శనమే గతంలో దేశ బడ్జెట్ లో 10 శాతంగా ఉన్న చేనేత బడ్జెట్ నేడు ఒక శాతంకూడా లేకపోవడం .

గతంలో చేనేతరంగానికి చేయుతనిచ్చేందుకు అనేక రకాల పథకాలు కేంద్ర ప్రభుత్వాలు తెచ్చాయని వాటిని రాష్ట్రప్రభుత్వాల ద్వారా అమలు జరిగేవని నాబార్డ్ ద్వారా సహకార సంఘాల ద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకునే అవకాశం ఉండేదని కానీ నేడు సహకార సంఘాలనేవి విచ్చినమైపోయాయని దీంతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రుణాలు తీసుకొని  అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నిలువు నీడ సైతం లేక అల్లాడిపోతున్నారు. పేరుకు త్రిప్థ్ ఫండ్ బీమా పథకాలున్నా వాటి వల్ల నేతకార్మికులకు పెద్దగా ఒరిగేదేమిలేదని అంటున్నారు సామజికవేత్తలు.

బతుకమ్మ చీరలపేరుతో చేనేత కార్మికులను ఉద్దరిస్తున్నట్లుగా చెప్తున్న రాష్ట్రప్రభుత్వం కూడా చేనేత రంగానికి చేస్తున్నదేమిలేదని  బతుకమ్మ చీరలు కింద నాసిరకం పాలిస్టర్ చీరలను అందిస్తున్నారని  సిరిసిల్ల పవర్ లూంలపై నామమాత్రంగా 10 శాతం తయారు చేస్తు మిగిలిన వన్ని కేజిల రూపంలో సూరత్ నుండి తెప్పించి ఇస్తున్నారని దీనివల్ల బాగుపడుతున్నది వేరేవరోనంటున్నారు సామాజికవేత్తలు. నేతన్నలపై ప్రేముంటే కనీసం చేనేతపై స్టేట్ జీయస్టీ ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

రెక్కలు ఉండి కంటి చూపు సరిగా ఉన్నంత వరకే ఈ రంగంలో ఉపాధి.రెక్కల్లో ఒక్కసారి సత్తువ పోయిందంటే ఇక ఇంకొకరిపై ఆధారపడి బతుకు బండిని సాగించాల్సిందే. ఇక్కడ చాలా కుటుంబాలలో వృద్ధులు ఎన్నో ఏళ్లు మగ్గంపై పనిచేసి చేసి ఇప్పుడు చేత కాకా అనారోగ్యాలతో రోజులు వెల్లదీస్తున్నారు. చాలామంది .. ప్రధానంగా  మగ్గం పై తీక్షనంగా పోగులని సెట్ చేస్తూ అదే సమయంలో కాల్లని ఆడించాలి. కాబట్టి  ఈ వృత్తిలో  ఉండే వారు ఎక్కువగా ఎదుర్కునే సమస్య కంటిచూపు,వెన్ను నొప్పి కాళ్లనొప్పులు .

తామునేసే వస్త్రాలకు ఉన్నంత గుర్తింపు తమ బతుకులకు లేదని వాపోతున్నారు నేతన్నలు.పేరుకు ప్రభుత్వ పథకాలు దానివల్ల తమకి ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు. అందుకే రోజు రోజుకు ఈ వృత్తిలోకి వచ్చే వారిసంఖ్య తగ్గిపోతుందిని ప్రభుత్వం తీరు ఇలానే ఉంటే చేనేత కళ తమ తరాలతోనే కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు.

రైతులను గుర్తించినట్లు తమనుకూడా గుర్తించి దళిత బంధులాగా చేనేత బంధు ఇచ్చి ఆదుకోవాలని అప్పుడే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న తమ చేనేత కార్మికుల బతుకులు కాస్తా అయిన బాగుపడతాయని అప్పుడేతాము సొంతంగ మగ్గాలు వేసుకొని నేయగలమని లేకుంటే నెలవారీ వచ్చే అరకొన  సంపాదనతో జీవితాలు వెల్లక అప్పుల బతుకులయిపోతాయని కాబట్టి ప్రభుత్వం తమ పట్ల మానవతా దృక్ఫదంతో ఆలోచించి జియో ట్యాగ్ ఉన్న నేతకార్మికులకు చేనేత బందు కింద సహయంఅందించాలంటున్నారు.

చేనేతకు మార్కెట్ లేదనడంలో కూడా అర్ధంలేదని ఏటా లక్షకోట్ల టర్నోవర్ ఉన్న ఈ రంగంలో మార్కెట్ లో నకిలీల మోసాలు అరికట్టాలని టెక్స్ టైట్ లేబులింగ్ చట్టం కూడా తెచ్చి ఏ బట్టలో ఎంతశాతం ఏమేమి ఉన్నాయనేది పేర్కొవాలనపి దాంతోపాటే 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అవేవిలేకపోవడం వల్ల నేడు నకిలీలు పెరిగి ఆర్డర్ లు తగ్గి టాక్స్ లతో సతమతమవుతు చేనేతరంగం చేవలేకుండా పడిపోయిందని తోడ్పాటునిచ్చి కాపాడుకుంటేనే ఈ వృత్తిని నమ్ముకున్నవారిజీవితాలు మెరుగుపడతాయంటున్నారు.

శతాబ్దాలుగా దేశ సంసృతి ,సంప్రదాయాలకు కళానైపుణ్యానికి నిదర్శనంగా ఉంటు దేశ ఔన్నత్యాన్ని చూపిన రంగంచేనేత ప్రభుత్వాల తోడ్పాటును ఆశిస్తుంది . చీకటి పొరలు నిండిన బతుకుల్లో కొత్తకాంతులు నింపాలని కోరుకుంటుంది.మిగులుబాటులేని జీవితాలను మార్చమంటుంది. కాని ఏటా చేనేత దినోత్సవం నాడు తప్పితే నేతన్నల వెతలు పట్టని ప్రభుత్వాలు చేనేతకార్మికుల సమస్యల పై సరైన నిర్ణయం తీసుకోవడానకి ఎంతకాలం పడుతుంది అనేది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.

.

.

.

Related News

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Big Stories

×