EPAPER

Ravindra Jadeja and Kl Rahul : జడేజా-రాహుల్ గోల్డ్ మెడల్ ఎవరికి? టెన్షన్‌లో ఫీల్డింగ్ కోచ్.

Ravindra Jadeja and Kl Rahul : జడేజా-రాహుల్ గోల్డ్ మెడల్  ఎవరికి?  టెన్షన్‌లో ఫీల్డింగ్ కోచ్.
Ravindra Jadeja and Kl Rahul

Ravindra Jadeja and Kl Rahul : అద్భుతమైన క్యాచ్ పట్టి..స్టేడియాన్ని అల్లాడించిన రవీంద్ర జడేజా ఒకవైపు అయితే, ఒలింపిక్స్ లో అథ్లెట్ లా విల్లులా వంగి కీపర్ క్యాచ్ అందుకున్న రాహుల్ మరోవైపు నిలిచారు. కాకపోతే ఈసారి గోల్డ్ మెడల్ నాకే అంటూ జడ్డూ చేసిన సైగలకు స్టేడియం కూడా మద్దతు పలకడం విశేషం.


వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డ్ బయట కొన్ని విశేషాలు జరిగితే, గ్రౌండ్ లో అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు కనువిందు చేశాయి. ముఖ్యంగా మన ఇండియన్ ఫీల్డర్లు ఈ మధ్య కాలంలో ఇంత గొప్పగా ఫీల్డింగ్ చేయడం ఈ మ్యాచ్ లోనే కనిపించింది. అయితే ఒకట్రెండు మెరుపులు ఉంటాయి కానీ, మొత్తం జట్టు సభ్యులంతా కూడా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోకూడదనే కసితోనే ఆడినట్టుగా కనిపించింది.

ఈ ప్రక్రియలో ఫీల్డింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు కూడా..ముఖ్యంగా బౌండరీ లైన్ల దగ్గర మనవాళ్లు ఫోర్లు ఆపిన తీరు చాలా గొప్పగా అనిపించింది. ఒక 20 నుంచి 30 పరుగులు ఫీల్డింగ్ ద్వారా ఆపగలిగారని చెప్పాలి. ఇకపోతే ఇంత చెప్పుకున్నాక మ్యాచ్ లో రెండు అద్భుతమైన క్యాచ్ లు చెప్పకపోతే..అసంపూర్తిగా ఉంటుంది. అవి రెండూ కూడా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఇద్దరూ పట్టారు. రెంటికి రెండు కూడా మంచి క్యాచ్ లే అని చెప్పాలి.


అప్పుడు 43వ ఓవర్ నడుస్తోంది. అప్పటికి ముష్ఫికర్ రహీమ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫ్రంట్ పుట్ కి వచ్చి మరీ ఎడాపెడా కొట్టేస్తున్నాడు. ఈ టైమ్ లో బూమ్రా బౌలింగ్ కి వచ్చాడు. తను వేసిన బాల్ ని ముష్ఫికర్ ఆఫ్ సైడ్ వైపు ఆడాడు. పాయింట్ దగ్గర కాచుకుని కూర్చున్న జడేజా కళ్లు మూసి తెరిచేలోగా కుడివైపు ఒక్క డైవ్ చేశాడు. నీటిలో చేపను పట్టినట్టు ఛపక్ మని పట్టేసి..బొంగరంలా తిరుగుతూ కింద పడ్డాడు. అంతే లేచిన వెంటనే స్టేడియం అంతా హోరెత్తిపోయింది. ఈ క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. అంతేకాదు ఈసారి గోల్డ్ మెడల్ నాదే అంటూ జడ్డూ చేసిన సైగలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ చెప్పుకోతగ్గ మరో క్యాచ్ ఏమిటంటే కేఎల్ రాహుల్ పట్టింది.
మెహదీ హాసన్ మిరాజ్ శరీరాన్ని తాకేలా మహ్మద్ సిరాజ్ బంతిని సంధించాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ కీపర్ వైపు వెళ్లింది. వెంటనే రాహుల్ అలర్ట్ అయ్యాడు. ఎడమవైపునకు జెట్ స్పీడ్ తో డైవ్ చేసి క్యాచ్ పట్టీసుకున్నాడు. తను 0.78 సెకన్లలో రియాక్ట్ అయిన తీరుతో స్టేడియం హోరెత్తిపోయింది.

మొత్తానికి ఇండియా టీమ్ మాత్రం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పక్కా ప్రొఫెషనల్ గా ఆడి జయహో అనిపించారు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×