EPAPER

Surya Injured: హార్ధిక్ పాండ్యా మ్యాచ్ కు దూరం.. సూర్య కుమార్ యాదవ్ కు గాయం..

Surya Injured:  హార్ధిక్ పాండ్యా మ్యాచ్ కు దూరం..  సూర్య కుమార్ యాదవ్ కు గాయం..

Surya Injured: వన్డే వరల్డ్ కప్ 2023లో జరగబోయే రెండు సమఉజ్జీల మధ్య మ్యాచ్ లో ఇండియా జట్టుకి గాయాల బెడద ఎక్కువైంది. ఇప్పటికే ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా జట్టుకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్లేస్ లో స్ట్రోక్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పనికి వస్తాడని అంతా అనుకున్నారు. అయితే మనోడ్ ధర్మశాలలో జరుగుతున్న నెట్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దాంతో అతను ఆడేది అనుమానంగానే ఉంది.


న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో ప్రస్తుతం రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. చెరో ఎనిమిది పాయింట్లతో దూసుకుపోతున్నాయి. గంభీరమైన హిమాలయ పర్వత శ్రేణుల మధ్య కొలువుదీరిన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పుడీ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో వాళ్లు టేబుల్ టాపర్ అవుతారు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే హార్దిక్ పాండ్యా ప్లేస్ లో రీప్లేస్ చేయడానికి రిజర్వ్ బెంచ్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ని అనుకున్నారు. కాని తను నెట్ ప్రాక్టీసులో చేతిమణికట్టుకి బాల్ తగలడంతో విలవిల్లాడుతూ బయటకి వెళ్లాడు. అయితే గాయంపై జట్టు మేనేజ్మెంట్ ఏమీ మాట్లాడటం లేదు. రెండోది ఇషాన్ కిషన్ కూడా గాయాలతో బాధపడుతున్నాడని అంటున్నారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఇదేంటి ఇలా అవుతోందని కలవరపడుతున్నారు. శార్ధూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో అతని ప్లేస్ లో షమీని తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే అశ్విన్ సలహాలు జట్టుకి ఉపయోగపడుతున్నాయి. బంగ్లాదేశ్ మ్యాచ్ లో రోహిత్ కి చెప్పిన చిట్కా పనిచేసి తొలివికెట్ లభించి బ్రేక్ దొరికింది.

ఎందుకంటే తనున సీనియర్ క్రికెటర్ కావడం, అశ్విన్ లో నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. తన వయసు రీత్యా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కూడా కావచ్చు. అందువల్ల అతనికి అవకాశం ఇవ్వచ్చునని అంటున్నారు. అశ్విన్ బ్యాటింగ్ లో కూడా రాణిస్తాడు. పాకిస్తాన్ పై ఆసియా కప్ లో కొహ్లీ ఆడిన చిరస్మరణీయమైన మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టింది అశ్విన్ కావడం విశేషం. అయితే చివరికి జట్టులో ఎవరుంటారు? ఎవరు వెళతారనేది ఇంకా తెలీదు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×