EPAPER

Keeda Cola Movie Review : కీడా కోలా.. కామెడీ గోల.. లాజిక్ లేని మ్యాజిక్ తో హిట్ కొట్టిందా ?

Keeda Cola Movie Review : కీడా కోలా.. కామెడీ గోల.. లాజిక్ లేని మ్యాజిక్ తో హిట్ కొట్టిందా ?

Keeda Cola Movie Review : థియేటర్లలో సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ ఎక్కువ అంచనాలు ఉన్న చిత్రం ‘కీడా కోలా’. మూవీ కి హైప్ రావడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అతను చేసినవి రెండు సినిమాలే అయినా కానీ తనదైన మార్క్ ప్రేక్షకుల మనసులో ముద్రించేశాడు. మరి ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం.


చిత్రం: కీడా కోలా

నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్,


బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు,

రవీంద్ర విజయ్, రఘురామ్

దర్శకత్వం: తరుణ్ భాస్కర్

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్

ఎడిటింగ్: ఉపేంద్ర వర్మ;

నిర్మాత: కె.వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్

కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందరాజ్, ఉపేంద్ర వర్మ

సమర్పణ: రానా దగ్గుబాటి

 విడుదల తేది : నవంబర్ 3, 2023

కథ:

వాసు (చైతన్యరావు), అతని తాత వరదరాజు( బ్రహ్మానందం) , లాయర్ కౌశిక్ (రాగ్ మయూర్) .. ఎలాగైనా డబ్బు సంపాదించి సాలిడ్ గా సెటిల్ అయిపోవాలి అన్న ఆలోచనతో ఉంటుంటారు. వీళ్ళకి ఎప్పటికైనా బాగా డబ్బు సంపాదించాలి అన్న ఆశ బలంగా ఉంటుంది. అయితే ఒకసారి వరదరాజు కోసం తెచ్చిన కోలా బాటిల్ లో అనుకోకుండా ఒక బొద్దింక కనిపిస్తుంది. దీంతో ఈ ముగ్గురు కలిసి కంపెనీ యజమానిని బ్లాక్ మెయిల్ చేసి ఎలాగైనా డబ్బు తీసుకోవాలి అని ప్లాన్ వేసుకుంటారు.

ఇక మరోపక్క కార్పొరేటర్ గెలవడానికి అసలు కారణం తానే అని భావించే జీవన్ ఈసారి ఎలాగైనా కార్పొరేటర్ అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. ఈ నేపథ్యంలో 20 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన అన్న నాయుడు (తరుణ్ భాస్కర్ ).సహాయం తీసుకోవాలి అనుకుంటాడు. కార్పొరేటర్ అవ్వాలి అంటే మాటలే కాదు .. డబ్బులు కూడా కావాలి కదా. జీవన్ డబ్బులు కోసం సరికొత్త పన్నాగం పన్నుతాడు. ఇక అక్కడ నుంచి స్టోరీలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

డబ్బు కోసం ప్రయత్నిస్తున్న వాస్తు బ్యాచ్.. మరోపక్క జీవన్ బ్యాచ్.. ఎలా కలిశారు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఫైనల్ గా డబ్బు సంపాదించారా? బాటిల్ లోకి బొద్దింక ఎలా వచ్చింది ?తెలియాలి అంటే మొత్తానికి థియేటర్లో సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కీడా కోలా..కామెడీ తో కూడుకున్న థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో పాత్రలు, పాత్రల మధ్య ఎమోషన్స్, డబ్బులు సంపాదించాలి అన్న విపరీతమైన ఆశ, ఆశకు తగినట్టు ఎలా సంపాదించాలి అని వాళ్ళు వేసే లెక్కలు.. ఆ లెక్కలు వెనక చిక్కులు.. ఇలా స్టోరీ మొత్తం చాలా ఎక్సైటింగ్ గా ముందుకు వెళ్తుంది. ఈ మూవీలో యాక్టర్స్ తమ పాత్రకు తగినట్టు అద్భుతంగా నటించారు. బ్రహ్మానందం ఉన్నాడు అంటే కామెడీ యాంగిల్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్టోరీలో లాజిక్ అనేదానికంటే కూడా కామెడీ మ్యాజిక్ ఎక్కువగా వర్క్ అవుట్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంది.

ఇక జీవన్ పోస్టర్ చాలా వెరైటీ గా ఉంది.

నటీనటుల నటన అద్భుతంగా సెట్ అయింది.

ఫుల్ స్వింగ్ కామెడీ ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్:

స్టోరీ ఈజీ గా గెస్ చేసే విధంగా ఉంటుంది.

స్టోరీ అక్కడక్కడ కాస్త స్లోగా ఉంటుంది.

చివరిగా.. మంచి కామెడీ మూవీ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్లు ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వదు. లాజిక్ వెతికితే కష్టమే.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×