EPAPER
Kirrak Couples Episode 1

Navavidha Bhakti : నవ విధ భక్తి అంటే..!

Navavidha Bhakti : నవ విధ భక్తి అంటే..!

Navavidha Bhakti : భక్తుడు భగవంతుని చేరేందుకు మన పెద్దలు 9 రకాల భక్తి మార్గాలను సూచించారు. భక్తుల స్థాయిని బట్టి ఎవరికి వారు వాటిని ఎంచుకోవాలని వారు సూచించారు. అవి..


శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, వారు రచించిన పుస్తకాలు ఎవరైనా చదివితే వినటం వల్ల మనిషి మనసు భగవంతుని వైపు మరలి, ఇది జ్ఞానానికి దారి చూపుతుంది. పరీక్షిత్తు మహారాజు ఈ మార్గంలో భగవంతుడిని చేరాడు.

కీర్తనా భక్తి : భగవంతుని గొప్పదనాన్ని భజించుటయే.. కీర్తనా భక్తి. భగవంతుని కటాక్షం పొందేందుకు ఇది ఒక సులభ మార్గం. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు ఈ మార్గంలోనే భగవంతుని చేరారు.


స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని, నిరంతరం వాటిని గుర్తించుకోవటమే స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూప స్మరణం అని 3 విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారంతా దీనితో తరించారు.

పాదసేవన భక్తి : భగవంతుని పాదసేవతో తరించటమే.. పాదసేవన భక్తి. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ సేవ ద్వారా మోక్షాన్ని పొందారు.

అర్చనా భక్తి : రోజూ తులసి, పుష్పాదులతో స్వామి అర్చన చేయటమే.. అర్చనా భక్తి. తాను నమ్మిన పరమాత్మ మూర్తిని ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో రోజూ వారిని ఆరాధించటం మనం నేడు చేస్తున్నాము.

వందన భక్తి : వందనం అనగా నమస్కారం. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించిన సంగతి తెలిసిందే.

దాస్య భక్తి : భగవంతుని తన యజమానిగా, తాను ఆయన సేవకుడిగా భావించి ఆయనను నిరంతరం పూజించటమే దాస్య భక్తి. కులశేఖర అళ్వారు, హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్యభక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు.

సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. భగవంతుడినే స్నేహితుడిగా భావించి, ఆయనతో కలిసి ప్రయాణించి, ఆయనకు సేవ చేసి తరించటమే సఖ్య భక్తి. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు ఈ కోవలోకి వస్తారు.

ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : భగవంతుడు తప్ప మరెవరూ లేరని, ఈ లోకంలో తనను రక్షించగలిగినది ఆయన ఒక్కడేనని మనసారా నమ్మటమే ఆత్మనివేదన భక్తి. ద్రౌపతి, గజేంద్రుడు వంటివారు ఈ మార్గంలో ముక్తిని పొందారు.

Related News

Shukra Gochar 2024: అక్టోబర్ 13 వరకు వీరికి తిరుగులేదు

Weekly Horoscope (22-28): సెప్టెంబర్ 22- 28 వరకు వారఫలాలు

Surya Grahan 2024 Negative Effect: సూర్య గ్రహణం కారణంగా 5 రాశుల వారికి అనేక ఇబ్బందులు

Weekly Lucky Zodiac Sign: సెప్టెంబరు చివరి వారంలో ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Big Stories

×