EPAPER

Israel-Hamas | భూతల దాడలును ఉధ‌ృతం చేస్తాం.. మనుగడ కోసమే పోరాటం : ఇజ్రాయేల్ ప్రధాని

Israel-Hamas | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం రెండో దశకి చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం వెల్లడించారు. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా ఇజ్రయె

Israel-Hamas | భూతల దాడలును ఉధ‌ృతం చేస్తాం.. మనుగడ కోసమే పోరాటం : ఇజ్రాయేల్ ప్రధాని

Israel-Hamas | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం రెండో దశకి చేరిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం వెల్లడించారు. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా ఇజ్రయెల్ దళాలు రెండో దశ యుద్ధాన్ని ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఈ దశలో శత్రువు భూమి పై ఉన్నా, లేక సొరంగాల్లో ఉన్నా అంతమొందిస్తామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.


హమాస్ తో చేస్తున్న యుద్ధాన్ని ఇజ్రాయెల్ మనుగడ కోసం చేస్తున్న పోరాటంగా నెతన్యాహు అభివర్ణించారు. గాజాలో మొదలైన రెండో దశ గ్రౌండ్ ఆపరేషన్ సుదీర్ఘమైనది, కఠినమైనది అని అన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఓ కఠిన పరీక్షను ఎదుర్కొంటోందని, అందులో తాము తప్పకుండా విజేతలవుతామాని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బందీలను వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెలీలతో పాటు ఇతర జాతీయులను కిడ్నాప్ చేయడం ఒక అమానవీయ చర్య అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం నైతిక విలువలు పాటిస్తుందని.. అమాయక పౌరులకు హాని చేయదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర గాజా వాసులు యుద్ధం జరుగుతున్న కారణంగా దక్షిణ గాజా వైపు వెళ్లి సురక్షితంగా ఉండాలని నెతన్యాహు మరోమారు సూచించారు.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు గాజాలో మృతుల సంఖ్య 8,000 అందులో దాటిందని, సగం చిన్నపిల్లలు ఉన్నారని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.

గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణకాండపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ చేస్తున్నది ప్రతీకారం కాదని, అది యుద్ధ నేరమని ఎర్డోగాన్ ఒక భారీ ర్యాలీలో అన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఒక ఆక్రమణదారుడు కాబట్టి.. హమాస్ చేస్తున్నది ఉగ్రవాదం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా.. ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు బేషరతుగా మద్దతు ఇస్తున్నాయని టర్కీ అధ్యక్షుడు విమర్శించారు.

ఎర్డోగాన్ అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ.. టర్కీలో ఉన్న తన రాయబారిని ఇజ్రాయెల్ వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2022లో రాయబారులను తిరిగి నియమించడానికి అంగీకరించిన తరువాత టర్కీ-ఇజ్రాయెల్ దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలను సవరించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఈ పరిణామం ఎదురుదెబ్బ.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×