EPAPER

Bharatmala Pariyojana : ఇలా అయితే మన హైవేలు ఎప్పటికి పూర్తవుతాయి?.. భారతమాల ఆలస్యానికి కారణాలివేనా..?

Bharatmala Pariyojana : ఇలా అయితే మన హైవేలు ఎప్పటికి పూర్తవుతాయి?.. భారతమాల ఆలస్యానికి కారణాలివేనా..?

Bharatmala Pariyojana : 31 జులై,2015 భారత ప్రభుత్వం భారతమాల పేరుతో రహదారుల ప్రాజెక్టును ప్రారంభింస్తున్నట్లు ప్రకటన చేసింది. రోడ్లు,రహదారులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న రోజులవి. అవే రవాణా సవాళ్లు, హైవేల రద్దీ, టైర్-2,టైర్-3 నగరాల అభివృద్ధి చెందకపోవడం. పార్లమెంట్‌లో రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి,నితిన్ గడ్కరీ భారతమాల ప్రాజెక్ట్ ప్రకటన చేసినప్పుడు, ఈ సవాళ్లపై ప్రజలు ఆశావాద చిత్రాన్ని నిర్మించుకున్నారు. అసలు రవాణా సవాళ్లను ఎలా పరిష్కరించొచ్చు, మన రహదారులలో రద్దీ ఎలా తగ్గుతుంది. రహదారుల అనుసంధానం ద్వారా టైర్-2, టైర్-3 నగరాలు ఎలా అభివృద్ధి అవుతాయి అనేది ప్రశ్నగానే ఉండిపోయింది.


భారతదేశ అభివృద్ధిని ప్రభావితం చేసే రవాణా సవాళ్లు మనందరికీ తెలుసు. దాన్ని అధిగమించాలంటే భారతదేశానికి భారతమాల ప్రాజెక్ట్ చాలా కీలకమైనది.కానీ, 2022లో పూర్తి చెయ్యాల్సిన ఈ ప్రాజెక్ట్ 2028కి, అంటే 6 సంవత్సరాలు పొడిగించారు. ఈ జాప్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం 5.35 లక్షల కోట్ల నుండి 10.63 లక్షల కోట్లకి పెరిగింది, అంటే దాదాపు 100 శాతం ఖర్చు పెరిగింది. ఈ పెరిగిన వ్యయం రిలయన్స్ పరిశ్రమల లాభానికి ఏడు రెట్లు, టాటా పరిశ్రమల లాభానికి 19 రెట్లు, 2022 రక్షణ బడ్జెట‌్‌కి సమానం.

ఈ డబ్బు అంతా మన వంటి పన్ను చెల్లించే పౌరులు చెల్లిస్తున్నారని తెల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అందరిలో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంత ఖరీదైన రహదారిని ప్రభుత్వం ఎందుకు నిర్మిస్తుంది, పెరిగిన 5 లక్షల కోట్ల వ్యయంతో భారతమాల ప్రాజెక్ట్ ఎలా సాధ్యమవుతుంది, పన్ను చెల్లించే పౌరుడిగా మనం ఈ ప్రాజెక్టుల గురించి ఎందుకు పట్టించుకోవాలి?


భారతదేశంలో అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భారతమాల ఒకటి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లాంటి గొప్ప ప్రాజెక్ట్‌ ఉన్నప్పటికీ కూడా, రహదారులు అనుకున్న స్తాయిలో అభివృద్ధి చెందలేదు. భారతదేశంలో రహదారుల వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు చూస్కుంటే, ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో జాతీయ రహదారులు,ఒకే వరుసని కలిగి ఉన్నాయి. రహదారుల లేన్ పరిమాణం సక్రమంగా లేదు.మన రహదారుల వ్యవస్థ, భవిష్యత్తు, ఆర్థిక దృక్పథంతో సరైన ప్రణాళిక చేయలేదు.ఉదాహరణకు, మన ఓడరేవులు, కారిడార్లు అంతర్ ప్రాంతాలకు సరిగ్గా అనుసంధానించలేదు, అది వాణిజ్యాన్ని అసమర్థంగా చేసింది;చివరకు జాతీయ రహదారులు, స్థానిక నగర ట్రాఫిక్ రెండూ కలిసిపోయే చోట బహుళ రద్దీ పాయింట్లు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం 191 అలాంటి రద్దీ పాయింట్లు, రద్దీ వేళలలో అడ్డంకిగా మారి ఆలస్యానికి, ప్రమాదాలకు హబ్‌గా మారుతున్నాయి . ప్రభుత్వానికి భారతమాల ప్రాజెక్ట్ ఆలోచన రావడానికి ఇవే కారణాలు.

ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జాతీయ కారిడార్లు లేన్ విస్తరణ, రద్దీని తగ్గించడం కోసం 26000 km ఆర్థిక కారిడార్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ తో ప్రభుత్వం మూడు ముఖ్యమైన అంశాలను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. మొదటగా జాతీయ రహదారులపై వాహన వేగాన్ని 25% పెంచాలని , రెండవది సప్లై-చైన్ ఖర్చు ప్రస్తుత సగటు 18% నుండి 6% కి తగ్గించాలని, మూడవది భారతదేశంలో లాజిస్టికల్ వ్యవస్థలను మెరుగుపరచడానికి, బహుళ మోడల్ లాజిస్టికల్ పార్కులను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ భారతమాల ప్రాజెక్ట్ లోతైన ఇబ్బందుల్లో ఉంది. ప్రాజెక్టు వ్యయం 5 లక్షల కోట్ల పెరుగుదలకు కారణాలేంటో తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా భూసేకరణ ఖర్చు గురించి తెలుసుకుంటే భూమి యజమానుల నుండి పెద్ద మొత్తంలో భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. భూమి యజమానులను ఒప్పించాలి, వారితో చర్చలు జరపాలి, ప్రజలకు పునరావాసం కల్పించాలి భూమి కోల్పోయినవారికి పునరావాసం ఏర్పాటు చేయడానికి అనేక ఇతర లాంఛనాలు చేయాలి. భూసేకరణ అనేది సుదీర్ఘ ప్రక్రియ. దీనికే ఇంత సమయం పడితే, ఇక మొత్తం ప్రాజెక్ట్‌ కోసం ఎంత సమయం పడుతుందో ఆలోచించండి.ఈ సమయ వ్యవధిలో భూమి ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి భూసేకరణ ఖర్చులు కూడా పెరుగుతాయి.నిజానికి భారతమాల ప్రాజెక్ట్ భూసేకరణ బడ్జెట్ 30,000 కోట్లు, అయితే ప్రస్తుతం దాని వ్యయం 5 రెట్లు పెరిగింది.

రెండవది, సాధారణ ద్రవ్యోల్బణం కారణంగా ఇన్‌పుట్ మెటీరియల్స్ ధర పెరిగింది.. 2015 నుండి 2023 వరకు ద్రవ్యోల్బణం రేటు గణన చేస్తే అది 45%. అంటే 2015లో 1 km నిర్మాణ వ్యయం 10 కోట్లు అయితే 2023లో అదే ఖర్చు 15 కోట్లు.

మూడవది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీసుకన్న రుణాల వడ్డీ, టోల్ వసూలు కంటే వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు మనందరికీ తెలిసినట్లుగా, రహదారులు నిర్మించినప్పుడు, ప్రభుత్వం పౌరుల నుండి టోల్ వసూలు చేస్తోంది, వాటితో బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తుంది. కాబట్టి బ్యాంకులకి రుణాలను తిరిగి చెల్లించడానికి టోల్ ప్రధాన ఆదాయ వనరు. అయితే NHAI చాలా రుణాలు తీసుకుందని మనందరికీ తెలుసు. బాహ్య రుణాలని పోల్చిచూస్తే march 2017లో 75385 కోట్ల నుండి 2022 నాటికి 3.48 లక్షల కోట్లకి పెరిగాయి. అప్పులు 4.6 రెట్లు పెరిగాయి.దీని కారణంగా వడ్డీ చెల్లింపు స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమయ వ్యవధిలో వడ్డీ,టోల్ వసూళ్ల మొత్తానికంటే 6 రెట్లు పెరిగింది. ఈ విధంగా ఉంటే ప్రభుత్వం రుణాన్ని ఎప్పటికీ చెల్లించలేదు. అసలుని పక్కన పెడితే, NHAI వడ్డీలను కూడా తిరిగి చెల్లించలేకపోతుంది.

జులై 2022 నాటికి ప్రాజెక్ట్‌లో 23 శాతం మాత్రమే పూర్తయింది. ఆర్థిక సంవత్సరాలు 2023,2024 లో బాహ్య రుణాలనిgs నిలిపివేయాలని ప్రభుత్వం NHAIని ఆదేశించింది.ఇప్పుడు NHAI ముందు రెండు పనులు ఉన్నాయి. హైవేని నిర్మించాలి, రుణ భారాన్ని తగ్గించాలి. కాబట్టి NHAI దానిని ఎలా అమలు చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే NHAI దగ్గర ఉన్న ఎంపికలను బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పన్ను చెల్లించే పౌరుడిగా మీరు దీన్ని బాగా అర్థం చేసుకుంటే, మీ ప్రభుత్వం ఎంత మెరుగ్గా పనిచేస్తుందో , ఎక్కడ తప్పు జరుగుతుందో మనకు స్పష్టత వస్తుంది.

ముందుగా, భవిష్యత్తు టోల్ రాబడిని సెక్యూరిటైజేషన్ చేయడం. ఈ పద్ధతిలో ప్రభుత్వం భవిష్యత్తు టోల్ రాబడికి భద్రత కల్పించడం ద్వారా భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కోసం డబ్బును సేకరిస్తుంది. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే టోల్ ఆదాయంతో ప్రభుత్వం పెట్టుబడిదారులకు అసలు, వడ్డీను తిరిగి చెల్లిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ముందుగా డబ్బును పొందుతుంది, పెట్టుబడిదారులు స్థిరమైన రాబడిని పొందుతారు,అలాగే దేశం హైవేని పొందుతుంది. కానీ ప్రస్తుతం NHAI తన ఆస్తులను మానిటైజేషన్ చేయడానికి చేసిన,చేస్తున్న ప్రయత్నాలు చాలా నెమ్మదిగా ఉన్నాయి, 1.6 లక్షల కోట్ల లక్ష్యం పెట్టుకుంటే, మొదటి రెండేళ్లలో కేవలం 10% మాత్రమే సాధించింది.

రెండవది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు(Invits). ఈ పద్ధతిలో ప్రభుత్వం InviTsని జారి చేస్తుంది. పెట్టుబడిదారులు invits లో వాటాదారులుగా మారి ప్రాజెక్ట్‌లకి కావాల్సిన మొత్తాన్ని ప్రభుత్వానికి అందిస్తారు.ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ నుండి వచ్చే లాభాలను 90% లాభాలను వాటాదారుల మధ్య విభజిస్తారు.

మూడవది, టోల్ ఆపరేటెడ్ ట్రాన్స్ఫర్ కాంట్రాక్ట్స్ (TOTs). ఈ పద్ధతిలో, NHAI ఒక పెట్టుబడిదారుడిని సంప్రదిస్తుంది , ఆ పెట్టుబడిదారుడు NHAIకి డబ్బును అందజేస్తాడు. దానికి ప్రతిగా NHAI పెట్టుబడిదారుడికి నిర్దిష్ట కాల వ్యవధి ఇచ్చి , ఆ ప్రాజెక్ట్‌ని ఆపరేట్ చేయమని, దాని నుండి వచ్చే ఆదాయాన్ని తీస్కోవడానికి అనుమతిస్తుంది. నిర్దిష్ట కాల వ్యవధి ముగిసిన తర్వాత NHAI ఆ ప్రాజెక్ట్‌‌కి యజమాని అవుతుంది,దాని నుండి వచ్చే టోల్ ఆదాయాన్ని పొందుతుంది. ఇప్పటి వరకు NHAI 11 TOTs లో కేవలం 6 TOTsని మాత్రమే సంపాదించింది.

ఈ విధంగా భారతమాల ప్రాజెక్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. భారతదేశ పౌరులుగా మనం దీని నుండి మూడు ప్రధాన విషయాలను అర్థం చేసుకోవాలి. భారతమాల వంటి ప్రాజెక్ట్‌‌లు గేమ్ చేంజెర్‌గా మారవచ్చు, అమలులో జాప్యం వలన మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మెగా ప్రాజెక్ట్‌ల ప్రకటనను వేడుక చేస్కోవడం ఎంత ముఖ్యమో అలాగే జాప్యంపై నిఘా ఉంచడం, అవసరమైనప్పుడు గళం విప్పడం కూడా అంతే ముఖ్యం. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికీ అభివృద్ధికి పెద్ద అడ్డంకి. గుజరాత్‌లో భూమి బ్యాంకులు ద్వారా సమస్యలను ప్రభుత్వం ఎలా పరిష్కరించిందో ,అది దేశమంతటా అమలు చేయాలని ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. NHAI ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వం దాని నుండి కోలుకుని, భారతమాల ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తుందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇంకా ఆలస్యం చేస్తే పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా ఖర్చవుతుంది. ప్రభుత్వానికి పన్ను చెల్లించే పౌరులుగా మనం అడగాల్సిన ప్రశ్నలు ఇవే. మనం అలా చేస్తే తప్ప మనకు మెరుగైన భారతదేశం ఉండదు.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×