EPAPER

Pakistan Cricket Youtubers : సరిహద్దులు దాటిన అభిమానం.. పాకిస్తానీ యూట్యూబర్లకు ఇండియాలో యమ క్రేజ్

Pakistan Cricket Youtubers : భారతదేశంతో పాటు ఆసియా ఖండంలో చాలా దేశాలకు క్రికెట్ అంటే ఒక పిచ్చి, ఒక మతం. క్రికెట్ అంటే భారత్‌లో ఎంత అభిమానం చూపిస్తారో.. పక్క దేశం పాకిస్తాన్‌లో కూడా అంతే ఇష్టపడతారు. తమ దేశ క్రికెట్ జట్టు ఒక మ్యాచ్ ఆడుతుంటే ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో తీక్షణంగా గమనిస్తారు.

Pakistan Cricket Youtubers : సరిహద్దులు దాటిన అభిమానం.. పాకిస్తానీ యూట్యూబర్లకు ఇండియాలో యమ క్రేజ్

Pakistan Cricket Youtubers : భారతదేశంతో పాటు ఆసియా ఖండంలో చాలా దేశాలకు క్రికెట్ అంటే ఒక పిచ్చి, ఒక మతం. క్రికెట్ అంటే భారత్‌లో ఎంత అభిమానం చూపిస్తారో.. పక్క దేశం పాకిస్తాన్‌లో కూడా అంతే ఇష్టపడతారు. తమ దేశ క్రికెట్ జట్టు ఒక మ్యాచ్ ఆడుతుంటే ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో తీక్షణంగా గమనిస్తారు. ఒక వేళ ఆటగాళ్ల ఆటతీరు పేలవంగా ఉంటే మాత్రం వారికి క్రికెట్ అభిమానులు చేతిలో మూడినట్లే. సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మ్యాచ్ ఓడిపోతే అంతే సంగతలు. ఇండియా మ్యాచ్ ఓడిపోతే సగటు భారత క్రికెట్ అభిమానులు ఏ ఇద్దరు కలిసినా ఆ ప్లేయర్ ఇలా చేశాడు. ఈ ప్లేయర్ అలా ఆడాల్సింది అని చర్చలు మొదలుపెడతారు.


ఇదంతా ఎందుకు ప్రస్తవన వచ్చిందంటే.. భారతలో క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు ఇలాంటి చర్చలు యూట్యూబ్‌లో చూస్తున్నారు. క్రికెట్ గురించి మ్యాచ్ తరువాత టీవీ ఛానెళ్లలో చర్చలు పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ యూట్యూబ్ ఛానెళ్లలో అంతకు మించిన విశ్లేషణ ఇస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ యూట్యూబర్లు చేస్తున్న మ్యాచ్ విశ్లేషణ. చాలా సింపుల్‌గా ఆటగాళ్లను విమర్శిస్తారు .. సగటు అభిమాని ఎలా వ్యవహరిస్తాడో అలా ఉండడంతో.. భారత క్రికెట్ అభిమానులు వారి వీడియోస్‌ని తెగ చూస్తున్నారు.

పాకిస్తానీ క్రికెట్ యూట్యూబర్స్‌లో ముఖ్యంగా సవేరా పాషా, సయ్యద్ అలీ ఇమ్రాన్, వాసే హబీబ్, ఖమర్ రజా ఇఫ్ఫీల వీడియోలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. సవేరా పాషా తన భర్త సయ్యద్ అలీ ఇమ్రాన్‌తో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈమె క్రికెట్ గురించి, ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ గురించి, మ్యాచ్ ఫలితాల గురించి మాట్లాడేటప్పుడు మిడిల్ క్లాస్ ప్రేక్షకులు మాట్లాడే భాషను ఉపయోగిస్తుంది. దీంతో ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు వాళ్ల విశ్లేషణను ఇష్టపడుతున్నారు.


ఆమె భర్త అలీ ఇమ్రాన్ కూడా సగటు క్రికెట్ అభిమాని ఎలా ఫీలవుతాడు, మ్యాచ్‌లో తమ అభిమాన ఆటతీరు బాగా లేదంటే.. అభిమానుల మనో భావాలు ఎలా దెబ్బతింటాయి అనే విషయంపై ఫోకస్ చేస్తాడు. ఇలాంటి విశ్లేషణలకు అభిమానులు ఎక్కువగా కనెక్టవుతున్నారు. ఈ దంపతులిద్దరూ తమ వీడియోలలో తమ ఫ్యామిలీ గురించి కూడా ఓసారి ప్రస్తావించారు. వీరిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు ఉంది. కొడుకు ఇంట్లో ఆడుకునే చిన్న పిల్లాడు. తన తల్లి యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే తనతో ఆడుకోవడానికి ఎందుకు రావట్లేదని ఏడుస్తాడు.

అలాగే తన కూతురు గురించి అలి ఇమ్రాన్ చెబుతూ.. ఆమె రామయణం, మహాభారతం లాంటి పుస్తకాలను చదువుతుందని అన్నాడు. తమ దేశ చరిత్ర, సంప్రదాయం భారతదేశంతో ముడిపడి ఉన్నాయని అతను అభిప్రాయపడ్డాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఇరుదేశాల వైషమ్యాలను మరిపించేలా వీరి వీడియోస్ ఉంటాయి.

సవేరా పాష, అలీ ఇమ్రాన్ ఛానెల్‌తో పాటు వాసే హబీబ్, ఖమర్ రజా ఛానెల్‌ వీడియోలను భారత్‌లో క్రికెట్ అభిమానులు తెగ చూస్తున్నారు. వీరిద్దరి వీడియోలు సవేరా పాష చేసే సింపుల్ ధోరణికి భిన్నంగా ఉంటాయి. వాసే హబీబ్ వీడియోలలో విపరీతమైన ఫన్ ఉంటుంది. క్రికటర్లను తెగ విమర్శిస్తాడు. పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోతే బాబర్ ఆజమ్‌ని తిడుతూ ”తొక్కలో కేప్టన్.. వీడు మారడు. ఎన్నిసార్లు అవకాశం ఇవ్వాలరా బాబు” అంటూ తన పార్ట్‌నర్ ఖమర్ రజా ఇఫ్ఫీతో చర్చ పెడతాడు. ఇద్దరూ కలిసి టీమ్ పెర్ఫార్మెన్స్‌ని చీల్చి చెండాడుతారు.

ఒక వీడియోలో అయితే ఇక వీరి వల్ల కాదు.. పాకిస్తాన్ అమ్మాయిల జట్టును సిద్ధం చేయాలి.. కనీసం వాళ్లైనా దేశానికి కప్పులు తెస్తారు అని ఇద్దరు కుర్రాళ్లు చాయ్ అడ్డా వద్ద మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది వ్యవహారం . కొన్నిసార్లు ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు గొడవ పడతారు. ఆ గొడవ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది.

ఇండియాలో తాము పెద్ద క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పుకునే అభిషేక్ షుక్లా, అర్పిత్ పాండే, షాలిని, తరుణ్ నౌలానీ లాంటి అభిమానులు టీవీ ఛానెళ్లను వదిలేసి క్రికెట్ విశ్లేషణ కోసం ఈ పాకిస్తానీ యూటబర్స్ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×