EPAPER

Shubman Gill Record : వేగంగా 2 వేల రన్స్.. గిల్ ఖాతాలో మరో రికార్డు ..

Shubman Gill Record : వేగంగా 2 వేల రన్స్.. గిల్ ఖాతాలో మరో రికార్డు ..
Shubman Gill

Shubman Gill Record : టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకుపోతోంది. ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ మన ఆటగాళ్లు చరిత్రను తిరగరాస్తున్నారు. పాతవాళ్లకి రికార్డులు అలవాటుగా మారిపోతే కొత్త తరం భవిష్యత్ క్రికెటర్ అయిన శుభ్ మన్ గిల్ కూడా సరికొత్త రికార్డు సృష్టించాడు.


మొత్తానికి శుభ్ మన గిల్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. 38 ఇన్నింగ్స్ లో గిల్ 2000 పరుగులు సాధించడం విశేషం. ఇది ఒకరకంగా స్పీడ్ రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ ముహూర్తాన జట్టులోకి వచ్చాడో తెలీదు కానీ మంచి ఫామ్ తో వచ్చాడు. ఆ పిచ్ ఈ పిచ్ అని లేదు, ఆ ఊరు ఈ ఊరని లేదు. టెస్ట్, వన్డే, టీ 20 ఏ ఫార్మాట్ లోనైనా అందరినీ ఒక ఉతుకు ఉతికి వదిలేస్తున్నాడు.

ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ 2023లో అప్రతిహిత విజయాలతో ఇండియా దూసుకుపోతోంది. ఈనేపధ్యంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 24 ఏళ్ల శుభ్ మన్ గిల్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చేసినవి తక్కువ పరుగులే అయినా..అవి గిల్ కి ఒక సరికొత్త రికార్డ్ ను తీసుకొచ్చాయి. మొన్నటి వరకు 2000 పరుగుల మైలు రాయిని అందుకోవడానికి 14 పరుగుల దూరంలో ఉండిపోయాడు. అయితే బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ చేసిన తర్వాత రికార్డ్ వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ మనవాడు సిక్స్ కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అంతా అయ్యో అనుకున్నారు. లేదంటే 37 ఇన్నింగ్స్ లోనే పూర్తి చేసేసేవాడని అంతా అనుకున్నారు.

ఇంతవరకు ఈ రికార్డ్ దక్షిణాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. అతను 40 ఇన్నింగ్స్ లో 2000 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డ్ చెరిగిపోయింది. గిల్ పేరు టాప్ లోకి వచ్చింది. తను రెండోస్థానంలోకి పడిపోయాడు. వీరి తర్వాత స్థానాల్లో పాకిస్తాన్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ (45), ఇంగ్లండ్ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ (45) ఉన్నారు. గిల్ తర్వాత భారత్ లో చూస్తే శిఖర్ ధావన్ ఉన్నాడు. తను 49 ఇన్నింగ్స్ లో 2000 పరుగులు పూర్తి చేశాడు.


Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×