EPAPER

KCR : దుబ్బాక అభ్యర్థిపై దాడి.. కేసీఆర్ వార్నింగ్ ఇదే..

KCR : దుబ్బాక అభ్యర్థిపై దాడి.. కేసీఆర్ వార్నింగ్ ఇదే..

KCR : మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. తొలుత మంత్రి హరీశ్‌ రావుకు ఫోన్‌ చేసి ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ తర్వాత బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కే ఈ ఘటనపై కేసీఆర్ మాట్లాడారు. మనం సమస్యలపై యుద్ధం చేస్తున్నామన్నారు. కానీ ప్రతిపక్షాలు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయని ఆరోపించారు. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పిందని వెల్లడించారు.


ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ఈ చర్యలకు దిగుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కత్తితో తమ అభ్యర్థిపై దాడి చేశారని.. ఈ ఘటనపై తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి.

తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయని ఎప్పుడూ ఎవరూ కూడా హింసకు దిగలేదని కేసీఆర్ అన్నారు. ప్రజలు గెలిపిస్తే గెలిచామన్నారు. వీలైనంత ప్రజలకు సేవ చేశామని తెలిపారు. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదన్నారు.


సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్‌ రెడ్డిపై దాడి తనపై జరిగనట్లే భావిస్తానని అన్నారు. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇది రాజకీయమా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

Related News

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Big Stories

×