EPAPER

India Vs New Zealand : షమీ, కోహ్లి అదుర్స్.. కివీస్ పై గ్రాండ్ విక్టరీ.. టాప్ లో టీమిండియా..

India Vs New Zealand :  షమీ, కోహ్లి అదుర్స్.. కివీస్ పై గ్రాండ్ విక్టరీ.. టాప్ లో టీమిండియా..

India Vs New Zealand : మొదటి వికెట్ పడింది.. ఓపెనర్లు అయిపోయారు. ఈ బౌలర్ వస్తాడు. ఆ బౌలర్ వస్తాడు. వాడు అవుట్ అయిపోయాడు. వీడు అవుట్ అయిపోయాడని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ అన్న కొహ్లీ ఉన్నాడు. అడ్డంగా నిలబడిపోతాడు. ఇలా నెట్టింట త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు పేలిపోతున్నాయి. అల వైకుంఠాపురం సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన స్టయిల్ లో నెట్టింట ఓ రేంజ్ లో డైలాగ్స్ మోత మోగుతున్నాయి.


వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ధర్మశాల స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. 274 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన ఇండియా 71 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. అప్పుడొచ్చాడు అన్న  కోహ్లి 11.1 ఓవర్ లో క్రీజులో అడుగుపెట్టిన ఛేజింగ్ హీరో కోహ్లి 47.4 ఓవర్ వరకు వికెట్లకు అడ్డంగా నిలబడిపోయాడు. 95 పరుగులు చేసి ఇండియాకు ఘన విజయం అందించాడు.

ఒకదశలో 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును జడేజా సాయంతో విజయతీరాలకు చేర్చిన మొనగాడు కోహ్లి. కళ్ల ముందే ఒకొక్క వికెట్ పడుతుంటే మొక్కవోని ధైర్యంతో ఒక ఎండ్ లో నిలబడి మ్యాచ్ ను గెలిపించిన తీరు నేటి యువతకు ఆదర్శం అని చెప్పాలి.


ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన కివీస్ ఓపెనర్లు త్వరత్వరగానే అవుట్ అయిపోయారు. 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసిన కివీస్ కష్టాల్లో పడినట్టే కనిపించింది. కానీ తర్వాత వచ్చిన మిచెల్, రచిన్ రవీంద్ర పాతుకుపోయారు. అయితే రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్ ను జడ్డూ జారవిడిచాడు. అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న జడేజా నుంచి బాల్ జారిపోవడమా అనుకున్నారు. కానీ అలా జరిగిపోయింది. అయితే బతికి బయటపడ్డ రచిన్ రవీంద్ర 75 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు.

అయితే అందరికీ పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ గుర్తొచ్చింది. ఇలాగే డేవిడ్ వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాపానికి ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకుంది. తర్వాత డేవిడ్ భాయ్ చితక్కొట్టి చింతకాయ పచ్చడి పెట్టేశాడు. 124 బాల్స్ లో 163 పరుగులు చేసేశాడు. మళ్లీ అలాంటి ప్రమాదం ఏమైనా ఎదురవుతుందేమోనని ఇండియన్స్ కంగారు పడ్డారు. రచిన్ రవీంద్ర అవుట్ అయ్యేవరకు అందరినీ ఆ శంక పీడిస్తూనే ఉంది. అవుట్ అయ్యాక… హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

అయితే డారిల్ మిచెల్ 130 పరుగులు చేసి కివీస్ కి వెన్నుముకలా నిలిచాడు. అయితే మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో 300 పరుగులు దాటుతుందనుకున్న కివీస్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే కివీస్ నడ్డి విరిచింది మాత్రం…ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ… తను లేట్ గా వచ్చినా లేటెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. 8వ ఓవర్ లో బాల్ అందుకున్న షమీ తను వేసిన మొదటి బాల్ కే యంగ్ వికెట్ తీశాడు. తర్వాత తన ఓవర్ లోనే జడ్డూ క్యాచ్ జారవిడిచాడు. గ్లెన్ ఫిలిప్స్ (23), విల్ యంగ్ (17), కాన్వే (0), టామ్ (15), చాప్ మన్ (6), శాంటర్న్ (1), హెన్రీ (0), ఫెర్గూసన్ (1) అందరూ కూడా లైనులో పెట్టిన సైకిళ్లు మాదిరిగా ఒకదాని వెనుక ఒకటి పడినట్టు పడిపోయారు.

అయితే చివర్లో టపటపా నాలుగు వికెట్లు తీసి.. కివీస్ స్కోరును 300 దాటించకుండా చేసింది మాత్రం మహహ్మద్ షమీ అని చెప్పాలి. జట్టుకు తనెంత విలువైన బౌలర్ అన్నది చూపించాడు. లేదంటే మనోళ్లకి గెలుపు కొంచెం కష్టమయ్యేదనే చెప్పాలి.

274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు  ఓపెనర్లు రోహిత్ శర్మ (46), గిల్ (26) ఇద్దరూ బ్రహ్మాండమైన శుభారంభం ఇచ్చారు. 71 పరుగుల వద్ద తొలి వికెట్ రోహిత్ శర్మ రూపంలో పడింది. ఫస్ట్ డౌన్ లో కోహ్లి వచ్చి జాగ్రత్తగా ఆడటం మొదలు పెట్టాడు. తన ముందే గిల్, తర్వాత శ్రేయస్ అయ్యర్ (33), కేఎల్ రాహుల్ (27), సూర్యకుమార్ యాదవ్ (2) వీళ్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు.

 కోహ్లి ఒక్కడు అటువైపు నిలబడి జడేజా అండతో మ్యాచ్ ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. 95 పరుగుల వద్ద ఒక సిక్స్ కొట్టి అటు సెంచరీ, ఇటు విన్నింగ్ షాట్ కలిపి కొడదామని అనుకున్నాడు. కానీ లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చాడు. నిరాశగా వెనుతిరిగాడు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే మాస్టర్ సచిన్ సరసన 49 సెంచరీలతో నిలిచి ఉండేవాడు. అయితే గత మ్యాచ్ లాగే ఆడేవాడేగానీ, ఇక్కడ బాల్స్ తక్కువగా ఉన్నాయి. అదొక టెన్షన్. దీంతె రిస్కీ షాట్ కొట్టి అవుట్ అయ్యాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.  అవసరమైనప్పుడు సెంచరీ కోసం కాదు, జట్టు కోసమే ఆడతానని చెప్పి అందరి నోళ్లూ మూయించాడని మరికొందరు అంటున్నారు.

ఏదేమైతేనేం ఇండియా విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్లింది. అని అంతా సంతోషంతో ఉన్నారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×