EPAPER

Chandrababu Letter : భద్రతపై బాబు ఆందోళన.. హత్యకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ..!

Chandrababu Letter :  భద్రతపై బాబు ఆందోళన.. హత్యకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ..!

Chandrababu Letter : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఏసీబీ కోర్టు జడ్జికి లెటర్ రాశారు చంద్రబాబు. జైల్లో తన భద్రతపై అనుమానాలున్నాయని.. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. వామపక్ష భావజాలం ఉన్న ఖైదీలు తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని.. దీని కోసం జైల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. జైలు లోపల పెన్ కెమెరాతో ఒక వ్యక్తి వీడియోలు తీశాడని.. ఆ వ్యక్తి ఎస్.కోటకు చెందిన ఖైదీగా తెలిసిందన్నారు. ఆ వ్యక్తి గంజాయి తరలింపు కేసులో అరెస్ట్ అయి శిక్ష అనుభవిస్తున్నాడని కూడా జడ్జికి తెలిపారు చంద్రబాబు.


ఇక తన కదలికలు తెలుసుకునేందుకు ఓ డ్రోన్‌ జైలుపై చక్కర్లు కొట్టిందని.. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు చంద్రబాబు. జైలులో 750 మంది గంజాయి కేసు ఖైదీలు ఉన్నారని.. వారితో తన భద్రతకు తీవ్ర ముప్పు ఉందన్నారు. ఈ నెల 6న కూడా తన కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఓ డ్రోన్‌ చక్కర్లు కొట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన సెక్యూరిటీని తగ్గించే ప్రయత్నం చేసిందని.. ఇప్పుడు జైల్లో కూడా భద్రత లేదన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా జైల్లోకి వచ్చిన వీడియో ఫుటేజ్ బయటికి విడుదల చేశారన్నారు చంద్రబాబు. పోలీసులే తన ఫోటోలు, వీడియోలు స్వయంగా బయటికి విడుదల చేశారని.. సోషల్ మీడియాలో ఆ వీడియోలు ప్రచారమవుతున్నాయన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించాలని వీడియోలు, ఫోటోలు విడుదల చేశారన్నారు. వెంటనే జైలు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేయాలని.. తనకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కల్పించాలని జడ్జిని కోరారు చంద్రబాబు.


Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×