EPAPER

Ileana D’Cruz : నాజూకు షోకులు.. గోవా హాట్ బ్యూటీ.. బర్త్ డే స్పెషల్..

Ileana D’Cruz :  నాజూకు షోకులు.. గోవా హాట్ బ్యూటీ..  బర్త్ డే స్పెషల్..

Ileana D’Cruz : తెలుగు ఇండస్ట్రీలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తమ తళుకు బెళుకుతో టాలీవుడ్ మది దోచుకున్న తారలు ఎందరో. అలా తన నాజూకు షోకులతో కుర్రకారు మతి పోగొట్టిన హాట్ బ్యూటీ ఇలియానా. ఈ గోవా పాలకోవా ఒక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఇలియానా తన కెరీర్ ను ఆరంభించి మెల్లగా అన్ని ఇండస్ట్రీలలో తన ప్రతిభను చాటుకుంది. నవంబర్ 1 ఈ గోవా బ్యూటీ పుట్టినరోజు.


ఇలియానా డి క్రూజ్.. నవంబర్ 1 ,1987న ముంబైలో జన్మించింది. ఆమెకు పది సంవత్సరాల వయసప్పుడు ఆమె కుటుంబం గోవాలోని పర్రా అనే గ్రామంలో సెటిల్ అయ్యింది. మోడలింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఇలియానా.. 2006 వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ ఒక్క మూవీతో ఇలియానాకు యూత్ లో ఎక్కడ లేని ఫాలోయింగ్ వచ్చింది. నిజానికి ఇలియానాకు మొదట మూవీ ఛాన్స్ ఇచ్చింది తేజ. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ అసలు మొదలు కాలేదు. దీంతో ఆమె ఫస్ట్ మూవీ దేవదాస్ తోటే మంచి హిట్ అందుకుంది.

ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన మహేష్ బాబు పోకిరి మూవీతో ఇలియానా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. మొదటి రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇలియానా లక్కీ స్టార్ అన్న ఇంప్రెషన్ పడిపోయింది. మన ఇండస్ట్రీలో ఇటువంటి నమ్మకాలు ఎక్కువ కదా.. ఇంకేముంది ఆమె కాల్ షీట్స్ కాస్ట్లీ గా అయిపోయాయి. ఇక అక్కడ నుంచి వరుస పెట్టి స్టార్ హీరోలతో ఫుల్ స్వింగ్లో మూవీస్ చేసింది ఇలియానా.


ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్, రెచ్చిపో, సలీమ్, శక్తి, జులాయి.. ఇలా వరుసగా కుర్ర హీరోలతో ఇలియానా మూవీస్ వచ్చాయి. ఈ బ్యూటీ అందానికి టాలీవుడే కాక తమిళ , కన్నడ ఇండస్ట్రీలు కూడా తహతహలాడాయి. అయితే ఎప్పటి నుంచో ఆమె కలలుగంటున్న బాలీవుడ్ లోకి ఎంట్రీ రణబీర్ కపూర్ బర్ఫీ మూవీతో సాధ్యపడింది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ కాకపోయినా హీరోయిన్ తో సమానంగా ముఖ్యమైన పాత్రలో ఇలియానా నటించింది. బాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే సక్సెస్ దక్కడంతో ఆఫర్లు వరుసగా వచ్చాయి. కానీ వరుస పరాజయాలు ఎదురు కావడంతో తిరిగి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి చేరుకుంది ఇలియానా.

అదే సమయానికి రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీలో నటించింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో కలిసి ఇలియానా నటించిన బిగ్ బుల్ చిత్రం కరోనా ప్యాండమిక్ కారణంగా నేరుగా హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై విడుదల అయింది. ఒకప్పుడు కుర్రకారుని తన అందాలతో మెస్పరైస్ చేసిన ఇలియానా, ఎందుకనో ఇంతకు ముందులా తెరపై మురిపించలేకపోతోంది అనే మాట అక్కడక్కడ వినిపిస్తుంది. మరోపక్క ఇలియానా కూడా తిరిగి స్క్రీన్ పై తన జాదు చూపించడానికి మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నాజుకు సోకుల.. గోవా పాలకోవా.. ఇలియానా కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×