EPAPER

Bishan Singh Bedi: నల్ల బ్యాడ్జీలు.. ఎందుకు కట్టుకున్నారంటే?

Bishan Singh Bedi: నల్ల బ్యాడ్జీలు.. ఎందుకు కట్టుకున్నారంటే?

Bishan Singh Bedi: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్ తో లఖ్ నవ్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్ నల్లబ్యాడ్జీలు ధరించారు. దీంతో ఒక్కసారి క్రీడాలోకం షాక్ కి గురైంది. ఏంట్రా బాబూ…ఇంతవరకు బాగానే ఉంది కదా… బోర్డుకి- జట్టుకి మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? అని ఒకటే కంగారు పడ్డారు. అప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపై జోరుగా చర్చ మొదలైంది.. ఏమైంది? ఏమైంది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు…ఇది నిప్పులా రాజుకుంటున్న సమయంలో బోర్డుకి తెలివి వచ్చింది.


ఇదేదో కొంప మునిగిపోయే యవ్వారం అనుకుంది. వెంటనే తెలివి తెచ్చుకుని సోషల్ మీడియా వేదికగా అలా ఇండియన్స్ బ్లాక్ బ్యాడ్జెస్ ఎందుకు పెట్టుకున్నారో వివరించింది.

ఇటీవల ఇండియన్ లెజండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ అస్వస్థతతో ఈనెల 23న మరణించాడు. ఆయన మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు చేతికి నల్ల ఆర్మ్ బ్యాండ్స్ ధరించినట్టు బోర్డు తెలిపింది. ఆ సమాధానం తెలియగానే నెటిజన్లు అందరూ తమకే ముందు తెలిసిందన్నట్టు నెట్టింట వేగంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. టీమ్ ఇండియా ఎందుకు నల్లబ్యాడ్జీలు ధరించిందో తమకే తెలుసన్నట్టుగా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.


మిగిలినవాళ్లు అందించిన అభినందనలతో దిల్ ఖుష్ అయ్యారు. లెగ్ స్పిన్నర్ అయిన బిషన్ సింగ్ బేడీ 1966-1979 వరకు భారతీయ జట్టుకు సేవలందించారు. 67 టెస్టులు, 10 వన్డేలు ఆడిన ఆయన మొత్తం 273 వికెట్లు తీశాడు. 1975-79 మధ్య 22 టెస్టుల్లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించాడు. అప్పట్లో ప్రముఖ ప్లేయర్లు ఎంతోమంది ఉండేవారు. గుండప్ప విశ్వనాధ్, అజిత్ వాడేకర్, వెంకట రాఘవన్, సునీల్ గవాస్కర్, ఎంఎల్ జయసింహ, అశోక్ మన్కడ్, ప్రసన్న, ఏక్ నాథ్ సోల్కర్ తదితర ప్రముఖులతో ఆయన జాతీయ జట్టుకి ఆడారు.

భారత క్రికెట్ జట్టు ఎదుగదలలో బేడీ పాత్ర ప్రశంసనీయమని చెబుతారు. లెగ్ స్పిన్ వేయడంలో ఎన్నో మెలకువలను తర్వాత తరానికి నేర్పించి, ఆ స్పిన్ మాయాజాలాన్ని బతికించిన వారిలో బిషన్ సింగ్ బేడి ఒకరని చెబుతారు. అందుకే బీసీసీఐ కూడా ఆ మహానుభావుడి సేవలను గుర్తు చేసుకుందని తెలిపారు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×