EPAPER

Namo Bharat : నమోభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని.. ఫీచర్లు ఇవే..

Namo Bharat : నమోభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని.. ఫీచర్లు ఇవే..

Namo Bharat : భారత్ లో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ ను ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లోని సాహిబాబాద్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ- గజియాబాద్- మీరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ను కూడా మోదీ శుక్రవారం ప్రారంభించారు. భారత్ లోనే తొలి ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సర్వీస్(RRTS) ఇదే కావడం విశేషం. ప్రధానితో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పురి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. RRTS ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఆ రైలులో ప్రయాణించి.. స్కూల్ స్టూడెంట్స్, ర్యాపిడ్ ఎక్స్ రైలు సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించారు.


‘నమో భారత్’ ఒక పరివర్తన ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమమని, ఇది ఇంటర్‌సిటీ కమ్యూటింగ్ కోసం హై-స్పీడ్ రైళ్లను అందించడానికి రూపొందించబడిందని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది. కాగా.. నిన్నటి వరకూ RapidX గా ఉన్న ఈ రైలు.. నమో భారత్ గా మార్చబడింది. శనివారం (అక్టోబర్21) నుంచి ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ ల ప్రయాణికులకు నమోభారత్ రైలు అంుబాటులో ఉంటుంది. సాహిబాబాద్ నుంచి మొత్తం 4 స్టేషన్లలో నమోభారత్ రైలు ఆగుతుంది. ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపోలలో రైలు ఆగుతుంది.

గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లే..నమోభారత్ లో.. వందేభారత్ ను మించిన ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 17 కిలోమీటర్ల మేర నమోభారత్ పరుగులు పెట్టనుంది. ఓవర్ హెడ్ స్టోరేజ్, వైఫై, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్లు ఉన్నాయి. విశాలవంతమైన సీటింగ్, విశాలమైన లెగ్ రూమ్, కోట్ హ్యాంగర్లతో కూడిన ప్రీమియం క్లాస్ లు కూడా ఉన్నాయి. రైలు భద్రతా ఫీచర్ల విషయానికొస్తే.. ప్రతికోచ్ లో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్, ఆపరేటర్ తో కమ్యూనికేట్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక బటన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. నిలబడేందుకు కూడా విశాలమైన ప్రదేశాన్ని ఉంచారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ.. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున నమోభారత్ రైళ్లు సేవలందించనున్నాయి.


ప్రతి రైలులో ఆరు కోచ్ లు.. ప్రీమియంలో 62 సీట్లు, సాధారణ కోచ్ లో 72 సీట్లు ఉంటాయి. ఒక ట్రిప్ లో మొత్తం 1700 మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించవచ్చు. అలాగే మహిళల కోసం ఒక కోచ్ ను, దివ్యాంగులు, వృద్ధులకు ప్రతికోచ్ లోనూ ప్రత్యేక సీట్లను కేటాయించారు. సాధారణ కోచ్ టికెట్ ధర రూ.20-50, ప్రీమియం కోచ్ టికెట్ ధర రూ.40-100 మధ్య ఉంటుంది.

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×