EPAPER
Kirrak Couples Episode 1

Tummala Puvvada TDP : ఓట్ల కోసం టీడీపీకి జైకొడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ హేమాహేమీలు!

Tummala Puvvada TDP : తెలంగాణ ఎన్నికల బరి నుంచి ఒక పార్టీ తప్పుకుంది. అయితే అనూహ్యంగా అదే పార్టీకి ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు జై కొడుతున్నారు. అదేంటి పోటీలో లేని పార్టీకి జై కొట్టడమేంటనుకుంటున్నారా?. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఈ సీన్ ఖమ్మంలో ఇప్పుడు హాట్ టాపిక్. ఒక వర్గం ఓట్ల కోసం పోటా పోటీగా జై తెలుగుదేశం నినాదాన్ని ఎత్తుకుంటున్నారు.

Tummala Puvvada TDP : ఓట్ల కోసం టీడీపీకి జైకొడుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ హేమాహేమీలు!

Tummala Puvvada TDP : తెలంగాణ ఎన్నికల బరి నుంచి ఒక పార్టీ తప్పుకుంది. అయితే అనూహ్యంగా అదే పార్టీకి ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు జై కొడుతున్నారు. అదేంటి పోటీలో లేని పార్టీకి జై కొట్టడమేంటనుకుంటున్నారా?. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఈ సీన్ ఖమ్మంలో ఇప్పుడు హాట్ టాపిక్. ఒక వర్గం ఓట్ల కోసం పోటా పోటీగా జై తెలుగుదేశం నినాదాన్ని ఎత్తుకుంటున్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఆసక్తికర సీన్ కనిపిస్తోంది. ఖమ్మంలో సై అంటే సై అంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కలిసి జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటున్నారు. అవును చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఖమ్మంలో టీడీపీ శ్రేణులతో కలిసి సంబరాల్లో వేర్వేరుగా పాల్గొన్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది. దీంతో ఆ వర్గం ఓట్లను పొందడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి టీడీపీకి అనుకూలంగా వీరిద్దరూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బాబు రిలీజ్ అవడంతో టీడీపీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మలపై బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ స్లోగన్స్ ఇచ్చారు.


ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న భారీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన సంబరాల్లో తుమ్మల, పువ్వాడ పాల్గొన్నారు. టీడీపీ నేతలు మంత్రి పువ్వాడని పిలవకపోయినా ఆయన స్వయంగా వచ్చారు. చంద్రబాబు రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైక్ తీసుకుని ప్రసంగించడంతో టీడీపీ నేతలు కాసేపు ఆశ్చర్య పోయినా.. తరువాత సంబరాలు కంటిన్యూ చేశారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించడంతో పాటు జై చంద్రబాబు అంటూ ఉన్న ప్ల కార్డులు ప్రదర్శిస్తూ హడావుడి చేశారు. టీడీపీ శ్రేణులతో పాటే కలిసిపోయారు.

అటు ఖమ్మంలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న సీనియర్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబు రిలీజ్ సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల అనంతరం తుమ్మల ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికే వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కరించి, కేక్ కట్ చేసి అక్కడి వేడుకల్లో పాల్గొని చంద్రబాబుకి జై కొట్టారు. ఎన్టీఆర్ హయాంలో తుమ్మల టీడీపీ నేతగా ఉండేవారు. దాదాపు 30 ఏళ్లకు పైగా ఆయన తెలుగుదేశం పార్టీలో పని చేసి మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా పని చేశారు.

తాజా ఎన్నికల్లో తాను ఆశించిన పాలేరు స్థానం నుంచి టికెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్ వల్లే తన రాజకీయ భవిష్యత్తు ఏర్పడిందని ఆయన లేకపోతే తనకు రాజకీయ జీవితం లేదని తుమ్మల చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ఆయన నికార్స్ అయిన మనిషి అని అన్నారు. నిజం కాస్త లేట్ అయినా సరే బయటకు వస్తుందని చెప్పుకొచ్చారు.

అక్రమ కేసుల్లో బందీ అయిన చంద్రబాబు తాత్కాలిక బెయిల్ పై రావడంతో తన సంతోషాన్ని టీడీపీ కార్యకర్తలతో పంచుకోవాలని టీడీపీ ఆఫీసుకు వచ్చానని తుమ్మల అన్నారు. మరో నెల పాటు జరిగే తన ప్రచార కార్యక్రమాల్లోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు తన విజయంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మార్పు వచ్చింది. అక్కడి టీడీపీ సానుభూతి పరుల ఓట్లను పొందేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీ పడుతూ వచ్చారు. మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయడం సరికాదని అక్రమమని అన్నారు. అదే బాటలో మిగితా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల కూడా టీడీపీకి జై కొట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంటున్నట్లు తెలపడంతో ఆ వర్గం ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ప్రధాన పార్టీ నేతలందరూ బిజీగా ఉన్నారు.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×