EPAPER

‘Leo’ Movie Review: థియేటర్లలో లియో సందడి.. మూవీ ఎలా ఉందో తెలుసా?

‘Leo’ Movie Review: థియేటర్లలో లియో సందడి.. మూవీ ఎలా ఉందో తెలుసా?

‘Leo’ Movie Review: కోలీవుడ్‌ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబో లో తెరకెక్కిన మూవీ లియో. ఎన్నో వివాదాల నడుమ ఎట్టకేలకు అనుకున్న సమయానికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ చిత్రం భారీ క్రేజ్ తో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు 35 దేశాలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వడం విశేషం. మొత్తానికి 12000 స్క్రీన్ ల పై ఈ మూవీ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం..


మూవీ: లియో

దర్శకత్వం :లోకేష్ కనగరాజ్


నిర్మాణం:S. S. లలిత్ కుమార్,జగదీష్ పళనిసామి

రచన: లోకేష్ కనగరాజ్ ,రత్న కుమార్ ,దీరజ్ వైద్య

తారాగణం : విజయ్,త్రిష,సంజయ్ దత్,అర్జున్

సంగీతం:అనిరుధ్ రవిచందర్

ఛాయాగ్రహణం:మనోజ్ పరమహంస

విడుదల తేదీ:2023 అక్టోబరు 19

కథ :

పార్తిబన్ (విజయ్) తన భార్య సత్య ( త్రిష)కొడుకు కూతురుతో కలిసి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. అతనికి అక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఎంతో సంతోషంగా ప్రశాంతంగా సాగుతున్న ఆ కుటుంబం అనుకోకుండా ఓ సంఘటన కారణంగా చిక్కుల్లో పడుతుంది. ఇంతకీ వాళ్లను ఇరకాటంలో పెట్టిన ఆ పరిస్థితి ఏమిటి?పార్తిబన్ కు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ (అర్జున్) కు మధ్య ఏం జరిగింది? అసలు పార్తిబన్ కు లియోకు సంబంధమేమిటి? లియో ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో లియో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. కొన్ని రోజులు ఈ చిత్రం లోకేష్ సృష్టించిన మల్టీవర్స్ లో భాగమని ప్రచారం జరిగింది. కొన్ని సందర్భాలలో కాదు ఇది స్టాండ్ అలాన్ మూవీ అని అన్నారు. అయితే ముందు నుంచి అనుకున్నట్టు ఈ చిత్రం లోకివెర్స్ లో భాగమే అని తేలిపోయింది.. నిజానికి మూవీ ఎలా ఉంది అంటే సినిమా స్టార్టింగ్ లో వెళ్లినా ,మిడిల్ లో వెళ్లినా,స్టోరీ తెలుసుకొని వెళ్ళినా సరే చివరికి సినిమా ఏ రూట్ లో వెళ్తుందో క్లియర్ గా అర్థమైపోతుంది.

ఒకే ఒక స్టోరీ లైన్ తీసుకొని దానిపై మొత్తం సినిమాని నడిపించేసారు.. అయితే సినిమాలో ఫస్ట్ పది నిమిషాలు అస్సలు మిస్ కాకూడదు అని ఒక ఇంటర్వ్యూలో లోకేష్ చెప్పారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో గ్రిప్పింగా నడవడమే కాకుండా నెక్స్ట్ ఏమవుతుందో ఊహించగలిగినా సీట్ లో నుంచి కదలకుండా చివరి వరకు కూర్చోపెడుతుంది. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్ గా ,ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇంక మూవీలో పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఎవరికి వారు తమ పాత్రల్లో జీవించేశారు.

ఇక ఈ మూవీలో ఎప్పటిలాగే హీరో విజయ్ పర్ఫామెన్స్ ఇరగదీసాడు. అయితే గత కొద్ది కాలంగా తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఇచ్చే విజయ్ ఈసారి దానికి భిన్నంగా కనిపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. త్రిష పాత్ర చిన్నది అయినా తన పరిధిలో తాను ఎక్స్ల్లెంట్ గా నటించింది. ఫస్ట్ హాఫ్ పూర్తయ్య సమయానికి వచ్చే అర్జున్ పాత్ర బాగుంది. ఇక మ్యూజిక్ పరంగా ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్న అనిరుద్ ఈ చిత్రంలో కూడా ఎక్స్ట్రార్డినరీ పర్ఫామెన్స్ ఇచ్చాడు.

ప్రతి పాత్రకి డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రొవైడ్ చేయడమే కాకుండా పాటల్లో కూడా మెలోడీ రాగాలు పలికించాడు. నా రెడీ సాంగ్ థియేటర్లలో పండుగ వాతావరణం క్రియేట్ చేసింది. ఫుల్ స్వింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగే ఈ మూవీ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది.లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ సినిమాలకి ఈ మూవీకి సంబంధం ఉండడంతో కొన్ని కామన్ పాత్రలు ఇందులో కూడా కనిపించాయి.

కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో ఎమోషన్స్ కథకు కాస్త కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎంతో బాగా తెరకెక్కించిన చిత్రంలో ఈ చిన్ని కాన్సెప్ట్ విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు అర్థం కాదు. తెలుగులో పాటల విషయానికి వస్తే డబ్బింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. తమిళ్ కి తెలుగు కి పోల్చి చూస్తే పాటల విషయంలో ఎంతో డిఫరెన్స్ కనిపిస్తుంది.. ఎందుకంటే ఇందులో తెలుగు నేటివిటీ కాస్త మిస్ అయింది కాబట్టి.

ప్లస్ పాయింట్స్:

+ హీరో, నటీనటుల యాక్టింగ్

+ అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్

+ యాక్షన్ సన్నివేశాలు

+సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

– రొటీన్ స్టోరీ

– ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్స్

– చిరాకు తెప్పించే పాటలు

– సెకండాఫ్ లో సన్నివేశాలు

చివరిగా.. యాక్షన్ మూవీ లవర్స్ కు లియో ఫీస్ట్ కన్ఫర్మ్

Related News

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

NTR 31 : హీరో లేకుండానే “ఎన్టీఆర్31” షూట్… ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టేదెప్పుడంటే?

Allu Arjun : ఆ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకుంది… తర్వాత బన్నీ బతిమలాడి తీసుకొచ్చాడు.

NTR: చచ్చిపోతానేమో అనుకున్నా.. ఛీఛీ.. నా మీద నాకే చిరాకేసింది..

Big Stories

×