EPAPER

Samantha Ruth Prabhu : సమంత ఔట్.. రష్మిక ఇన్.. అసలు కారణం అదేనట..

Samantha Ruth Prabhu : సమంత ఔట్.. రష్మిక ఇన్.. అసలు కారణం అదేనట..
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu : టాలీవుడ్ లో సమంతకు గత కొద్ది కాలంగా బ్యాడ్ లక్ వెంటాడుతూ వస్తోంది. వరుస సినిమాలతో స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ దూసుకుపోతున్న సమంత కెరియర్ లో మెల్లిగా వెనక్కి పడిపోతుంది. మొన్నటి వరకు అనారోగ్య కారణంతో సరిగ్గా సినిమాలు దూరమై ఆ తర్వాత ఖుషి మూవీ తో కాస్త ఫామ్ లోకి వచ్చింది అనుకునే టైం కి మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.


ఖుషి తర్వాత చేయాల్సిన సినిమాలు మెల్లిగా చేతులు మారి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతున్నాయి.మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా రోజులు తన కెరీర్ కి దూరంగా ఉన్న సమంత ఆ తరువాత కాస్త పుంజుకున్నట్టే కనిపించింది. బాలీవుడ్ లో, టాలీవుడ్ లో సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీ అయిపోతుంది అనుకున్న నేపథ్యంలో తిరిగి మళ్లీ ఆఫర్లు ఒక్కొక్కటి మిస్ అయిపోతున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో మంచి ఛాన్స్ సమంతకి మిస్ అయినట్లు తెలుస్తోంది.

పోనీ అది కూడా తెలియని వారైతే అనుకోవచ్చు.. సమంత బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో సమంత ఆఫర్ వేరే హీరోయిన్ చేతికి వెళ్లిపోయింది. అయ్యో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మరి ఇలా ఎలా జరిగింది అనుకుంటున్నారా. అదిగో అక్కడికే వస్తున్నా.. కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి సమంతా చిన్మయి మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకు మంచి ఫ్రెండ్ అయ్యాడు.


రవీంద్రన్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ కోసం రష్మిక మందన్నని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. నిజానికి ఈ మూవీ సమంత చేయాల్సింది. చిన్మయి ,రాహుల్ ఇద్దరు కూడా ఈ మూవీ కోసం హీరోయిన్ గా సమంత అయితేనే బాగుంటుంది అని భావించారట. కానీ ప్రస్తుతం సమంత హెల్త్ ఇష్యూస్ కారణంగా ఈ ఆఫర్ సమంతను కాదని రష్మికకు ఇవ్వడం జరిగింది. ఈ మూవీ కోసం సమంతనే తీసుకోవాలి అని రాహుల్ అనుకున్నప్పటికీ నిర్మాతలు మాత్రం సమంత కోసం వెయిట్ చేసే ఓపిక లేదు అని క్లారిటీ ఇచ్చారట.

ఖుషి మూవీ కోసం ఇటు విజయ్ దేవరకొండ అటు డైరెక్టర్ సమంత అవైలబుల్ గా లేదని చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇన్ డైరెక్ట్ గా దాని ఫలితం చిత్రం సక్సెస్ పై పడింది అని కొందరి భావన. అనుకున్న టైం కి మూవీ కంప్లీట్ చేసి విడుదల చేసి ఉంటే ఇంకా మంచి టాక్ వచ్చేదేమో. మరోపక్క ఈ ఆఫర్ ని అందిపుచ్చుకున్న రష్మిక మాత్రం తెగ హ్యాపీగా ఫీల్ అవుతోంది.

ఛలో మూవీ తో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఈ భామ కు పుష్ప తర్వాత ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ గత కొద్ది కాలంగా కాస్త క్రేజ్ తగ్గినా.. తిరిగి మళ్లీ మెల్లిగా ఫామ్ లోకి వచ్చేస్తోంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ లో చేస్తోంది. మరోపక్క అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పుష్ప 2 లో కూడా చేస్తోంది. ఇక వీటితోపాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ మూవీ కూడా రష్మిక చేస్తోంది. ఇప్పుడు వీటితోపాటుగా సమంత ప్లేస్ లో అందిపుచ్చుకున్న మూవీ ఉండనే ఉంది. రాహుల్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్ లో హీరోయిన్ రష్మిక అన్న విషయం కన్ఫర్మ్ అయ్యింది అయితే ఇంకా హీరో ఎవరు అన్న డీటెయిల్స్ తెలియాలి.

Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×