Student Success Strategies : క్లాస్‌లో టాపర్ అవ్వాలనుకునే విద్యార్థులు మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలనుకునే యువత చదివే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటివల్ల జీవితంలో ఇబ్బందులను కొన్నితెచ్చుకున్నట్టే అవుతుంది. మరి ఆ తప్పిదాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడదామా?
ప్లానింగ్ ఉండాల్సిందే..
చాలా మంది ఎగ్జామ్స్ సమయం ఆసన్నమయ్యాక చదవడం ప్రారంభిస్తారు. ఇలా మొదట్లో బద్ధకంగా ఉండి చివర్లో చదవడం వల్ల చాలా నష్టపోతారని గుర్తుంచుకోండి. దీనివల్ల అనుకున్న లక్ష్యాలను సాధించలేరు.
ప్లాన్ లేకుండా చదవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కూడా సాధ్యం కాదు. దేనికైనా సరైన ప్లాన్ ఉండాల్సిందే.
చదివింది ఎక్కువ కాలం గుర్తుండాలంటే సరైన పొజిషన్లో కూర్చోవడం చాలా అవసరం. చదివేటప్పుడు టేబుల్, కుర్చీ సహాయం తీసుకోండి.
సెల్ఫ్‌కేర్ తీసుకోవాల్సిందే..
చాలామంది గ్యాప్ లేకుండా గంటల కొద్దీ చదువుతుంటారు. అయితే సగటు మానవుడి మెదడు 3 గంటల కంటే ఎక్కువ సమయం చురుగ్గా పనిచేయదు. అందువల్ల గంట లేదా రెండు గంటలకు ఒకసారి మెదడుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఈ సమయంలో ధ్యానం చేయడం లాంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి.
సరైన ఆహారం లేకుండా, సరైన నిద్ర, విశ్రాంతి లేకుండా, సరైన లైఫ్ స్టైల్ లేకుండా చేసే ఏ పనిలోనూ మనిషి పూర్తిస్థాయిలో ఏకాగ్రత సాధించలేడు. అది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికే ప్రమాదం అనే విషయం మర్చిపోవద్దు.