EPAPER

Bishan Singh Bedi : స్పిన్ దిగ్గజం.. బిషన్ సింగ్ బేడీ ప్రస్థానం సాగిందిలా..?

Bishan Singh Bedi : స్పిన్ దిగ్గజం.. బిషన్ సింగ్ బేడీ ప్రస్థానం సాగిందిలా..?
Bishan Singh Bedi

Bishan Singh Bedi : భారత క్రికెట్ ఎదుగుదలకు బలమైన పునాదులు వేసిన తొలి తరం క్రికెటర్. భారత క్రికెట్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. అయితే ప్రసిద్ధ భారత స్పిన్ చతుష్టయంగా నాడు వెంకట రాఘవన్, ప్రసన్న, చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీలు ఉండేవారు. ఇలాంటి దిగ్గజాలతో కలిసి టీమిండియా స్పిన్ విభాగానికి బలమైన పునాదులు వేశాడు.


1975లో జరిగిన మొదటి ప్రపంచకప్ వన్డేలో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బేడీ తన స్పిన్ మాయాజాలంతో ఆ జట్టు నడ్డివిరిచాడు. తన అత్యుత్తమ గణాంకాలు (12-8-6-1) నమోదు చేసి ఆ జట్టుని 120 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు. అప్పటి నుంచే ప్రపంచకప్ లో ఇండియా పేరు మార్మోగేలా చేశాడు. అలా వాళ్లు వేసిన పునాదులపై 1983కి వచ్చేసరికి కపిల్ దేవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించి సగౌర్వంగా స్వదేశానికి వచ్చింది. భారత క్రికెట్ కి ఊపిరిపోసింది.

బిషన్ సింగ్ బేడీ ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్. 1966 నుంచి 1979 వరకు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. మొత్తం 67 టెస్టులు ఆడి 266 వికెట్లు పడగొట్టాడు. 22 టెస్టు మ్యాచ్‌లలో జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీశాడు.


స్పిన్ బౌలింగ్ ఎలా ఉండాలనే విషయంలో విప్లవాత్మకమైన మార్పులను ఆధునిక క్రికెట్ లోకి తీసుకువచ్చిన ప్రముఖుల్లో తను కూడా ఒకరని చెప్పాలి. నాడు బేడీ నేర్పిన మెళకువలే.. నేటి యువతరానికి మార్గదర్శకంగా ఉన్నాయని సీనియర్లు అంటున్నారు. అలా భారతీయ క్రికెట్ కు బిషన్ సింగ్ బేడీ అందించిన సేవలు చిరస్మరణీయం అని చెప్పాలి.

లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, లెగ్ బ్రేక్, ఆఫ్ బ్రేక్, స్లో మీడియం స్పిన్ ఇలా ఎన్నో రకాల నామకరణాలు చేసిన వారిలో ఒకరిగా ఉన్నాడు. ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ కి బిషన్ సింగ్ బేడీ పెట్టింది పేరని చెప్పాలి. అది తన ట్రేడ్ మార్క్ అని అందరూ అంటారు.

బిషన్ సింగ్ బేడీ 1976లో పంజాబ్ లోని అమృతసర్ లో జన్మించారు. ఆయన భార్య పేరు అంజు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.  1970లో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారత క్రికెట్ విజయాల్లో బేడీ ముందుండి నడిపించారు. వెనుక ఉండి కూడా తన తోడ్పాటుని అందించారు.

ముఖ్యంలో అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు. దేశవాళీ క్రికెట్ లో కూడా తన మార్క్ చూపించారు. 370 మ్యాచ్ లు ఆడి 1560 వికెట్లు తీసుకున్నారు. అలా ఎంతోమందికి మార్గదర్శకం అయ్యారు. ఎంతోమందికి మెళకువలు కూడా నేర్పించారు. అలా తన శిష్యులు చాలామంది అంతర్జాతీయ క్రికెట్ లో ఆడారు. దేశవాళీ క్రికెట్ లో కూడా రాణించారు. ముఖ్యంగా మణీందర్ సింగ్, మురళీ కార్తీక్ లాంటివాళ్లకు మెంటర్ గా కూడా ఉన్నారు.

1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్ గా కూడా వ్యవహరించారు. జాతీయ సెలక్టర్ గా కూడా ఉన్నారు. 2004లో సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

 ఈరోజు భారత క్రికెట్ ఇంతింతై వటుడింతై ఎదగడంలో బేడీ పాత్ర ఉందనడంలో అతిశయోక్తి లేదు. అయితే క్రికెటర్ మాత్రమే కాదు…స్ట్రయిట్ షూటర్ కూడా.. మైదానంలోపల, బయట కూడా స్ట్రెయిట్ షూటర్ గా అప్పట్లో బేడీ పేరు మార్మోగింది. అయితే తను క్రికెట్ వైపే మొగ్గు చూపాడు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బేడి మృతిపై విచారం వ్యక్తం చేశారు. క్రికెట్ లో ఆయన ప్రతిభావంతుడైన ఆటగాడని అన్నారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి  ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తన స్పిన్ మాయాజాలంతో భారత క్రికెట్ కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించారని కొనియాడారు. బిషన్ సింగ్ బేడీ లాంటి వారు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. బిషన్ సింగ్ బేడీ కుటుంబ సభ్యులు, క్రికెట్ అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, సినిమా హీరో బాలీవుడ్ బాద్ షా, ఇంకా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ఒకవైపు వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా విజయాలతో దూసుకుపోతున్న సమయంలో బిషన్ సింగ్ బేడీ హఠాన్మరణం విషాదమే. అయితే టీమ్ ఇండియా ప్రపంచకప్ ను సాధించి తెస్తే, అదే బేడీకి నిజమైన ఘన నివాళి అని కొందరు పోస్టులు పెడుతున్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×