EPAPER

DATA BREACH : కొవిడ్ టెస్టింగ్.. మీ కొంప ముంచిందా..?

DATA BREACH : కొవిడ్ టెస్టింగ్.. మీ కొంప ముంచిందా..?

DATA BREACH : మీ రోజు సాధారణంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పయనిస్తుందనుకుంటే.. పొరపాటే! మీరు అత్యంత ప్రమాదంలో ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే.. మీ వ్యక్తిగత సమాచారం నడి బజార్లో వేలానికి సిద్ధంగా ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే.. 81.5 కోట్ల భారతీయుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో వేలానికి సిద్ధంగా ఉన్నాయి. ఎనభై వేల డాలర్లకు మీ డేటా అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన. భారతదేశంలో 1.4 బిలియన్లకు పైగా ప్రజలు ఉన్నారు, ఈ లీక్.. 800 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. అమ్మకానికి పెట్టిన డేటాలో ప్రజల ఆధార్ నెంబర్, పాస్‌‌పోర్ట్ సమాచారం, ఫోన్ నంబర్స్ లాంటి విలువైన సమాచారం ఉంది. ఈ డేటాను అమ్మకానికి పెట్టింది ఎవరు ? అసలు ఈ డేటా వారికి ఎలా దొరికింది?


RESECURITY అనే అమెరికన్ ఏజెన్సీ ఈ డేటా ఉల్లంఘనను బయటపెట్టింది. డేటా ఉల్లంఘనను కనిపెట్టిన ఏజెన్సీ.. మొత్తం డేటా అమ్మకానికి ఉందని తెలిపింది. PWN0001 అనే పేరుతో ఈ డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారని RESECURITY తెలిపింది. PWN0001 ఇది ఒక థ్రెట్ యాక్టర్. అది ఒక వ్యక్తి లేదా ఒక గ్రూప్ కావచ్చు. వారు సైబర్ సెక్యూరిటీలోని లోపాలను ఉపయోగించుకొని డేటాను దొంగిలిస్తారు. ఇలా దొంగిలించిన డేటాతో డబ్బు సంపాదిస్తారు. అవసరమైతే ప్రజలకు హాని కలిగించడానికి కూడా వెనుకాడరు.

కానీ ఇక్కడ ఈ డేటాను డబ్బు కోసం వినియోగిస్తున్నారు. అది తప్పుడు చేతుల్లోకి వెళితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. భారతీయుల ఐడెంటిటీ దుర్వినియోగం కావచ్చు. ఆర్థిక నేరాలకు బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిపుణులు ఈ డేటాకు మూలం Indian Council Of Medical Research (ICMR) అని అంటున్నారు. ఈ ICMR గత కొంత కాలంగా సైబర్ అటాక్స్‌కు గురైతుందనే విషయం మనందరికీ తెలుసు. ఈ దాడుల వలన ICMR నుంచి డేటా ఉల్లంఘన జరిగుండొచ్చు. కానీ ICMRకు ఈ డేటా ఎలా వచ్చాంది అనే ప్రశ్న మన అందరిలో ఉత్పన్నమవుతుంది.


ICMR.. కోవిడ్ పరీక్షల ద్వారా డేటా సేకరించింది. కరోనా మహమ్మారి సమయంలో కోవిడ్ టెస్ట్‌లను చేసే బాధ్యతలో ICMR లీడ్ తీసుకుంది.కోవిడ్ టెస్ట్‌ల సమయంలో ప్రజలందరూ తమ వ్యక్తిగత ఐ.డీల ద్వారా కోవిడ్ టెస్ట్‌లను చేయించుకున్నారు. ఇందుకోసం ఎక్కువమంది ఆధార్ కార్డు వివరాలు ఇచ్చేవారు. ఈ కోవిడ్ పరీక్షల ఫలితాలు ICMR కు రిపోర్టు చేసారు. అదే డేటా లీక్ అయినట్లు నిపుణులు చెప్తున్నారు.

ఈ డేటా ఉల్లంఘన మొదటిది కాదు. దురదృష్టవశాత్తు గత జూన్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ పోర్టల్ నుండి డేటా లీక్ అయ్యింది. ఈ డేటాబేస్ టెలిగ్రామ్ బాట్‌ల ద్వారా యాక్సిస్ ఇచ్చారు. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్ నెంబర్ తో బాట్ ను పంచ్ చెయ్యడమే. అంతే బాట్ మీ ఆధార్ వివరాలు, పాస్‌పోర్ట్ సమాచారం, వ్యక్తిగత వివరాలతో రిప్లై ఇస్తుంది. ముఖ్యంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ డేటా ఉల్లంఘన వలన ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఈ ఉల్లంఘన హైలైట్ అయ్యిందో .. బాట్‌ను షట్ డౌన్ చేసారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఉల్లంఘన రిపోర్ట్ అయ్యింది. ఇలాంటి ఉల్లంఘనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండటం వలన మన డేటా ప్రమాదంలో పడింది.

ఇదే కాకుండా మరో వివాదం ముదురుతోంది. ఈ వివాదంలో ఆపిల్ ఐఫోన్లు ఉన్నాయి. భారతదేశంలోని ప్రతిపక్ష నేతలతో సహా చాలా మందికి ఆపిల్ నుండి మెస్సేజ్‌లు వచ్చాయి. మీ ఐఫోన్‌ను ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనే మెస్సేజ్ . ఇది ఆపిల్ థ్రెట్ నోటిఫికేషన్ సిస్టం నుండి వచ్చింది. ఈ వ్యవస్థ 2021లో ప్రవేశపెట్టారు.మీ ఫోన్ హ్యాక్ అయ్యింది అని అనుమానిస్తే.. ఇలాంటి థ్రెట్ మెస్సేజ్‌లు పంపిస్తుంది. కానీ హెచ్చరిక అస్పష్టంగా ఉంది.ఆ మెస్సేజ్ లో.. మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. ప్రభుత్వ ప్రాయోజిత దాడిదారులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆపిల్ నమ్ముతుంది. ఇది తప్పు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దయచేసి ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించండి.. అని ఆపిల్ హెచ్చరించింది.

ఈ హ్యాకింగ్ ప్రయత్నాల వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా తెలియదు. నిజంగా ఈ ఫోన్లు హ్యాక్ అయ్యాయో లేదో తెలియదు.. కానీ ఇది భారతదేశంలో రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఎవరైనా ఉండవచ్చని ఆపిల్ చెప్పింది. అంటే దీని వెనుక ఎవరున్నారో వారికి కూడా తెలియదు. కానీ భారత ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఫోన్లను హ్యాక్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆపిల్ ను విచారణలో పాల్గొనమని ప్రభుత్వం చెబుతోంది.

రాజకీయాలు పక్కన పెడితే డేటా భద్రత ఒక తీవ్రమైన సమస్య. డేటా ఉల్లంఘన.. భారత ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలకు పెద్ద ఎదురుదెబ్బ. భారత ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలు ముఖ్యంగా ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాల అనుసంధానం మీద ఆధారపడుతాయి . ఈ ముఖ్యమైన డేటా ఉల్లంఘన.. డేటా భద్రతా చర్యలను పెంచాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది.

డిజిటల్ యుగంలో.. వ్యక్తిగత డేటా సంరక్షణతో సంబంధం ఉన్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. . ముఖ్యంగా ఇండియాలో డేటా సెక్యూరిటీ చట్టం లేదు. పెద్ద ఎత్తున ఉల్లంఘనలను ఎదుర్కోవడానికి చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేదు. ఈ ఏడాది ఆగస్టులో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ఆమోదం పొందింది, కానీ అది ఇంకా నోటిఫై కాలేదు. భారతీయులు ఎటువంటి రక్షణలు లేకుండా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు.

భారతదేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు .. సైబర్ సెక్యూరిటీ ఒక ప్రాథమిక స్తంభంగా ఉండాలి, ఎందుకంటే నమ్మకాన్ని కాపాడుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగంలో డేటా ఉల్లంఘనలు.. దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తాయి.ఇది ఆర్థిక నష్టాలు, గుర్తింపు దొంగతనం లేదా రాజీపడే గోప్యత కావచ్చు. ఇది మరింత ప్రమాదకరంగా మారి డిజిటల్ వ్యవస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి.

డిజిటల్ ఏజ్ ప్రయోజనాలను స్వీకరించకుండా నిరోధిస్తాయి. అధికారులకు ఇది ఒక మేల్కొలుపు. ఇప్పటికైనా డేటా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఈ ఉల్లంఘనపై దర్యాప్తు చేయడంలో ప్రభుత్వం, ICMR క్రియాశీల వైఖరి ప్రశంసనీయమే అయినప్పటికీ, హ్యాకర్లను నిరోధించేంత పటిష్టంగా వ్యవస్థలు ఉండాలి. టెక్నాలజీ మన జీవన విధానంలో భాగమైంది.ఈ తరుణంలో డిజిటల్ ఐడెంటిటీను రక్షించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పౌరుల డేటా గోప్యత, డేటా భద్రతకి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×