EPAPER
Kirrak Couples Episode 1

Chabely Rodriguez : డాక్టర్ కోర్సు చదవలేదు.. హాస్పిటల్‌లోనే వర్క్.. నెలకు రూ.15 లక్షల సంపాదన!

Chabely Rodriguez : ఈ రోజుల్లో డాక్టర్ విద్య చదవాలంటే లక్షల్లో కాదు.. కోట్లలో ఖర్చు అవుతోంది. అలాంటిది ఓ యువతి మెడిసిన్ చదవకుండానే హాస్పిటల్‌లో పని చేస్తూ సంవత్సరానికి రూ. 1 కోటి 75 లక్షలు సంపాదిస్తోంది. అంటే నెలకు ఆమె జీతం దాదాపు రూ.15 లక్షలు అన్న మాట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంకా చెప్పాలంటే ఆ యువతి ఓ పేద రైతు కుటుంబంలో పుట్టింది.

Chabely Rodriguez : డాక్టర్ కోర్సు చదవలేదు.. హాస్పిటల్‌లోనే వర్క్.. నెలకు రూ.15 లక్షల సంపాదన!

Chabely Rodriguez : ఈ రోజుల్లో డాక్టర్ విద్య చదవాలంటే లక్షల్లో కాదు.. కోట్లలో ఖర్చు అవుతోంది. అలాంటిది ఓ యువతి మెడిసిన్ చదవకుండానే హాస్పిటల్‌లో పని చేస్తూ సంవత్సరానికి రూ. 1 కోటి 75 లక్షలు సంపాదిస్తోంది. అంటే నెలకు ఆమె జీతం దాదాపు రూ.15 లక్షలు అన్న మాట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంకా చెప్పాలంటే ఆ యువతి ఓ పేద రైతు కుటుంబంలో పుట్టింది.


చాబెలి రోడ్రిగేజ్ వయసు 28 సంవత్సరాలు. ఆమె తండ్రి క్యూబా దేశంలో ఒక పేద రైతు. చిన్నతనం నుంచి చాబెలి తన సోదరులు, సోదరీమణుల కంటే ఎక్కువ కష్టపడేది. తల్లికి ఇంట్లో పనులలో సహాయం చేస్తూ.. వీలు దొరికినప్పుడల్లా తండ్రి పొలంలో పనిచేసేది. రోజూ స్కూలుకు వెళ్లేది. ఆమె తండ్రి రోజూ పనిచేసినా ఆయన సంపాదన సరిపోయేది కాదు. దీంతో చాబెలి తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలు అనుభవించింది. తను చదువుకోలేదు కాబట్టి పిల్లలను బాగా చదువుకోవాలని ఆమె తండ్రి ప్రోత్సహించేవాడు.

కష్టపడేతత్వం ఉన్న చాబెలి తన తండ్రి చెప్పినట్టుగా స్కూల్‌లో బాగా చదువుకుంది. పై చదువులకోసం అమెరికా వెళ్లి బ్రూక్లిన్ కాలేజీలో కెమిస్ట్రీ డిగ్రీ సాధించింది. ఆ కోర్సు కోసం ఆమె బ్యాంక్ నుంచి పెద్ద మొత్తం లోన్ కూడా తీసుకుంది. ఆ తరువాత ఆమె మెడిసిన్ చదవాలనుకుంది కానీ అందుకు చాలా ఖర్చవుతుందని తెలిసి ఆ ఆలోచన మానేసింది.


ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించాలనుకుంది కానీ ఆమె చదువుకు సంబంధించిన వృత్తి అయితే బాగుంటుందని భావించి ఓ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌గా పని చేసేది. అక్కడ ఆమెకు ఒక కోర్సు గురించి తెలిసింది. కెమిస్టీ మాస్టర్స్ కోర్సులో సర్టిఫైడ్ అనెస్థీశీయాలజిస్ట్ అసిస్టింట్. ఆ కోర్సు రెండు సంవత్సరాలు చదవాలి.

ఇప్పుడు మళ్లీ కోర్సు చేయాలంటే మళ్లీ లోన్ తీసుకోవాలి. అందుకోసం ఆమె హాస్పిటల్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తూ చదువుకునేది. అనెస్థీశియాలజిస్ట్ అసిస్టింట్ కోర్సు కోసం ఆమె తీసుకున్న లోన్ తీర్చాలంటే కష్టమని తెలుసు కానీ వెంటనే మంచి ఉద్యోగం వస్తే.. మంచి జీతం వస్తుంది. దాంతో తీసుకున్న అప్పు సులభంగా చెల్లించవచ్చు అని అంచనా వేసింది.

అనుకున్నట్లుగా రెండు సంవత్సరాల్లో చాబెలి అనెస్థీశియాలజిస్ట్ అసిస్టింట్ కోర్సు పూర్తి చేసింది. చదువు పూర్తైన మూడు నెలలలోపే ఆమెకు ఫ్లోరిడాలోని టాంపా హాస్పిటల్‌లో ఉద్యోగం వచ్చింది. ఆమె ప్రతి రోజు హాప్పిటల్‌లో జరిగే ఆపరేషన్లలో డాక్టర్లకు సహాయం చేస్తుంది.

ముఖ్యంగా ఆపరేషన్ జరగబోయే పేషంట్లకు అనెస్థీశియా(మత్తు) ఇస్తుంది. ఒక రోజు ఆమె గరిష్ఠంగా 14 ఆపరేషన్ల కోసం పని చేస్తుంది. ఇవి కాకుండా అపరేషన్ లేని సమయంలో పేషంట్లకు ఇంజెక్షన్ చేయడం, సెలైన్ బాటిల్స్ పెట్టడం వంటి పనులు చేస్తుంది. ఈ పనికోసం ఆమె సంవత్సరానికి 2,10,000 డాలర్లు(రూ1 కోటి 75 లక్షలు) హాస్పిటల్ నుంచి జీతం పొందుతుంది. అంటే నెలకు దాదాపు రూ.15 లక్షలు అన్న మాట.

చాబెలి గత రెండేళ్ల నుంచి ఈ ఉద్యోగం చేస్తోంది. డబ్బు విలువ ఏంటో బాగా తెలుసు గనుక వచ్చిన జీతంతో ముందు తీసుకున్న బ్యాంక్ లోన్ చెల్లించి.. మిగతాది చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంది. ముఖ్యంగా డబ్బు ఉంది కదా.. అని ఓ పెద్ద ఇల్లు, కారు కొనలేదు. ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకొని అందులో తన స్నేహితురాలితో రెంట్ షేర్ చేసుకుంటోంది. పైగా కారు కూడా మూడు నెలలు, ఆరు నెలల కాలానికి అద్దెకు తీసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందని అలా చేస్తుంది.

అలా అని మరీ పిసినారి కాదు. చాలా చోట్ల హాలిడేలకు వెళుతుంది. మంచి రెస్టారెంట్లలో ఇష్టమైన ఫుడ్ తింటుంది. విమానంలో ఖర్చు ఎక్కువైనా సరే.. ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణిస్తుంది. క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తుంది.. కానీ ఆఫర్లపై డిస్కౌంట్ చెక్ చేసుకుంటుంది. తరుచూ తల్లిదండ్రులను చూడడానికి క్యూబా దేశానికి వెళుతుంది, అలాగే.. ఇతర దేశాలలో ఉన్న తన సోదరులను కలవడానికి కూడా వెళుతుంది.

ఇంతే కాదు ఈ తెలివైన అమ్మాయి.. ఖాళీ సమయంలో యుట్యూబ్ వీడియోస్ కూడా చేస్తుంది. ఈ వీడియోలలో తన వృత్తికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే.. మిగతా వారిలాగా బాగా పనిచేసి త్వరగా రిటైర్ కావాలని ఆమె భావించడంలేదు. కష్టాలను ఎదిరించి జీవితాన్ని సరైన విధానంలో ఎలా గెలవాలి.. అనే విషయంలో నేటి యువతకు చాబెలి ఒక ఇన్సిపిరేషన్ అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Related News

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Big Stories

×