EPAPER

Pak Vs South Africa Issue: పాక్ Vs సౌతాఫ్రికా.. సహనం కోల్పోయిన ఆటగాళ్లు..

Pak Vs South Africa Issue: పాక్ Vs సౌతాఫ్రికా.. సహనం కోల్పోయిన ఆటగాళ్లు..

Pak Vs South Africa Issue: వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీస్ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో పాకిస్తాన్ తడబడింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ మొదలుపెట్టారు. ఏ దశలోనూ పాకిస్తాన్ కోలుకోకుండా వరుసగా వికెట్లు పడగొడుతూ వెళ్లారు. అసలే స్వదేశం నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్ జట్టు చాలా సీరియస్ గా గ్రౌండ్ లోకి దిగింది.


ఈ దశలో రెండు జట్ల మధ్య ఒక ఘటన జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. మహ్మద్ రిజ్వాన్ సెకండ్ డౌన్ బ్యాటింగ్ కి వచ్చాడు. ఈ సమయంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాన్సన్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది.
ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే పాక్ కి షాక్ ల మీద షాక్ లు తగిలాయి. సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ త్వర త్వరగా రెండు పాక్ వికెట్లను తీశాడు. ఐదో ఓవర్లో అబ్దుల్లా షఫీక్‌, ఏడో ఓవర్లో ఇమాముల్ హక్‌ను పెవిలియన్ కు చేర్చాడు. అప్పటికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులతో పాక్ కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో సెకండ్ డౌన్‌లో మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ కు దిగాడు. అప్పటికే వళ్లు మండిపోయి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో వేసిన మొదటి బంతికే రిజ్వాన్‌ను అవుట్ చేసే అవకాశాన్ని జాన్సన్ కోల్పోయాడు.

జాన్సన్ వేసిన స్లో బాల్‌‌ను రిజ్వాన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అది ఎడ్జ్ తీసుకుని బాల్ బౌలర్ వైపు వచ్చింది. కానీ క్యాచ్ ని జాన్సన్ అందుకోలేకపోయాడు. దాంతో సహనం కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో ఆ తర్వాతి బంతికి… రిజ్వాన్‌ కి సులువుగా నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో జాన్సన్ మళ్లీ ఎమోషనల్ అయ్యి, రిజ్వాన్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. దీంతో కాక ఎక్కిపోయి ఉన్న రిజ్వాన్ ఊరుకోలేదు. వెంటనే కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. వ్యవహారం శృతి మించుతుండటంతో ఫీల్డ్ లోంచి సౌతాఫ్రికా ప్లేయర్ గెరాల్డ్ కొయెట్జీ గబగబా పరుగెత్తుకు వచ్చాడు. ఇద్దరినీ సముదాయించాడు. దాంతో వారు తమ స్థానాలకు వెళ్లిపోయారు. ఇలా వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Related News

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

×