EPAPER
Kirrak Couples Episode 1

Icc World Cup 2023 : కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. ప్రపంచకప్ 2023లో శ్రేయాస్ భారీ సిక్స్..

Icc World Cup 2023 : కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. ప్రపంచకప్ 2023లో శ్రేయాస్ భారీ సిక్స్..

Icc World Cup 2023 : కొడితే కొట్టాలిరా…సిక్స్ కొట్టాలి….అన్నట్టుగా శ్రేయాస్ ఆడాడు. 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా -శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రేయాస్ విశ్వరూపం చూపించాడు. ఇంతవరకు ఫెయిల్ అవుతున్న తను ఒక్కసారి జూలు విదిల్చాడు


ప్రస్తుత ప్రపంచకప్ లో ఇదే భారీ సిక్స్ గా రికార్డ్ లకి ఎక్కింది. తను కొట్టిన సిక్స్ 106 మీటర్లు పైకెళ్లింది. ఇంకొంచెం పైకెళితే స్టేడియం బయటపడేదని అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. 36 ఓవర్ లో రజిత వేసిన 4వ బంతిని శ్రేయాస్ లాంగాన్ దిశగా స్టాండ్స్ లోకి  పంపాడు. దీని తర్వాత కివీస్ పై మాక్స్ వెల్ కొట్టిన 104 మీటర్ల సిక్స్ రెండో స్థానంలో ఉంది.

మహ్మద్ షమీ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో షమీ 5 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో అతడు మూడుసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు మిచెల్ స్టార్క్ (3) రికార్డ్ ను సమం చేశాడు. వరల్డ్ కప్ లో వీరిద్దరే ఈ ఫీట్ సాధించారు.


ఇదికాకుండా షమీ మరో రికార్డ్ సాధించాడు. వరల్డ్ కప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ సాధించాడు. వరల్డ్ కప్ లో 14 మ్యాచ్ లు ఆడిన షమీ మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు జహీర్ ఖాన్ (44) రికార్డ్ ను బద్దలు కొట్టాడు. తర్వాత స్థానాల్లో జవగల్ శ్రీనాథ్ (44), బుమ్రా (33), కుంబ్లే (31) ఉన్నారు.

విరాట్ కొహ్లీ కూడా వరల్డ్ కప్ లో అత్యధిక ఆఫ్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. సచిన్ (21), తర్వాత కొహ్లీ 13 ఉన్నారు. వీరి తర్వాత కుమార సంగక్కర (12), రోహిత్ (12) షకీబ్ అల్ హాసన్ (12) ఉన్నారు. ఇది కాకుండా మరో రికార్డ్ కూడా సాధించాడు. వన్డే చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 1000 పరుగులు పూర్తిచేసిన తొలి బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు 8 క్యాలెండర్ ఇయర్స్ లో విరాట్ 1000 పరుగులు చేస్తే, తర్వాత స్థానాల్లో సచిన్ (7) ఉన్నారు. ఆ తర్వాత గంగూలీ (6), సంగక్కర (6), రికీ పాంటింగ్ (6), రోహిత్ (4) ఉన్నారు.

శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుత రికార్డ్ సృష్టించాడు. అత్యంత తక్కువ మ్యాచుల్లో అంటే 49 మ్యాచ్ ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత్ ఆటగాడిగా నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో శుభ్ మన్ గిల్ (38), శిఖర్ ధావన్ (48) ఉన్నారు. వీరి తర్వాత సిద్దూ (52), గంగూలీ (52) స్థానాల్లో ఉన్నారు. ప్రపంచకప్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని ఇండియా నమోదుచేసింది. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలోనే 302 పరుగుల తేడాతో గెలిచిన రెండో జట్టుగా నిలిచింది

అయితే వన్డేలలో భారీ పరుగుల తేడాతో గెలిచిన రికార్డ్ కూడా ఇండియా పేరుమీదే ఉంది.  శ్రీలంకపై 2023లో తిరువనంతపురంలో జరిగిన వన్డే లో 317 పరుగుల తేడాతో గెలిచి రికార్డ్ సృష్టించింది. ఇదే ఇంతవరకు నెంబర్ వన్ గా ఉంది. తర్వాత ఆస్ట్రేలియా (309), జింబాబ్వే (304), ప్రస్తుత వరల్డ్ కప్ వన్డేలో భారత్ (302), న్యూజిలాండ్ (290), ఆస్ట్రేలియా (275) వరుసగా ఉన్నాయి. వరుసగా ఏడు విజయాలతో మళ్లీ టేబుల్ టాప్ లోకి ఇండియా చేరింది. వరల్డ్ కప్ 2023లో సెమీస్ చేరిన తొలిజట్టుగా కూడా ఇండియా నిలిచింది.

Related News

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Big Stories

×