EPAPER
Kirrak Couples Episode 1

Karthi Japan: మీ గోల్డ్ కొల్లగొట్టడానికి వస్తున్న.. ఈ మోస్ట్ వాంటెడ్ జపాన్ ఎవరు?

Karthi Japan: మీ గోల్డ్ కొల్లగొట్టడానికి వస్తున్న.. ఈ మోస్ట్ వాంటెడ్ జపాన్ ఎవరు?

Karthi Japan: సక్సెస్ తో సంబంధం లేకుండా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో స్టోరీస్ తీయడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే హీరో కార్తీ. ఎప్పటికప్పుడు వినూత్నమైన కథతో మంచి కమర్షియల్ ఫార్మాట్లో వెండితెరపై తనకంటూ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలి అని కార్తీ తపన పడుతుంటాడు. కార్తీ నుంచి నెక్స్ట్ రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ జపాన్. ఇంతకీ ఎవరి మోస్ట్ వాంటెడ్ జపాన్? ఒక్క టీజర్ తోటే హీరో క్యారెక్టర్ ని ఎంతో భిన్నంగా చూపించి మూవీపై ఆసక్తి రేకెత్తిస్తున్నారు.


బంగారుకి దాసోహం అనడమే కాకుండా.. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పాడిన పాటలో లాగా.. అనుభవించు రాజా, పుట్టింది.. పెరిగింది అందుకే.. అన్నట్లుగా హీరోని తెగ ఎలివేట్ చేస్తున్నారు. రాజ్ మురుగన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ జపాన్ చిత్రం దీపావళి కానుకగా నవంబర్లో విడుదల చేయాలి అని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ విభిన్నంగా ఉండడమే కాకుండా ప్రేక్షకులలో క్యూరియాసిటీతో కూడిన హైప్ క్రియేట్ చేశాయి.

పోస్టర్ లో హీరో ఎంతో భిన్నంగా వినూతమైన తరహాలో కనిపిస్తుంటాడు. అదే అనుకుంటే ఇప్పుడు విడుదల చేసిన టీజర్ తో మూవీలో హీరో ఒక నేషనల్ లెవెల్ గజదొంగ గా కనిపించబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక టీజర్ లో ఏముందంటే.. సిటీలో ఒక పెద్ద షాప్ లో 200 కోట్లకు విలువ చేసే నగలను ఎత్తుకుపోయిన ఆ దొంగ ఎవరో అన్న పాయింట్ పై వీడియో మొదలవుతుంది. ఇక తర్వాత ఒకటి కాదు ..రెండు కాదు.. మొత్తం నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ఆ దొంగ మొత్తానికి ముప్పు తిప్పలు పెట్టబోతాడు అన్న విషయం అర్థమవుతుంది. మరో పక్క పోలీసులు అతని కోసం ఎంతో కసిగా పట్టు వదలకుండా వెతకడం చూపిస్తారు.


గత కొద్ది కాలంగా టాలీవుడ్ కంటే కూడా కోలీవుడ్ లో విలన్ ,కమీడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సునీల్ ఈ మూవీలో కూడా ఉన్నాడు. అయితే ఇందులో విలన్ క్యారెక్టర్ కాదండోయ్.. మంచి కసి మీద ఉన్న సీరియస్ పోలీస్ ఆఫీసర్గా సునీల్ కనిపించబోతున్నాడు. దానికి తోడు జరిగిన ప్రతి దొంగతనం స్టైల్ చూసి ఇదేదో జపాన్ చేసిన దొంగతనంలా ఉంది అని అనడం, అతనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా 1082 కేసులు ఉన్నాయి అని తెలియజేయడం దొంగ స్టైల్ ఆఫ్ దొంగతనం హైలైట్ చేసే విధంగా ఉన్నాయి.

ఇక సడన్గా అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా ఈ తుంటరి బంగారు దొంగ జపాన్ టార్గెట్ గా మారుతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇందులో జపాన్ క్యారెక్టర్ లో కార్తి వేసుకున్న కళ్ళజోడు దగ్గర నుంచి నోట్లో బిగించుకున్న పన్ను వరకు అంతా గోల్డ్ తోనే ఉన్నట్లు చూపిస్తారు. అసలు ఈ జపాన్ ఎవరు ?అంత గోల్డ్ దొంగతనం చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? కనిపించే కథ వెనక ఉన్న అసలు కథ ఏమిటి అనేది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక టీజర్ మొత్తంలో మీరు ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ ఎవరు ఏమి పీకలేరు అనే డైలాగ్ సూపర్ హైలెట్ అయింది. దీన్ని బట్టి స్క్రీన్ పై సినిమాలో మరిన్ని డైలాగ్ బాంబులు పేలుతాయి అని అర్థమవుతుంది.

Related News

Telugu Producer : సెటిల్మెంట్ @ 5 కోట్లు… ఇక DNA టెస్ట్ అవసరం లేదు

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Big Stories

×