EPAPER

Loan Against Property : స్థిరాస్తిపై రుణం కావాలా?

Loan Against Property : స్థిరాస్తిపై రుణం కావాలా?

Loan Against Property : మీ వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం.. లోన్ తీసుకోవాలనుకునే వారికి స్థిరాస్తి రుణం ఒక మంచి ప్రత్యామ్నాయం. ప్రస్తుతం బ్యాంకులు కూడా ఈ లోన్లు బాగానే ఇస్తున్నాయి. మీ లోన్‌కు మీ స్థిరాస్తి పూచీకత్తుగా ఉంటుంది కనుక వడ్డీశాతమూ కాస్త తక్కువే ఉంటుంది. ముఖ్యంగా.. ఎమర్జెన్సీ పరిస్థితిలో స్థిరాస్తిని అమ్ముకునే పనిలేకుండా ఈ లోన్ ఆదుకుంటుంది. బ్యాంకులు పలుపేర్లతో స్థిరాస్తి రుణాలను మంజూరు చేస్తున్నాయి. అవి..


ఇవీ అర్హతలు..

  • ప్రాపర్టీపై లోన్ తీసుకునే వ్యక్తి భారతీయుడై ఉండాలి. వయసు 21 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఉద్యోగులైతే కనీస నెల వేతనం రూ. 30 వేలు ఉండాలి. స్వయంఉపాధి, వ్యాపారులైతే.. మీ గత ఆదాయరుజువును బ్యాంకుకు చూపాల్సి ఉంటుంది.
  • ఐడీ ప్రూఫ్, అడ్రస్ పూఫ్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పే స్లిప్స్, ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు వంటి పత్రాలను బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఐదు రకాల లోన్లు..!
కమర్షియల్ ప్రాపర్టీపై లోన్
మీకు షాపు, కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఆఫీస్ స్పేస్, విద్యాసంస్థలు, హోటల్స్ వంటివి పెట్టుకునే వీలున్న భవనం వంటి స్థిరాస్తి ఉంటే అతి తక్కువ టైంలో తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తం లోన్ లభిస్తుంది.


లీజ్ రెంటింగ్ డిస్కౌంటింగ్ లోన్
మీ ప్రాపర్టీని ఎవరికైనా లీజుకిచ్చి, దానిపై నెలనెలా వచ్చే ఆదాయాన్ని రుజువుగా చూపించి లీజ్ రెంటింగ్ డిస్కౌంటింగ్ లోన్ పొందొచ్చు. మీకొచ్చే అద్దె రుజువును బ్యాంకుకు చూపితే.. ఆదాయాన్ని బట్టి లోన్ ఇస్తారు.

రెసిడెన్షియల్ ప్రాపర్టీపై లోన్
ఇల్లు, ఫ్లాట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి వాటిపైనా ఆస్తి విలువను బట్టి ఈ లోన్ ఇస్తారు.

ఉమ్మడి ఆస్తిపై లోన్
ఏదైనా ఉమ్మడి స్థిరాస్తిపైనా లోన్ కావాలంటే.. ఆ ఆస్తికి సంబంధించిన మిగిలిన యజమానులు ఈ రుణానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వటమే గాక లోన్ బాండ్ మీద వారంతా సంతకం చేయాలి.

టాపప్ ప్రాపర్టీ లోన్
మీరు ఇప్పటికే మీ స్థిరాస్తిపై లోన్ తీసుకుని, ఇన్‌స్టాల్‌మెంట్లు కడుతూ, మరింత రుణం కావాలంటే ఈ లోన్ ఇస్తారు. అయితే మీ సిబిల్ స్కోర్ బాగుందా? వంటివన్నీ పరిశీలించాకే.. ఈ లోన్ మంజూరు చేస్తారు.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×