EPAPER

Movie Critic: అతని మానసిక స్థితి అలా ఉంది.. ఆ రివ్యూపై అనిల్ రావిపూడి కామెంట్స్..

Movie Critic:  అతని మానసిక స్థితి అలా ఉంది.. ఆ రివ్యూపై అనిల్ రావిపూడి కామెంట్స్..

Movie Critic: దసరాకి బరిలో దిగిన బాలయ్య మూవీ భగవంత్ కేసరి. అమ్మాయిలకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఎంతో ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఒక రివ్యూర్ రాసిన రాతలపై అనిల్ రావిపూడి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి బాలయ్య లాంటి మాస్ హీరోతో ఎటువంటి అనవసరపు స్టెప్పులు , డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించకుండా అతని వయసుకు తగిన పాత్ర చేయించడంలో అనిల్ రావిపూడి మంచి సక్సెస్ సాధించాడు.


నేటి అమ్మాయిలకు ఒక మంచి మెసేజ్ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎందరో అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తలా తోక లేకుండా ఒక వ్యక్తి రాసిన రాతలు కరెక్ట్ కాదన్నారు. దీన్ని బట్టి అతని మానసిక పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అనిల్ అన్నారు. మామూలుగా సినిమా అంటే హీరో, హీరోయిన్ మధ్య సరదా సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్స్ ఉండాలని అనుకునే రోజులు మారిపోయాయి. కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో సినిమా అంత బలంగా ప్రేక్షకుల ముందుకు వెళుతుందన్నారు.

కాలం మారుతున్నా , అందరి అభిప్రాయాలు మారుతున్నా కొందరి బుద్ధులు మాత్రం మారడం లేదు అనే విషయం ఇటువంటి సందర్భాలలోనే స్పష్టంగా అర్థం అవుతుంది. కథ బాగుంటే చాలు పాటలు లేకపోయినా, హీరోయిన్ గ్లామర్ ప్రదర్శించకపోయినా సినీప్రియులు ఇష్టపడి సినిమాను చూస్తున్నారు. అసలు చాలామంది ఈ కాలంలో ఇటువంటి సాగదీత లేని సినిమాలే బాగున్నాయంటున్నారు. అనవసరమైన ప్రేమ కథలు, అక్కరలేని పాటల పైన దృష్టిపెట్టకుండా కాన్సెప్ట్ పైనే ఫోకసం చేయడం మంచిది అని భావించి డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన ఒక అద్భుతమైన మూవీ భగవంత్ కేసరి.


బాలకృష్ణ లాంటి మాస్ హీరోను కాజల్ , శ్రీలీల లాంటి హాట్ ముద్దు బొమ్మలను హీరోయిన్లుగా పెట్టుకున్నప్పటికీ తాను రాసుకున్న స్క్రిప్ట్ నుంచి ఒక్క గీత కూడా అటు ఇటు దాటకుండా ఎంతో బ్యాలెన్స్డ్ గా సినిమాలో ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ , డ్యూయెట్లు లేకుండా అనిల్ ఈ మూవీను తీశాడు. కేవలం చిత్రంలో ఉన్న ఎలిమెంట్స్ అలాగే ఎమోషన్స్ పైన పూర్తిగా కాన్సెంట్రేట్ చేయడం జరిగింది. అందుకే మూవీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

ఈ సినిమా గురించి పలువురు ఎంతో గొప్పగా రాస్తుంటే ఒక క్రిటిక్ మాత్రం రాసిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ సక్సెస్ ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నెట్ లో ఒక వ్యక్తి రాసిన నెగటివ్ రివ్యూ గురించి జర్నలిస్ట్ ప్రస్తావించగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫైర్ అయ్యారు.

బహుశా ఇది రాసిన వ్యక్తి శ్రీలీల ఫ్యాన్ అయి ఉంటాడు. స్త్రీల డాన్స్ చూడాలి అనుకున్నాడే తప్ప ఆ మూవీలో ఒక తండ్రి కూతురికి మధ్య ఉన్న అనుబంధం, ఫోబియాతో బాధపడుతున్న ఒక ఆడపిల్ల, ఆమెను ఒక షేర్‌లా పెంచాలనుకున్న ఆ తండ్రి తపన ఇవేమీ కనిపించలేదు. అందుకే ఈ మూవీ లో శ్రీలీల పాత్రను డాన్సులు, పాటల్లో చూడాలనుకున్నట్టు రాశారు. అతను రాసిన దాన్ని బట్టి అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అయినా అలాంటి వాళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కామెంట్స్ ను చాలామంది బలపరుస్తున్నారు.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×